- సోమ్లాతండాను పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
కదిలిన యంత్రాంగం
Published Thu, Aug 4 2016 12:29 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
డోర్నకల్ : డోర్నకల్ పట్టణ శివారులోని సో మ్లాతండాకు బుధవారం పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకు లు తరలివచ్చారు. తండాలో గిరిజనులు జ్వ రాలతో బాధ పడుతున్న పరిస్థితిపై పత్రికలలో కథనాలు రావడంతో అంతా కదిలారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరుణ తన సిబ్బందితో వచ్చి నీటి నమూనాలను సేకరించారు. పీహెచ్‌సీ వైద్యులు మాధవీలత, ఉపేందర్ వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వర పీడితులకు పరీక్ష లు నిర్వహించారు. గ్రామసర్పంచ్ మాదా లావణ్య, ఎంపీపీ మేకపోతుల రమ్య, ఎంపీటీసీ సభ్యురాలు నలబోలు సునిత తండాలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. తండా లో పారిశుధ్యం, తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నాయంటూ స్థానికులు అధికారులతో వా గ్వాదానికి దిగారు. కాగా, డోర్నకల్ సీఐ వై.హరీష్‌కుమార్,ఎస్‌ఐలు ఖాదర్‌బాబా, హన్నన్ తండాలో పర్యటించి గ్రామపంచాయితి సి బ్బందితో వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
Advertisement