sacked aap minister
-
సందీప్‌కుమార్‌కు జుడిషియల్ రిమాండ్
న్యూఢిల్లీ: రేప్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు 14 రోజులు జుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. సందీప్ కుమార్‌కు పోలీస్ కస్టడీ ముగియడంతో శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణలో భాగంగా సందీప్‌కు తదుపరి పోలీస్ కస్టడీ అవసరంలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీంతో ఈ నెల 23 వరకు సందీప్‌ను జుడిషియల్ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పటి సీడీ వెలుగుచూడటంతో ఆయన పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు కోసం సందీప్ కార్యాలయానికి వెళ్లినపుడు మత్తమందు కలిపిన డ్రింక్ ఇచ్చి, తనపై అత్యాచారం చేశాడని సీడీలో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. -
ఆ సీడీలతో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు!
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల సీడీల కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. ఈ సీడీలను చూపించి తనను తన వ్యక్తిగత కార్యదర్శి బ్లాక్మెయిల్ చేశారని ఆయన పోలీసులకు తెలిపినట్టు సమాచారం. గతంలో సందీప్‌కుమార్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఈ సీడీలను లీక్ చేసి చాలామందికి పంచిపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సీడీల లీకేజీ వెనుక ప్రవీణ్ హస్తముందని, ఈ సీడీల వ్యవహారంలో అతను తనను బ్లాక్మెయిల్ చేశాడని నిందితుడు సందీప్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. సందీప్‌కుమార్ ఇద్దరు మహిళలతో రాసలీలలు గడుపుతున్న రెండు వేర్వేరు సీడీలు వెలుగుచూడటంతో ఆయనను పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ సీడీలో మంత్రితో కలసి ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 నెలల క్రితం రేషన్ కార్డు కోసం వెళితే సందీప్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు సందీప్‌పై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సందీప్‌ను కోర్టు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. -
'కేజ్రీ నన్నుచంపాలని కుట్రపన్నారు':ఆప్ మాజీ మంత్రి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను చంపాలని కుట్ర పన్నుతున్నారని పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను చంపాలని కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించిన మరుసటి రోజే.. పార్టీకి చెందిన అసిం అహ్మద్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. గత ఏడాది అవినీతి ఆరోపణలతో ఢిల్లీ కేబినేట్ నుంచి అహ్మద్ ఖాన్ ను తప్పించారు. గత ఏడాది అక్టోబర్ లో పౌరసరఫరాలు, పర్యావరణ శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న ఖాన్.. తన నియోజకవర్గంలో భవననిర్మాణానికి రూ.6 లక్షల లంచం తీసుకుని అనుమతులిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. గత 9-10 నెలల నుంచి కేజ్రీవాల్, పార్టీలో మరికొంత మంది నుంచి తనకు, తన కుటుంబానికి చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నట్లు మీడియా సమావేశంలో ఖాన్ పేర్కొన్నారు. పర్సనల్ గా, ఫోన్ ల ద్వారా బెదిరింపులు వస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ లకు లేఖలు కూడా రాసినట్లు వివరించారు. మీడియా సమావేశం ద్వారా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. మీడియాకు ప్రత్యేకంగా ఓ లెటర్ ను విడుదల చేశారు. త్వరలో కేజ్రీవాల్ అసలు రంగు బయటపెడతానని అన్నారు. కేజ్రీవాల్ కు సంబంధించిన కొన్ని ఆడియో, వీడియో టేపు తన వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆప్ ప్రతినిధి దీపక్ బాజ్ పాల్.. పార్టీ ఖాన్ పై ఏవైనా చర్యలు తీసుకోనుందా? అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా కేబినేట్ నుంచి ఖాన్ ను తొలగించి కేసును సీబీఐకు అప్పగించామని, ఇంతకంటే పెద్ద చర్య ఏదీ లేదని చెప్పారు. ఖాన్ ప్రాణాలకు ఆప్ నుంచి ముప్పుఉందనే ఆరోపణలపై స్పందించిన బాజ్ పాల్ సరైన సమయంలో ఆధారాలు లేని ఆరోపణలు చేశారని అన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు తమ సమయాన్ని వృథా చేసుకోరని భావిస్తున్నానని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు సీబీఐ కేసును తేలుస్తారని భావిస్తున్నామని చెప్పారు.