saddam
-
కాలనీలో కత్తిపోట్ల కలకలం..
నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి చంద్రశేఖర్ కాలనీలో కత్తిపోట్ల కలకలం సృష్టించింది. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది మధ్య జ రిగిన గొడవలో ఆవేశం పట్టలేక ఓ యువకుడు కత్తితో ముగ్గురిపై దాడి చేయగా వారు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రూరల్ ఎస్సై జి మహేశ్ తెలిపిన వివరాలు.. చంద్రశేఖర్ కాలనీ గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ విందులో ఎస్కే హుస్సేన్, ఎస్కే అక్బర్, అబ్దుల్, సద్దాం పాల్గొన్నారు. వీరిమధ్య మాటమాట పెరిగటంతో గొడవ జరిగింది. ఇంతలో సద్దాం తన స్నేహితుడు అమీర్‌ఖాన్‌కు ఫోన్‌చేసి తనను కొడుతున్నారని చెప్పాడు. దీంతో ఆయన స్నేహితులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఇందులో ఎస్కే నవీద్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్లి ఏమైందని ఎందుకని కొడుతున్నారని అడుగగా కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో హుస్సేన్, అక్బర్, అమీర్‌ఖాన్‌కు గాయలు కాగా, ఎస్కే నవీద్‌ను సద్దాం కత్తితో పొడిచాడు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అమీర్‌ఖాన్ బావ షేక్ మోబిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కత్తితో దాడి చేసిన సద్దాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రా..! సద్దాం. ఆట తమాషాగా ముగించేద్దాం..!!
-
షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్
సాక్షి, నల్లగొండ : నాంపల్లిలో షేక్ సద్దాం అనే యువకుడి తల నరికిన హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం పోలీసు స్టేషన్లో లొంగిపోయిన మహ్మద్ గౌస్. మహ్మద్ ఇమ్రాన్‌లను నిందితులుగా చేర్చారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని, వారు తెచ్చిన తలను, ఒక బైక్ ను, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకేసు పూర్తి వివరాలను నాంపల్లి పోలీసుస్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇంచార్జీ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు వెల్లడించారు. (చదవండి : నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్ స్టేషన్‌కి..) ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం... మహమ్మద్ గౌస్, మహమ్మద్ ఇమ్రాన్ లు తమ చిన్నమ్మ కూతురు రజియా మృతికి కారణమనే సద్దాంపై పగ పెంచుకున్నారు. రజియాతో సహజీవనం చేసిన సద్దాంమే ఆమె మృతి కారణం అని కేసు నమోదు అయ్యింది. రజియా హత్య అనంతరం ఆమె ఇద్దరు పిల్లల బాగోగులను చూస్తానని సద్దాం అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ తర్వాత వారి గురుంచి పట్టించుకోలేదు. పలుమార్లు పెద్దలు అడిగినా సద్దాం నిర్లక్ష్యం చేశారు. దీంతో రజియా పెద్దమ్మ కొడుకులు అయిన గౌస్, ఇమ్రాన్ లు సద్దాంపై కోపం పెంచుకున్నారు. శనివారం నాంపల్లికి వచ్చిన సద్దాంకు.. ఓ టీ కొట్టు వద్ద గౌస్, ఇమ్రాన్ లు ఎదురు రాగా రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. అప్పటికే ఉన్న కోపంతో పాటు సద్దాం నిన్న వ్యవరించిన తీరుతో వెంటనే ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే స్థానిక మద్యం షాప్ లో మద్యం కొనుగోలు చేసి హత్యకు ప్లాన్ చేశారు. కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో మాటు వేశారు. స్నేహితుడు శివ ఇంట్లో సద్దాం ఉన్నాడని తెలుసుకుని అదును కోసం వేచి చూసారు. శివ ఇంటి నుంచి సద్దాం బయటకు రాగానే గౌస్, ఇమ్రాన్ లు కత్తితో దాడికి దిగారు. తలను మొత్తం నరికి మొండెం నుంచి వేరు చేశారు. అక్కడి నుంచి బైక్ పై నేరుగా నాంపల్లి పోలీసు స్టేషన్ కు తలతో పాటు కత్తితో వెళ్లి నిందితులు లొంగిపోయారు. సద్దాం హత్యలో ఇద్దరికి పాత్ర ఉందని తేల్చిన పోలీసులు గౌస్, ఇమ్రాన్ లపై 302, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు నల్లగొండ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు వివరించారు. -
పెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడు
న్యాయుం కోసం.. అత్తింటి ఎదుట బాధితురాలి ఆందోళన పాపయ్యుపేట(చెన్నారావుపేట): ‘నీతోనే జీవిస్తా.. కడదాక కలిసుంటా’ అనని ప్రేమతో మాయమాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు ఆమెను పెళ్లి చేసుకుని కూతురు పుట్టాక వదిలేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు చేసేది లేక భర్త ఇంటి ఎదుట న్యాయపోరాటానికి దిగింది. ఈ ఘటన వుండలంలోని పాపయ్యుపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యూకూబీ, అజాజ్ దంపతుల కుమారుడు సద్దాం, నెక్కొండ గ్రామానికి చెందిన అబ్బదాసు నాగమ్మ, సమ్మయ్యు దంపతుల కూతురు ప్రియాంకను ఐదేళ్ల క్రితం ప్రేమించాడు. హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వారి సంసార జీవితంలో ఏడు నెలల క్రితం కువూరుడు జన్మించాడు. ఇటీవల అతడు ఆమెపెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడును వదిలేసి హైదరాబాద్ నుంచి పాపయ్యుపేటకు వచ్చాడు. దీంతో ప్రియాంక పాపయ్యపేటకు చేరుకుని సద్దాం ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది. కాగా గ్రావుస్తులు ఆమె ఆందోళనకు మద్దతు తెలిపారు. పెళ్లి చేసుకుని, కువూరుడు జన్మించాక మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు.