Safe Driving
-
కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కుమారి ఆంటీ.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. హైరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆమె మాటలతో రీల్స్ కూడా క్రియెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో ఓ ట్వీట్ చేశారు. దీనిని చూస్తుంటే కుమారీ ఆంటీని పోలీసులు కూడా ఫాలో అవుతున్నారనిపిస్తుంది. అసలేం పోస్టు చేశారంటే.. ‘ మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా’ అంటూ బుల్లెట్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఫొటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు..ట్రాఫిక్ నియమాలు పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. Midhi motham 1000 ayindhi, user charges extra...#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024 ఇది చూసిన నెటిజన్లు.. కుమారి ఆంటీ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు. కుమారి ఆంటీని బాగానే ఫాలో అవుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎమోజీలు, కుమారి ఆంటీ డైలాగ్ వీడియోలు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇదొక్కడే కాదు సమయం, సందర్భాన్ని బట్టి సినిమా డైలాగ్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్స్‌ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటారు. చదవండి: ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన -
ఔటర్, హైవేలపై జాగ్రత్త.. పొగ మంచులో ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ, వారాంతం కలిసి రావటంతో నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తెల్లవారుజామున ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత సూర్యకాంతిలో ప్రయాణించడం శ్రేయస్కరమని సూచించారు. వ్యక్తిగత వాహనాల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఔటర్, హైవేలపై జాగ్రత్త.. దట్టమైన పొగమంచు కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు, రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రహదారులలో వాహనాలను నిలపకూడదు. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు ఏమాత్రం నలత అనిపించినా, నిద్ర వచ్చినా రోడ్డు మీద వాహనాన్ని క్యారేజ్‌పై నిలివేయకుండా రోడ్డు దిగి ఒక పక్కన లేదా కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. పొగ మంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించదు. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. బ్రేకులు వేసేటప్పుడు వెనకాల వస్తున్న వాహనాలను అద్దాల నుంచి చూసి మాత్రమే వేయాలి తప్ప అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, ఇతర వాహన డ్రైవర్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా బీమ్ హెడ్లైట్లను వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి ► ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించాలి. ► హజార్డ్ లైట్లను ఆన్ చేసి ఉంచాలి. ► సెల్ఫోన్లో మాట్లాడుతూ, కారులో అధిక శబ్ధం మ్యూజిక్‌తో ప్రయాణించకూడదు. వెనకాల వచ్చే వాహనాల హారన్ వినిపించదు. ► పొగమంచులో ఎదుటి వాహనాలు, పశువులు స్పష్టంగా కనిపించవు. అందుకే తరుచూ హారన్ కొడుతూ ప్రయాణించడం ఉత్తమం. ► లేన్ మారుతున్నప్పుడు లేదా మలుపుల సమయంలో కిటికీలను కిందికి దింపాలి. దీంతో వెనకాల వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా వినిపిస్తుంది. ► ఐదారు గంటల పాటు కంటిన్యూగా డ్రైవింగ్ చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. (క్లిక్ చేయండి: పండుగ ప్రయాణం.. నరకయాతన) -
శీతాకాలం వచ్చేసింది.. వాహనదారులు వీటిని తప్పక పాటించాలి.. లేదంటే..
సాక్షి,సీతంపేట(శ్రీకాకుళం): శీతాకాలం ప్రారంభంతోనే పొగమంచు దట్టంగా కరుస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచులో వాహ నం నడపడం సాహసంతో కూడుకున్నదే. ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరకు వచ్చేవరకూ గుర్తించలేం. అలాంటి సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలా బారిన పడేందుకు అవకాశం ఉంది. వాతావరణ ఎలా ఉన్నా ప్రజలు తమ పనుల నిమిత్తం ప్రయాణించక తప్పదు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పొగమంచులో ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ► పొగమంచు కురిసే సమయంలో వీలైనంత వరకు వాహనాలను నడపకపోడం మంచిది ► రహదారిపై మంచు తీవ్రత పెరిగితే సురక్షితమైన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి ► కార్లు, ద్విచక్రవాహనాలపై సాధ్యమైనంత తక్కువ దూరం ప్రయాణం చేయాలి ► పొగమంచు కమ్ముకున్నపుడు వాహన వేగం తగ్గించాలి ► ఎదురెదురుగా వస్తున్న వారు గమనించేలా హెడ్‌లైట్స్ ఆన్‌చేసి ఉంచాలి. కొత్త వాహనాలకు ఆ సమస్య లేదు. ఎల్లపుడు హెడ్‌లైట్స్ వెలిగే ఉంటాయి ► వాహనాలకు వైపర్స్ పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి ► డ్రైవర్ పక్కన కూర్చునే వారు డ్రైవింగ్ తీరును ఎప్పటికపుడు పర్యవేక్షించాలి ► వాహనం వెనుక.. ముందు రేడియం స్టిక్కర్లు విధిగా అతికించాలి ► వాహనానికి అమర్చిన రెడ్‌సిగ్నల్స్, బ్రేక్ సిగ్నల్స్ పనితీరు సరిచూసుకోవాలి ► పొగమంచు ఉన్నపుడు ఎదురుగా వెళ్లున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నం మానుకోవాలి ప్రమాదాలకు ఆస్కారం.. ► రహదారుల పక్కనే వాహనాలు నిలపడం, మలుపులతో కూడిన రహదారులు ఉండడం ► పరిమితం కంటే అధికవేగంతో వాహనాలు నడపడం ► దట్టంగా ఉన్న మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం ► రహదారి వెంబడి ఉన్న డివైడర్లను ఢీకోవడం వంటి కారణంగా ఈ సీజన్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది చదవండి: మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రేసులో సిక్కోలు మహిళ -
‘సేఫ్’ సర్టిఫికెట్
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ ధరించలేదని వాహనదారుడికి జరిమానా, సీటు బెల్ట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు ఫైన్, సిగ్నల్ జంపింగ్ చేశాడని మరో వాహనదారుడికి ఈ–చలాన్...ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనులను శిక్షించినట్లుగానే...ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులనూ గుర్తించి ‘సర్టిఫికెట్ ఆఫ్ సేఫ్ డ్రైవింగ్’ పేరుతో స్టిక్కర్ ఇచ్చి ప్రశంసిస్తున్నారు. అబుదాబీలో అమలులో ఉన్న ఈ విధానాన్ని ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ పేరుతో దేశంలోనే తొలిసారిగా గురువారం చింతల్‌కుంట ఎక్స్‌రోడ్డులో సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వస్తున్న కొన్ని వాహనాలను తనిఖీ చేసిన సీపీ ఈ–చలాన్లో జరిమానాలు లేని కారు డ్రైవింగ్ చేస్తున్న లేడీ డాక్టర్ రిచా, సీనియర్ సిటిజన్ గోపాల కే సురేఖతో పాటు మరికొందరి వాహనాలకు ‘సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్’ను అతికించారు. అనంతరం వారిని సర్టిఫికెట్తో సన్మానించారు. చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఎదుటివారికి ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని ప్రోత్సహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ ఆరు నెలల్లో మరో నాలుగువేల వాహనాలు, వచ్చే ఏడాది ఎనిమిది వేల వాహనచోదకులను గుర్తించి సర్టిఫికెట్లతో సత్కరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రోజుకు 24 వాహనాల చొప్పున ఆరు నెలల్లో నాలుగువేల మంది వాహనచోదకులను గుర్తించి ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అబుదాబీలో 2016 అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తుండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ట్రాఫిక్ నియమాలు పాటించే అలవాటు పెరిగిందన్నారు. ఆ తరహా మార్పు త్వరలో రాచకొండ పరిధిలోని వాహనదారుల్లో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూ సేఫ్ డ్రైవర్ల గుర్తింపు... ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇకపై ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న మర్యాద వాహనచోదకులను కూడా గుర్తించనున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలో ప్రతిరోజూ కొన్ని వాహనాలను గుర్తించి సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను అందించనున్నారు. తద్వారా వారు ట్రాఫిక్ నియమాలను పాటించడంతో పాటు ఇతరులను చైతన్యం చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన వాహనచోదకుడు ఆరు నెలల పాటు మళ్లీ ట్రాఫిక్ నియమాలు తూచతప్పకుండా పాటిస్తే రివార్డుతో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జోన్ల ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రియా ‘కన్నుగీటు’తో ప్రజల్లో అవగాహన
వడోదర : ఒక్క కన్ను గీటుతో మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎంత ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే. ఆ కన్నుగీటుతో ఆమెకి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ పాపులారిటీని వడోదర సిటీ పోలీసులు, సురక్షితమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడానికి వాడుతున్నారు. ప్రియా ప్రకాశ్ కన్ను గీటుతో ఓ క్యాప్షన్ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ‘రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. పరధ్యానంగా లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. #ట్రాఫిక్ఏక్సర్కార్.. ’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీసులు క్రియేటివ్‌తో రూపొందించిన ఈ పోస్టర్, ప్రస్తుతం వైరల్ అయింది. ఈ మాదిరిగా సందేశాన్ని తెలియజేయడం గొప్ప మార్గమంటూ ట్విటర్ యూజర్లు పొగుడుతున్నారు. ‘ఈ వినూత్న బ్యానర్ మేము చాలా ప్రేమిస్తున్నాం. అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న వర్క్ చాలా అభినందనీయం’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వేధింపులు, వెంబడింపులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఫేమస్ 'హసినా మాన్ జాయేగి' పాటను ఉపయోగించింది మరో పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. యువతరాన్ని ఎక్కువగా చేరుకోడానికి అంతకముందు సిటీ పోలీసులు సోషల్ మీడియా క్రియేటివిటీని వాడారు. ఇటీవల వడోదర, ముంబై పోలీసు, బెంగళూరు పోలీసులు ఆకట్టుకునే పదబంధాలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. -
సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాలు దూరం
హన్మకొండ : సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమా దాలు దూరమవుతాయని ఆర్టీసీ కరీం నగర్ జోన్ ఈడీ గరిమిల్ల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ శిక్షణ కాలే జీలో ప్రమాద రహిత వారోత్సవాలను పురస్కరించుకుని శిక్షణ కార్యక్రమం జరి గింది. ఈ కార్యక్రమంలో ఈడీ పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్ర యాణమని ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ఈ నమ్మకాన్ని నిలుపుకునేల డ్రైవర్లు జాగ్ర త్తగా బస్సు నడుపాలన్నారు. ప్రయా ణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చా లన్నారు. ప్రధానంగా వర్షాకాలంలో డ్రైవర్లు జాగ్రత్తగా బస్సు నడుపాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ వరంగల్ ఇంచార్జీ ఆర్ఎంజీ.ఎస్.ఎస్.సురేష్, డిప్యూటీ సీఎం ఈ జి.రాములు, ప్రిన్సిపాల్ వీర్ల బాస్క ర్రావు, సూపర్వైజర్ బిక్షపతి, డ్రైవింగ్ ఇన్స్స్ట్రక్టర్ రాజు పాల్గొన్నారు.