రాజధాని కోసం రైతులంతా భూములివ్వాలి: ఎంపీ రాయపాటి
గుంటూరు: నాగార్జున సాగర్ కుడికాల్వకు కనీసం 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని లేకపోతే రబీ ఆయకట్టు ఎండిపోతుందని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. సాగర్ జల వివాదంపై కృష్ణా ట్రిబ్యునల్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణంకోసం రైతులంతా భూములివ్వాలని కోరారు. రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎక్కువ పరిహారం వచ్చేలా తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని రాయపాటి ప్రజలకు హామీ ఇచ్చారు.