టీపీసీసీ షాడో కేబినెట్ ఏర్పాటు
హైదరాబాద్: అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి చైర్మన్‌గా టీపీసీసీ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలంతా సోమవారం సమావేశమయ్యారు. హాజరైన వారిలో 17 మంది మాజీ మంత్రులు, ఎంపీలు ఉన్నారు. విభజన చట్టంలో హామీలు, టీఆర్ఎస్ మేనిఫెస్టో, కేసీఆర్ ప్రకటనల అమలు అంశంపై ఈ కమిటీ పరిశీలించింది.
హామీలు అమలయ్యే దాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫిరాయింపులతోనే కేసీఆర్ రాజకీయ కాలుష్యం పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల హైదరాబాద్‌కు పెట్టుబడుల ఇబ్బందుల కలిగే పరిస్థితి ఉందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తామని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.