సెమీస్‌లో సాయిప్రణీత్
బ్రెంట్వుడ్ (అమెరికా): యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21-8, 21-14తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)తో సాయిప్రణీత్ తలపడతాడు. మరోవైపు మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) 21-17, 21-14తో జోనా -నెల్టె (జర్మనీ)లపై; పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) 22-20, 21-13తో ఎలిస్-లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్)లపై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.