sakala janula bheri
-
సకల జనభేరి
-
‘కేసీఆర్‌పై యుద్ధం చేసేవారిని అభినందిస్తా’
-
త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్
-
‘కేసీఆర్‌ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రతికి ఉండగానే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌పై యుద్ధం చేసే ప్రతి ఒక్కరినీ తాను అభినందిస్తానని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు మొట్టమొదటి సారిగా సవాల్ విసిరిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని కేసీఆర్ అంటే.. ఎంతమందిని డిస్మిస్ చేసినా తాము సమ్మెలో పాల్గొంటామని కార్మికులు ధిక్కరించారు. ఆర్టీసీని అమ్ముతామని కేసీఆర్ అంటే... ఆర్టీసీని కాపాడుకుంటామని కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఆర్టీసీని ఖతం చేయాలనుకుంటే కేసీఆర్ ఖతం అవుతాడు. కేసీఆర్ ఒంటరై ఓటమికి దగ్గరగా ఉన్నాడు. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం... కేసీఆర్ వర్సెస్ సమస్త తెలంగాణ సమాజంగా మారింది. హిట్లర్ లాగా కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి గానీ మనం చేసుకోవద్దు. కేసీఆర్ తప్పా అన్ని పార్టీలు మనకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్‌ను ఓడగొట్టి వేరేవాళ్ళని గెలిపిద్దామ’ని మందకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను సాగనంపుదాం సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డి అన్నారు. స్వప్రయోజనాల కోసం ఆర్టీసీని వాడుకుని ఇప్పుడు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కోదండరాంను కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో రక్షణ ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు స్టీరింగ్ కాదు సుదర్శన చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక వీధి లైట్స్ కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు జి. వివేక్ ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వారి ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. -
‘మేనిఫెస్టోలో కేసీఆర్ ఆ విషయం చెప్పారా’
-
ఆర్టీసీ సమ్మె : ‘మేనిఫెస్టోలో కేసీఆర్ ఆ విషయం చెప్పారా’
సాక్షి, హైదరాబాద్: గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బుధవారం సకల జనుల సమరభేరికి పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ సభలో ఆర్టీసీ కార్మికులు, విపక్ష పార్టీల నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. సకల జనుల సమరభేరి సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్తున్న కేసీఆర్ డీజిల్ మీద 27.5 శాతం వ్యాట్ ఎందుకు వేస్తున్నారని.. ఇది మేనిఫెస్టోలో ఉందా అని ప్రశ్నించారు. 20 శాతం బస్సులను ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి.. వాటిని మేఘా కృష్ణారెడ్డికి ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అని చురకలంటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదని.. ఊసరవెళ్లి ఎర్రబెల్లి అంటారు. సీఎం కేసీఆర్ కూడా విలీనం అంశం తమ మేనిఫెస్టోలో లేదు అంటారు.. మరి మీ కొడుకు, కూతురు, అల్లుడుకు మంత్రి పదవులు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారా. 50 వేల కార్మికుల కుటుంబాలకు మద్దతుగా నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మద్దతుగా నిలించింది. ఏ స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజలు పోరాడారో.. మళ్లీ నేడు అదే స్వేచ్ఛ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. సకలజనుల సమరభేరికి కోర్టు అనుమతిచ్చి 24 గంటలు గడువకముందే వందల కిలోమీటర్ల నుంచి కార్మిక సోదరులు సరూర్‌నగర్ గ్రౌండ్లో కదం తొక్కారు. ఇది తెలంగాణ ప్రజల స్ఫూర్తి’ అని రేవంత్ అన్నారు. -
'కృత్రిమ ఉద్యమాలను తిప్పికొట్టాలి'
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు డబ్బు సంచులతో కృత్రిమ ఉద్యమాలు నిర్వహిస్తున్నారని.., తెలంగాణ ఉద్యమం త్యాగాలతో, రక్తతర్పణతో నడిచిందని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, 29న హైదరాబాద్‌లో జరిగే సకల జనుల భేరిని విజయవంతంచేయాలని కోరుతూ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని రిక్కాబజార్ హైస్కూల్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మయ్య మాట్లాడుతూ... సీమాంధ్రులు మనిషికి రోజుకు రూ.500 ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారని, తెలంగాణ ప్రజలు వారసత్వంగా, సంప్రదాయంగా సాహసమైన ఉద్యమాన్ని భావితరాల కోసం నిర్మించారని పేర్కొన్నారు. సీట్లు, ఓట్ల కోసం చేసే ఉద్యమాలను తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీకంటే ప్రజలు ముఖ్యమని మాట్లాడుతున్నాడని.., ‘నీవు ఎప్పుడు ప్రజలకు ముఖ్యమంత్రివి అయ్యావు... నిన్ను ఎవరు ఎన్నుకున్నారు... నువ్వు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రివి’ అంటూ ఎద్దేవా చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కిరణ్ సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని, ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిలా అప్రజాస్వామికంగా మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చివరి బంతి వరకు పోరాడుతామని అంటున్నాడు కానీ, తెలంగాణ ప్రజలకు ఫిరంగుల ఆటకూడా తెలుసని, సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. ‘నీవు చిన్న పిల్ల వాడివి.. తెలంగాణ చరిత్ర నీకు తెలియదు. నిన్ను కూలదోస్తామని చెప్పిమరి నైజాం నవాబుకు గోరికట్టిన చరిత్రను తెలుసుకో’ అని ముఖ్యమంత్రికి సూచించారు. ఓటమితో వెనుదిరిగిన చరిత్ర తెలంగాణలో జరిగిన ఉద్యమాలకు లేదని చెప్పారు. హైదారాబాద్‌లో కబ్జా భూములు, సంపదను కాపాడుకుంటూ పెత్తనం చేసేందుకే తెలంగాణను అడ్డుకుంటున్నారని చెప్పారు. తెలంగాణను అడ్డుకుంటే సీమాంధ్రుల ఆర్థిక వనరులు దెబ్బతిసేలా కార్యచరణ రూపొందించి ఉద్యమాలు సాగిస్తామని హెచ్చరించారు. న్యూడెమోక్రసీ కేంద్ర సంఘం నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని చెప్పి సంబరాలు చేసుకున్న సమయంలో కుంటి సాకులతో అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే ఈసారి ఊరుకోమని, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడాలని, తెలంగాణ ప్రజలు దేనికయినా సిద్ధం కావాలని అన్నారు. మూడు లక్షల మంది ప్రజలను ముంచేందుకు కుట్ర జరుగుతుందని, పోలవరం నిర్మాణాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న బొగ్గును తరలించేందుకు కుట్ర జరుగుతోందని, ఇక్కడ సంపదతో ఆంధ్ర ప్రాంతంలో ప్రయోజనం కలిగించేలా పాలకులు ప్రణాళిక రచిస్తున్నారని అన్నారు. పీవోడబ్లూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, పార్టీ రాష్ట్ర నాయకులు గోవర్దన్ మాట్లాడుతూ.. తోడేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసే పరిస్థితి ఉందని తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు ఉద్యమం సాగుతుందన్నారు. సీమాంధ్రుల ఆటలు సాగనీయమని, ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తొలుత స్థానిక డిగ్రీ కళాశాల నుంచి వందలాదిగా నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలు చేతబూని ప్రదర్శనగా బయలుదేరి ఇల్లెందు క్రాస్ రోడ్, కలెక్టరేట్, వైరా రోడ్, గాంధీచౌక్, మయూరీ సెంటర్ మీదుగా రిక్కా బజార్ స్కూల్‌కు చేరుకున్నారు. ఈ సభలో అరుణోదయ కళాకారులు ఆటపాటలతో సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌని ఐలయ్య, ముక్తార్ పాషా, జడ సత్యనారాయణ, సీతారామయ్య, రాములు, హన్మంతరావు, గిరి,టీఎన్జీవో నాయకులు నందగిరి శ్రీను, రమణ యాదవ్, రచయితల వేదిక నాయకులు తిరుమల రావు, భాస్కర్, సుగుణారావు, పీడీఎస్‌యూ నాయకులు నర్సింహారావు, బానూ చందర్, రాకేష్ పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో సకలజనుల భేరి
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 29న నగరంలో నిర్వహించబోయే సకల జనుల భేరి సదస్సును అత్యంత క్రమశిక్షణతో, పకడ్బందీ ప్రణాళికతో జరపాలని తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం నేతృత్వంలో హైదరాబాద్‌లోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ ముఖ్యులు సమావేశమయ్యారు. సకల జనుల భేరి వేదిక, అనుమతి, సభా నిర్వహణ, విద్యార్థుల పాత్ర వంటివాటిపై చర్చించారు. దీనికోసం ఒక నిర్వహణ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిలో జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, సీ విఠల్, వి. శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, రాజేందర్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ ఇన్‌చార్జీగా రసమయి బాలకిషన్, మైదానం నిర్వహణకు ఇన్‌చార్జీగా పి. రఘు (విద్యుత్ జేఏసీ) వ్యవహరిస్తారు. పార్కింగ్ వ్యవహారాన్ని సీ విఠల్ పర్యవేక్షిస్తారు. 27న అన్నిపార్టీల ప్రతినిధులతో మళ్లీ సమావేశం కానున్నారు. సభావేదికపై సుమారు 160-200 మంది ప్రతినిధులు వేదికపై ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. పార్టీల నుండి, సంఘాల నుండి ఒకొక్కరికి మాత్రమే ప్రసంగించే అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకున్నారు. ప్రసంగించే వారు 30-40 మందికి మించకుండా నియంత్రించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనేలా సమాయత్తం చేయాలని విద్యార్థి నేతలను కోరారు. అలాగే, సభ జరిగే నిజాం కళాశాల మైదానాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులతో కలిసి కోదండరాం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీమాంధ్రుల కృత్రిమ ఉద్యమానికి, అవాస్తవ ప్రచారాలకు సభ ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కోదరండరాం అన్నారు. సీపీఐ నేతలతో టీజేఏసీ భేటీ తెలంగాణ జేఏసీ నేతలు బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ, కార్యదర్శివర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ఈనెల 29న సకల జనుల భేరికి మద్దతు ఇవ్వాలని కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య వారికి విజ్ఞప్తి చేశారు. గురువారం జరిగే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో చర్చించి చెబుతామని నారాయణ అన్నట్టు తెలిసింది.