sakambari
-
శాకాంబరిగా వేగులమ్మ దర్శనం
గొల్లప్రోలు : దుర్గాడ గ్రామదేవత వేగులమ్మ శాకాంబరిగా మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం చివరి రోజు, అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని, ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. సుమారు 10 అడుగులు పొడవు కలిగిన విగ్రహానికి కూరగాయలు, నిమ్మకాయలతో తయారు చేసిన మాలలను వేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు వేగులమ్మకు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి 200 కిలోల కూరగాయలతో అమ్మవారిని అలంకరించినట్టు ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు తెలిపారు. శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద ముల్తైదువులకు బుధవారం పసుపు,కుంకుమ అందజేస్తామని చెప్పారు. ఏర్పాట్లను ఆలయకమిటీ పర్యవేక్షించింది. -
శాకంబరిగా అమ్మవారు
-
శాకంబరిగా శక్తిస్వరూపిణి
-
శాకంబరిదేవిగా సత్యమ్మ
అంబారుపేట (నందిగామ రూరల్) : అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ముగిశాయని, అమ్మవారిని అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన వంటలతో శుక్రవారం భారీ అన్న సమారాధన జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి మన్నెం నరసింహారావు కోరారు. 21ఎన్డిజిఎమ్02 ః శాకంబరిదేవి అలంకారంలో సత్యమ్మ అమ్మవారు -
పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు
-
శాకాంబరీ..నమో నమ :
-
ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు