salaries increased
-
న్యాయాధికారుల వేతనం మూడు రెట్లు
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ సిఫారసు చేసింది. పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016 ఏడాదినుంచి అమలయ్యేలా పెంచాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇవి అమలుల్లోకి రావచ్చు. 2017లో ఏర్పాటైన ఈ కమిషన్ తన నివేదికను జనవరి 29న సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలోని ఈ కమిషన్ దిగువ కోర్టుల్లో జడ్జీల వ్యవస్థ, పని విధానాలను పరిశీలించింది. తుది నివేదిక ప్రకారం.. జూనియర్ సివిల్ జడ్జి/ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వేతనాన్ని రూ.27,700 నుంచి రూ.77,840కు పెంచాలి. ఆపై సీనియర్ సివిల్ జడ్జి వేతనం రూ.1,11,000 లేదా, అంతకంటే ఎక్కువ.. జిల్లా జడ్జీల ప్రారంభ వేతనం రూ.1,44,840 ఉండాలి. జిల్లా జడ్జీల వేతనం గరిష్టంగా రూ.2,24,100 ఉండాలి. చివరి వేతనంలో 50 శాతం పింఛనుగా ఇవ్వాలి. -
హోంగార్డుల జీతాలు పెంపు
-
సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
సాక్షి, ఒంగోలు అర్బన్ : సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంచుతూ వెంటనే జీఓను వెంటనే విడుదల చేయాలని ఏపి స్టేట్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి రావూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ జీఓ 151 వచ్చినా 2014 నుంచి వేతనాలు, అరియర్స్ చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. గ్రాడ్యుయుటీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సహకార సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ధర్నాకు పెంట్యాల హనుమంతరావు, నాయకులు కె. లక్ష్మీనారాయణ, షేక్ మౌళాలి, శ్రీకాంత్, ఈశ్వర్, రామాంజనేయరెడ్డి, రత్నకుమారి, పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు
హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. 40 శాతం వరకు ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్నారు. బాధ్యతతో పనిచేసి మంచి పేరు తేవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు. పీహెచ్సీ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.6వేల నుంచి రూ.12 వేలకు, నెట్వర్క్ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.7 వేల నుంచి రూ.12వేలకు పెంచింది. వీరితో పాటు ఆరోగ్యశ్రీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.