హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. 40 శాతం వరకు ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్నారు. బాధ్యతతో పనిచేసి మంచి పేరు తేవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు.
పీహెచ్సీ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.6వేల నుంచి రూ.12 వేలకు, నెట్వర్క్ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.7 వేల నుంచి రూ.12వేలకు పెంచింది. వీరితో పాటు ఆరోగ్యశ్రీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు
Published Thu, May 12 2016 6:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement