salman bhutt
-
విదేశీ లీగ్‌ల కోసం రెండేసి నెలలు దూరంగా ఉంటారు.. కానీ.. టెస్టులు ఆడరా?
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ విమర్శల వర్షం కురిపించాడు. లీగ్ మ్యాచ్‌ల కోసం నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండొచ్చు కానీ... దేశం కోసం ఆడలేవా అంటూ మండిపడ్డాడు. కాగా సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ప్రొటిస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 113 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు డికాక్. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు 29 ఏళ్ల డికాక్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో డికాక్ ఆకస్మిక నిర్ణయం పట్ల సల్మాన్ భట్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. ఇలాంటి నిర్ణయాలు సెలక్షన్ పాలసీ, కెప్టెన్ మైండ్‌సెట్‌ను ప్రభావితం చేస్తాయని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ గత ఏడాదిన్నర కాలంగా క్వింటన్ డికాక్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఆ బాధ్యతల్లో కొనసాగలేకపోయాడు. ఇప్పుడేమో ఒక టెస్టు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి ఆలోచనా విధానం, ప్రకటనలు జట్టులోని వాతావరణాన్ని నాశనం చేస్తాయి. సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక ఇటీవల కాలంలో రిటైర్మెంట్ డ్రామా ఎక్కువైందన్న సల్మాన్ భట్... ‘‘అకస్మాత్తుగా ఆటకు వీడ్కోలు పలకడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు రెండేసి నెలల పాటు కుటుంబాలకు దూరంగా ఉన్నపుడు ఎలాంటి సమస్యలు ఎదురుకావడం లేదా? టెస్టు క్రికెట్ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు? దేశం కోసం ఆడుతున్నపుడే అన్నీ గుర్తుకువస్తాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘కొంతమంది లీగ్ క్రికెట్ ఆడితే సరిపోతుంది అనుకుంటున్నారు. టెస్టులతో పనిలేదు అని భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లకు ఉండాల్సిన లక్షణం కాదిది. డికాక్ రిటైర్మెంట్ గురించి ఇంతకంటే మంచిగా మాట్లాడటం నా వల్ల కాదు’’ అంటూ సల్మాన్ క్రికెటర్ల తీరును విమర్శించాడు. చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం! -
సంజూ బద్దకస్తుడు.. అసలు అలా ఎందుకు చేశాడు?
ఇస్లామాబాద్: టీమిండియా వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఆట తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బద్దకస్తుడని, శ్రీలంక పర్యటనలో తను అవుట్ అయిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొన్నాడు. లంక బౌలర్ వహిందు హసరంగ మాయాజాలంలో పడి తేలికగా వికెట్ సమర్పించుకున్నాడని విమర్శించాడు. కాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేతో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టిన సంజూ శాంసన్ ఆ మ్యాచ్‌లో 46 పరుగులతో రాణించాడు. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 34 (27, 7,0) పరుగులు మాత్రమే చేశాడు. తొలి, చివరి టీ20లో లంక బౌలర్ హసరంగ బౌలింగ్‌లోనే సంజూ పెవిలియన్ చేరడం గమనార్హం. అది కూడా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముఖ్యంగా మూడో టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘ నాకెందుకో సంజూ శాంసన్ బద్దకస్తుడైన బ్యాట్స్‌మెన్ అనిపిస్తుంది. ఒక బౌలర్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినపుడు.. తెలివిగా తప్పించుకోవాలి గానీ, అతడి వలకు చిక్కడం దేనికి? సంజూ శాంసన్ టెక్నిక్‌ను అంచనా వేసిన హసరంగ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నిజానికి, జట్టులో ఉంది ఐదుగురు బ్యాట్స్మెన్లు. అందులో తను కూడా ఒకడని తెలుసు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ తను ఈ విషయాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అసలు అవుట్ కాకుండా ఉండేందుకు సంజూ ప్రయత్నించినట్లుగా ఏ కోశానా కనిపించలేదు’’ అని విమర్శించాడు. కాగా కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో ప్రధాన ఆటగాళ్లలో చాలా మంది అందుబాటులో లేకపోవడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. -
నేను క్రికెట్ ఆడేందుకు అనుమతించండి!
కరాచీ:ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లలో ఒకడైన సల్మాన్ భట్ తన పునరాగమనంపై ఆసక్తిగా ఉన్నాడు. సల్మాన్ భట్ ఐదేళ్ల శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తున్న నేపథ్యంలో.. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తనను తిరిగి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడేందుకు అనుమంతిచాలని క్రికెట్ బోర్డును అభ్యర్థించినట్లు పీసీబీ సీనియర్ అధికారి స్పష్టం చేశాడు. దీనిలో భాగంగానే శుక్రవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులను, న్యాయనిపుణులను భట్ కలిశాడని.. కనీసం దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకైనా అనుమతి ఇవ్వాలని భట్ విన్నవించాడని సదరు అధికారి పేర్కొన్నాడు. ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లు మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్, సల్మాన్ భట్‌లకు ఇటీవల ఉపశమనం లభించింది. వారి శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తుండడంతో పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. వీరిలో ఆమిర్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడేందుకు అనుమతి లభించింది. ‘యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ విధించిన కొన్ని షరతులకు లోబడి వారు పోటీ క్రికెట్లో అడుగు పెట్టవచ్చు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్లో కూడా పాల్గొనవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. ఆసిఫ్, భట్‌లకు ఏడు, పదేళ్ల చొప్పున శిక్ష విధించినా.. అందుకు సడలింపునిస్తూ దానిని ఐదేళ్లకే పరిమితం చేశారు. కాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా తీసుకునే నిర్ణయంపైనే వారి భవితవ్యం ఆధారపడి వుంటుంది.