Salt Lake City
-
సర్వర్ డ్రోన్ సుందరం
కాఫీ హోటల్ ఏదైనా సర్వర్ గారు సుందరమే అయి ఉంటాడని గతంలో అనుకునేవారు. ఎందుకంటే టిఫిన్ హోటల్స్ తమిళులే నడిపేవారు కాబట్టి. ఇప్పుడు సర్వర్ గారి అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది. మనుషులకు జీతాలు ఇవ్వడం కంటే ఒక డ్రోన్‌తో మేనేజ్ చేయొచ్చని కోల్‌కతా రెస్టరెంట్ డిసైడ్ అయ్యింది. వాన కోసం ఆకాశం వైపు చూడొచ్చుగాని కాఫీ కోసం కూడా చూడొచ్చా? చూడొచ్చు. ఆకాశం నుంచి కాఫీ ఎగిరొచ్చి చేతికి అందుతుంది. ఇది కోల్‌కతా సాల్ట్‌లేక్ సిటీ ఏరియాలోని ‘కోల్‌కతా 64’ అనే రెస్టరెంట్ వారు తమ కస్టమర్లను ఆకర్షించడానికి వేసిన సాంకేతిక ఎత్తుగడ. ఆకర్షణ. రెస్టరెంట్ లోపల కూచున్న వారికి సర్వర్లు కాఫీ అందించినా బయట తమకు తోచిన చోటులో కూచుని కాఫీని ఆస్వాదించాలంటే డ్రోన్ సుందరం గారే కాఫీని అందిస్తారు. ఈ వీడియో ఇన్‌స్టాలో ప్రత్యేక్షం కాగానే ‘ఇదేదో బాగానే ఉంది’ అని చాలామంది మెచ్చుకుంటున్నారు. అయితే ఈ యంత్రం మనిషిని మాయం చేస్తున్నట్టే. మన దేశంలో మధ్యతరగతి జీవులకు కాఫీ హోటళ్లు, అందులో పని చేసే సర్వర్లు జీవితంలో భాగం. అందుకే సినిమాల్లో, సాహిత్యంలో సర్వర్లు కనపడతారు. కె.బాలచందర్ తీసిన ‘సర్వర్ సుందరం’లో నగేశ్ నటించి పేరు గడించాడు. ‘శుభలేఖ’లో చిరంజీవి కూడా ‘వెయిటర్’ అనబడు ‘సర్వరే’. ఇటీవలి కాలంలో ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ టిఫిన్ సెంటర్ నేపథ్యంలో ఓనర్ కమ్ సర్వర్‌గా హీరో చేసే స్ట్రగుల్‌ను చూపుతుంది. ఏమైనా ఈ డిజిటల్ ఏజ్‌లో ‘మాయమవుతున్నాడమ్మ మనిషి’ అనుకోక తప్పదు. -
కష్టాన్నే నమ్ముకుంది! అదే ఆమెను ఎఫ్‌బీఐకి తిరుగులేని ఏజెంట్‌గా..
‘ఎఫ్‌బీఐలో పనిచేయడం అదృష్టం’ అంటాడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్. ‘ఎఫ్‌బీఐ’లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఇండో–అమెరికన్ సోహిని సిన్హా ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్నే ఇష్టంగా నమ్ముకుంది. ఎఫ్‌బీఐలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో స్థాయిలలో పనిచేసింది. తాజాగా సోహిని సిన్హాను ఎఫ్‌బీఐ సాల్ట్‌లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జిగా నియమించింది... ఎఫ్‌బీఐలో సోహిని సిన్హాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కౌంటర్–టెర్రరిజం ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు తెచ్చుకుంది. భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను హ్యాండిల్ చేయడంలో, క్రిమినల్ సైబర్ ఇన్వెస్టిగేషన్లో దిట్టగా పేరున్న సోహిని సిన్హా తన వృత్తిపరమైన అంకితభావంతో ఎన్నో ప్రమోషన్లు పొందింది. 2001లో ఎఫ్‌బీఐలో స్పెషల్ ఏజెంట్‌గా చేరిన సిన్హా 2009లో సూపర్వైజరీ స్పెషల్ ఏజెంట్‌గా నియామకం అయింది. ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని కౌంటర్–టెర్రరిజం విభాగానికి బదిలీ అయింది. 2012లో అసిస్టెంట్ లీగల్ అటాషైగా ప్రమోట్ అయింది. కౌంటర్ టెర్రరిజమ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలిస్, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లతో కలిసి పనిచేసింది. ఆ తరువాత ఫీల్డ్ సూపర్వైజర్ (డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్)గా ప్రమోట్ అయింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిన సంక్లిష్టమైన కేసులను ఇన్వెస్టిగేట్ చేసింది.2020లో సైబర్ ఇన్‌ట్రూజన్ స్క్వాడ్‌లో చేరింది. తన నాయకత్వ సమర్థతతో 2021లో నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్‌కు సంబంధించి అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జి (పోర్ట్లాండ్ ఫీల్డ్ ఆఫీస్) గా ప్రమోట్ అయింది. ఏజెన్సీ ఆపరేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్‌గా నియామకం అయింది. ఇంటర్నేషనల్ ఎసైన్మెంట్స్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ నుంచి ఇరాక్ వరకు ఎన్నో దేశాల్లో, ఎన్నో సంస్కృతుల మధ్య పనిచేసింది.ఎఫ్‌బీఐలో చేరడానికి ముందు సోహిని సిన్హా థెరపిస్ట్‌గా, ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన క్లినిక్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసింది. ఇక చదువు విషయానికి వస్తే సైకాలజీలో డిగ్రీ, మెంటల్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ చదువు తన వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఇతరులకు సహాయపడాలనే సోహిని సిన్హా తపనకు ఎఫ్‌బీఐ బలమైన వేదికలా ఉపయోగపడుతోంది. -
జెంబో టవర్ : క్షణాల్లో నేలమట్టం
వాషింగ్టన్: అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టు అధారిటీ సంచలన వీడియోను షేర్ చేసింది. యూటా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉన్న 84 అడుగుల డెల్టా టవర్‌ను కూల్చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లకు వాటి గేట్లకు దారి చూపేందుకు దీన్ని 1989లో నిర్మించారు. ఈ టవర్ కూల్చివేత రెండవ దశలో ఈ టవర్‌ను పూర్తిగా నేలమట్టం చేశారు. కేవలం కొన్ని సెకన్లలోనే ఈ టవర్ కుప్పకూలిన వీడియోను అక్కడి అధికారులు ట్విటర్లో షేర్ చేశారు. అంతే లక్షల లైక్స్, వేలాది వ్యూస్‌తో ఇది నెటింట్లో హల్ చల్ చేస్తోంది. డెల్టా టవర్ కూల్చివేయడంలో ఇదొక ప్రధాన మైలురాయి అని సాల్ట్ లేక్ విమానాశ్రయ ప్రతినిధి నాన్సీ వోల్మర్ చెప్పారు.గత సెప్టెంబర్‌లో కొత్త విమానాశ్రయం ప్రారంభమయ్యేవరకు డెల్టా టవర్ కార్యకలాపాలు కొనసాగాయన్నారు. అయితే ఇందులో కొన్ని సదుపాయాలను ఆ తరువాత కూడా కొనసాగించాలని అనుకున్నా కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ గేట్లు అవసరం లేదని తాము భావించినట్టు ఆమె వెల్లడించారు. -
భయానక వీడియో.. నడి రోడ్డుపై కాల్చేశారు
సాల్ట్ లేక్ : గత నెలలో ఓ నల్లజాతి పౌరుడిని అత్యంత పాశవికంగా కాల్చి చంపిన ఘటనకు సంబంధించిన వీడియోను సాల్ట్ లేక్ నగర పోలీసులు విడుదల చేశారు. విచారణలో భాగంగా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఈ వీడియోను ఈ వారం సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఆ రోజు కాల్పులు జరిగిన సమయంలో ఉన్న ముగ్గురు పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయి ఉంది. ప్యాట్రిక్ హార్మన్ (50) అనే నల్ల జాతి పౌరుడిని గత ఆగస్టు 13న రాత్రి సాల్ట్ లేక్ పోలీసులు కాల్చి చంపేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే, ఆరోజు తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము అలా చేయాల్సి వచ్చిందంటూ ఈ వీడియోను విడుదల చేశారు. హార్మన్పై అప్పటికే కేసులు ఉన్నాయని, ఓపెన్ అరెస్టు వారెంట్లు కూడా చాలా ఉన్నాయని తెలిపారు. ఆ రోజు సిగ్నల్ పడినా లెక్కచేయకుండా హర్మన్ తన సైకిల్‌పై వెళ్తుండటమే కాకుండా రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్లాడని, తాము ఆపి ప్రశ్నించగా సమాధానం సరిగా చెప్పలేదన్నారు. దాంతో తాము అరెస్టు చేస్తున్నామని అందుకు సహకరించాలని బేడీలు తగలించే క్రమంలో ఆఫీసర్లను తోసి పరుగెత్తాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై కత్తితో దాడి చేశాడని, ఓ అధికారిని కిందపడేశాడని అందుకే ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపాడని అన్నారు. నడి రోడ్డుపై కాల్చేశారు వీడియో వీక్షించండి -
దొంగను పట్టించిన ఐఫోన్ యాప్
వాషింగ్టన్: అమెరికాలో ఒక వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి కెమెరా, యాప్‌ల సహాయంతో ఒక దొంగను పట్టించగలిగాడు. వివరాల్లోకి వెళ్తే బ్రియాన్ (25) అనే వ్యక్తి అమెరికాలోని సాల్ట్‌లేక్ సిటీలో నివాసముంటున్నాడు. తను ఇంట్లో లేకపోయినా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకనే విధంగా 'నెస్ట్కామ్' అనే ఐఫోన్ యాప్‌ని ఇంట్లో ఉన్న సీసీ కెమెరాతో అనుసంధానం చేశాడు. గురువారం రాత్రి బ్రియాన్ ఇంటికొచ్చేసరికి అతని ఇంట్లో లైట్లు వెలిగి ఉండటం గమనించాడు. అతనికి అనుమానం వచ్చి ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానంతో బయట నుంచే అతని యాప్ ద్వారా లోపల ఏం జరుగుతుందో గమనించాడు. అందులో లోపల ఎవరో గుర్తు తెలియని మహిళ ఉన్నట్టు బ్రియాన్ గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాధానం అందించాడు. పోలీసులు వచ్చి ఆమె పేరు డెన్నెట్ (38)గా నిర్ధారించి, తరచూ దొంగతనాలకు పాల్పడుతుందని తెలిపారు. -
ఉప్పుతో నిర్మించిన హొటల్