Salute to attend
-
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భారతీయ సైనిక పాటవాన్ని చాటిచెప్పేలా యుద్ధవిమానాలతో భారీ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పలు సైనిక వాహనాలను ప్రదర్శించారు. కరోనా కారణంగా వేడుకలకు విదేశీ అతిధిని ఆహ్వానించలేదు. వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించడంతో రిపబ్లిక్ డే పెరేడ్ ఆరంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా, మేజర్ జనరల్ అలోక్ కకేర్ నేతృత్వంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతాలాపన, 21 తుపాకుల గన్‌సెల్యూట్ జరిగాయి. భారత ఆర్మీ 61వ కేవలరీ రెజిమెంట్ సైనికులు మార్చింగ్‌లో ముందు నిలిచారు. ఉత్తరాఖండ్ టోపీతో ప్రధాని గణతంత్ర ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ద మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాధ్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు రిపబ్లిక్ డే పెరేడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు. పెరేడ్లో ఎన్సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సైతం తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్లో అడుగుపెట్టింది. విదేశాల్లో గణతంత్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. పలు దేశాల్లో భారతీయ కమిషన్ కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. బీజింగ్‌లో భారత రాయబారి విమల్ జాతీయజెండాను ఎగురవేసి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో హైకమిషనర్ సిద్ధార్ధ్ నాథ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భారత్‌లో మరింత బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ హిందీలో భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆకాంక్షించారు. భారత్‌తో కలిసి అనేక అంశాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లా ప్రధాని షేక్ హసీనా చెప్పారు. భూటాన్, ఇండియాల స్నేహం కాలానికి నిలిచిందని ఆ దేశ ప్రధాని లోటే ష్రింగ్ తెలిపారు. భారత ప్రజలకు శ్రీలంక ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్లో ఇండియా రాయబారి సురేశ్ కుమార్ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఇండో– యూఎస్ బంధం కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రూనై, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే సంబరాలు భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు పాటుపడతామని ప్రతిన పూనారు. కరోనా కారణంగా ప్రేక్షకుల సంఖ్యపై పలు రాష్ట్రాల్లో పరిమితులు విధించారు. కాశ్మీర్లో ప్రఖ్యాత లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. లోయలో పుకార్లు వ్యాపింపజేసేవారిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన రిపబ్లిక్‌డే ప్రసంగంలో నిప్పులు చెరిగారు. రాజాంగ్య మౌలికతను కాపాడేందుకు ప్రతినపూనాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగితను తొలగిస్తామని హర్యానా సీఎం ఖటర్ ప్రతిజ్ఞ చేశారు. పెట్రోల్‌పై సబ్సిడీని జార్ఖండ్ సీఎం సోరెన్ ప్రకటించారు. మహిళా శిశువుల కోసం ప్రత్యేక పథకం తెస్తామని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ చెప్పారు. కేరళలో మంత్రి అహ్మద్ తలకిందులుగా జాతీయజెండాను ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రాభివృద్ధికి తీసుకునే చర్యలను మేఘాలయ ముఖ్యమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్‌లో మద్యనిషేధం ఆవశ్యకతను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ నొక్కిచెప్పారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నోవిజయాలు సాధించిందని మహారాష్ట్ర గవర్నర్ చెప్పారు. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో ప్రదర్శించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం అరవింద్, లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ స్వతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీమా భవానీ బృందం విన్యాసాలు పెరేడ్లో బీఎస్ఎఫ్కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ప్రముఖులంతా ఈ బృందానికి నిల్చొని చప్పట్లతో గౌరవం ప్రకటించారు. భారతీయ ఐక్యతను ప్రతిబింబించేలా 485 మంది డాన్సర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు గుర్తుగా 75 యుద్ధ విమానాలు ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి. విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా, కాక్‌పిట్ నుంచి చిత్రీకరించిన వీడియోలను వాయుసేన ప్రదర్శించింది. ఆకాశంలో విమాన విన్యాసాల ప్రత్యక్ష ప్రసారం ఇదే తొలిసారి. వేడుకలకు దాదాపు 5వేల మంది హాజరయ్యారు. కరోనా పూర్వం ఈ వేడుకలకు దాదాపు లక్షమంది వచ్చేవారు. వీక్షకులంతా కరోనా నిబంధనలు పాటించారు. అలాగే వీక్షకులు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నగరం మొత్తాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు. -
మీ సాహసానికి సెల్యూట్!
ఘోరాన్ని ఆపేందుకు విద్యార్థులు, అధ్యాపకుల యత్నం ఉన్మాదికి ఎదురెళ్లిన వైనం ఇతరులకు స్ఫూర్తిదాయకం సహచరుల చొరవతో ప్రాణాలు దక్కించుకున్న రవళి ఊహించని పరిణామంతో విషం తాగిన ప్రదీప్ చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, కాటేదాన్, ముషీరాబాద్: ప్రదీప్ పక్కా పథకంతోనే కళాశాలకు వచ్చాడు. సాధారణ డ్రెస్‌లో వస్తే మెయిన్‌గేట్ వద్దే సెక్యూరిటీ గార్డు ఆపేస్తాడని గ్రహించిన అతడు అరోరా కళాశాల డ్రెస్ (బ్లూషర్టు, బ్లూ జిన్స్)వేసుకుని... బ్యాగ్ పట్టుకొని ఉదయం 8.30 గంటలకే లోపలికివ చ్చాడు. సరిగ్గా 9 గంటలకు రవళి కళాశాల మైదానంలో బస్సు దిగింది. వంద మీటర్లు నడిస్తే చాలు తరగతి గదిలోకివెళ్లిపోతుంది. ఆలోగానే దాడి చేయాలనే పథకంతో ప్రదీప్ 60 మీటర్ల దూరంలోనే కూర్చున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదివైపు రవళి నడిచి వెళుతోంది. మరో 20 మీటర్ల దూరం ఉండగానే ఒక్కసారిగా ఆమెపై ప్రదీప్ దాడికి పాల్పడ్డాడు. భవనంలోకి చేరుకున్నాక దాడికి అక్కడ ఆస్కారం ఉండదు. అందుకే పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డాడు. అతడు ఊహించనిదేంటంటే సహచరులు తిరగబడతారని. కేసు నమోదు భవనం ముందు ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో దాడి దృశ్యాలు కనిపించలేదు. మరో పది మీటర్ల దూరం తరువాత ఘటన జరిగి ఉంటే సీసీ కెమెరాలో దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యేవి. ఈ ఘటనతో కళాశాలలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని యాజమాన్యం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై 307, 354ఎ,బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తలించామన్నారు. అతను పురుగుల మందు తాగినట్టు గుర్తించామన్నారు. కళాశాలకు ఎలా వచ్చాడు కళాశాలకు ప్రదీప్ ఎలా వచ్చాడు అనే కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు. ఎవరైనా అతన్ని ముందే కళాశాల వద్ద బైక్‌పై దింపి వెళ్లారా? లేక అతనే ఏదైనా బస్సు, ఆటోలో వ చ్చాడా? అని ఆరా తీస్తున్నారు. కళాశాల గేటు వద్ద నుంచి లోపలికి నడిచి వచ్చినట్టు తెలుస్తోంది. లోపల కేవలం విద్యార్థుల బైక్‌లు మాత్రమే ఉన్నాయి. పార్కింగ్ స్థలంలో ఎలాంటి వాహనమూలేకపోవడంతో ప్రదీప్ నడిచి వచ్చాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది. రూ.5 వేల కోసం ప్రదీప్ చికిత్స పొందుతూ మృతి చెందిన తరువాత అపోలో ఆస్పత్రి వారు అతని మృతదేహాన్ని భద్రపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని స్వాధీనపర్చాలని చాంద్రాయణగుట్ట పోలీసులు కోరారు. తాము వైద్యం చేశామని, ఆ ఖర్చులు రూ.5 వేలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం భీష్మించుకు కూర్చుంది. బిల్లు చెల్లించేందుకు పోలీసులు ముందుకు రాకపోవడం, మృతుడి బంధువులు అక్కడికి చేరుకోకపోవడంతో రాత్రి వరకూ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. బస్‌స్టాప్‌లు మార్చిన రవళి ప్రదీప్ గతంలో చేసిన హెచ్చరికల నేపథ్యంలో రవళి రోజుకోచోట బస్సు ఎక్కేది. తన తండ్రి వెంట బస్సు వద్దకు వచ్చేది. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో తాను బస్సు ఎక్కడ దిగుతున్నదీ ముందుగానే తండ్రికి ఫోన్ చేసి చెప్పేది. అలా రక్షణ చర్యలు తీసుకునేది. కళాశాల ఆవరణలోనే బస్సు దిగుతున్నందున ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని పసిగట్టలేకపోయింది. సోమవారం ఆమె తండ్రితో కలసి వచ్చి రామ్‌నగర్ చేపల మార్కెట్ వద్ద బస్సు ఎక్కింది. కళాశాలలో రవళిపై ప్రదీప్ దాడి విషయం తెలియగానే రామ్‌నగర్‌లోని ఆమె కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు ఆమె చికిత్స పొందుతున్న సుజాత ఆస్పత్రికి పరుగులు తీశారు. అరెస్టు చేసి ఉంటే గత నెలలో రవళి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రదీప్‌పై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అతన్ని అరెస్టు చేసి ఉంటే ఈపాటికి జైలులోనే ఉండేవాడు. ఈ రోజు ఈ ఘటన జరిగి ఉండేదికాదని కళాశాలలో తోటి విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో వాంగ్మూలం సేకరణ విద్యార్థినిపై దాడి విషయం తెలుసుకున్న ఉప్పర్‌పల్లిలోని ఎనిమిదోమెట్రోపాలిటన్ కోర్టు జడ్జి ఆస్పత్రికి చేరుకొని బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. మరోవైపు బాధితురాలికి పెద్ద ప్రమాదం ఏమీలేదని తేల్చడంతో సుజాత ఆస్పత్రి వైద్యులు తేల్చడంతో... అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తెపై హత్యాయత్నం విషయం తెలుసుకున్న రవళి తండ్రి గోపి భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికిగురై రవళి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే చేరారు. సోమవారం ఉదయం 9.05 గంటలు దాటింది. తరగతులు ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు లోనికి వస్తున్నారు. కళాశాల ప్రధాన ద్వారం గ్రిల్స్ అప్పుడే వేస్తున్నారు. నేను లోపలే ఉన్నాను. ఆ సమయంలోనే బయటికి చూస్తుండగా ప్రదీప్ అనుమానాస్పదంగా వస్తున్నాడు. నాకు అనుమానం వచ్చి బయటికి వెళ్లేందుకు యత్నించా. మా మిత్రులు అడ్డుగా ఉన్నారు. అదే సమయంలో రవళి తలపై ప్రదీప్ వేటకొడవలితో రెండుసార్లు దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే నేను హెల్మెట్ తీసుకొని అక్కడికి వెళ్లాను. రవళి బతికే ఉందని గ్రహించిన ప్రదీప్ మరోసారి ఆమె మెడపై నరకాలని కసిగా మళ్లీ వస్తున్నాడు. ఆ సమయంలోనే నేను అడ్డుగా వెళ్లాను. నాపై కూడా దాడికియత్నించాడు. నేను హెల్మెట్‌తో అతన్ని కొట్టాను. అనంతరం విద్యార్థులు నాతో కలిశారు. ప్రదీప్‌కు, నాకు పెనుగులాట జరిగింది. ఇంతలోనే తన వెంట తెచ్చుకున్న విషం తాగాడు. ఇది గమనించిన అధ్యాపకులు, విద్యార్థులు ఇద్దరినీ వేర్వేరుగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ పెనుగులాటలో నాకు దెబ్బలు తగల్లేదు. కింద పడడంతో చేతికి నొప్పిగా ఉంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లినా రవళి చనిపోయేది. -ప్రవీణ్ కుమార్, ల్యాబ్ ఇన్చార్జి నా కళ్ల ముందే దాడి చేశాడు జూనియరైన రవళి నా ముందు నుంచే నడిచి వెళుతోంది. దాదాపు ఉదయం 9.05 గంటల సమయంలో తన వెనుక నుంచి కళాశాల యూనిఫారంలోనే వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా బ్యాగ్‌లో నుంచి వేట కొడవలి తీసి రవళి తల, చేతిపై గాయపరిచాడు. ఈ ఘటనతో మేమంతా తీవ్ర భయానికి గురయ్యాం. పక్కనే ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు అతన్ని పట్టుకున్నారు. ఇంతలోనే తన వెంట తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. యూనిఫారంలో రావడంతో అతన్ని గుర్తించలేకపోయాం. ఇంకా ఫస్టియర్ విద్యార్థులు చేరుతున్నందున వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. - లక్ష్మి