Samagra sarve
-
గవర్నర్ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించిన అధికారులు
-
సమగ్ర సర్వే ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాలి
-
ఇకపై పరిశ్రమల సమగ్ర సర్వే కోసం వారి సేవలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పరిశ్రమల సమగ్ర సర్వే కోసం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను వినియోగించుకునేందుకు అనుమతి లభించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సహా.. సదుపాయాల కల్పనా సహాయకుల సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం, రెవిన్యూ, ఉపాధి కల్పన అంశాలను.. మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాలపై కూడా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. -
మరోసారి సమగ్ర సర్వే చేపట్టండి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటా సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. సర్వే పూర్తి కాగానే మరికొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. (వైద్యుల సూచన మేరకే మందులు వాడాలి) సీఎం ఆదేశాలు, సూచనలు - ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయినవారిపైనే కాకుండా ప్రజలందరిమీద కూడా దృష్టి పెట్టాలి. - ఇందు కోసం మరో దఫా వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సర్వే చేయాలి. ఇందుకు అందరూ సహకరించాలి. కరోనా లక్షణాలు ఉన్న వారికి సత్వరమే వైద్య సహాయం అందించాలి. ఇలా చేస్తే కోవిడ్–19 వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతాం. - ప్రజలు బయట తిరిగితే.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. అందువల్ల ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించాలి. ప్రజలంతా ఇంట్లో ఉండడం వల్ల వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారవుతారు. - రాష్ట్రంలో కోవిడ్ –19 నివారణకు ప్రజల నుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారివే. సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య, ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి. - రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది. లక్షణాలు ఉన్న వారు విధిగా హోం ఐసోలేషన్ పాటించాలి. - సమీక్షా సమావేశంలో ఏపీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ చైర్మన్ సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు. -
‘సమగ్ర సర్వే ఏమైంది’
సాక్షి, న్యూఢిల్లీ: సర్వ రోగ నివారణి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఏమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర సర్వేకు ముందే దాదాపు 90 శాతం ఆధార్ నమోదు పూర్తయిందన్నారు. ఈ సర్వే ద్వారా నిజమైన లబ్ధిదారులు తేలుతారని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటివరకు దళితులకు మూడెకరాల భూమి ఎందుకు పంచివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. -
నిరీక్షణ
సర్వే కోసం ఎదురు చూస్తున్న జనం అనేక ప్రాంతాల్లో పూర్తి కాని వైనం త్వరలో తేదీ ప్రకటిస్తాం...ఇక ఫిర్యాదులు వద్దు స్పష్టం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి,సిటీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తంతు ముగిసింది. అయినా ఇంకా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని, తమ వివరాలు నమోదు చేసుకోలేదని అనేక ప్రాంతాలు.. బస్తీలు.. కాలనీల్లోని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీకి కాల్‌సెంటర్, ఎస్ఎం ఎస్, ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన వారందరి ఇళ్లకు సర్వే కోసం ఇంకా పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఫిర్యాదులు స్వీకరించేది లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలెవ్వరూ ఇక ఫిర్యాదులు చేయవద్దని.. మిగిలిన కుటుం బాల కోసం మరో రోజు సర్వే తేదీని ప్రకటించి, వారి వివరాలు నమోదు చేస్తామన్నారు. ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగరాదని సూచించారు. 19నే ఫిర్యాదు చేసినప్పటికీ.. సర్వే పూర్తి కాని వారుంటే వివరాలు సేకరిస్తామన్నారు. అప్పటి నుంచి తాము ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నామని బస్తీలకు బస్తీలు.. కాలనీలకు కాలనీల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. వీరిలో ఉప్పల్ సర్కిల్లోని సూర్యానగర్, రాజ్‌నగర్ కాలనీ, కావేరి నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, చిలుకానగర్‌లోని ఆదర్శనగర్, స్వరూప్‌నగర్, భర త్‌నగర్, శాంతినగర్, రామంతాపూర్‌లోని గోఖలేనగర్, వెంకటరెడ్డినగర్, వివేక్‌నగర్, పాత రామంతాపూర్, శ్రీరామా కాలనీ, రాంరెడ్డినగర్, హబ్సిగూడలోని వీధి నంబర్-1, వీధి నంబర్-8లో గల గాంధీ గిరిజన బస్తీ, వసంత్ విహార్ కాలనీ, హరిజన బస్తీ, ఫిర్జాదిగూడ, మల్లికార్జున నగర్ తదితర ప్రాంతాల వారు ఉన్నారు. లాలాపేట వార్డు నెంబర్ 12లో సుమారు 30 కుటుంబాల వారు 17వ తేదీ నుంచి 19 అర్థరాత్రి వరకు ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూసినా రాలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేదని తార్నాక డివిజన్లోని కొన్ని ప్రాంతాల వారు వాపోయారు. జూబ్లీహిల్స్ డివిజన్లోని ఫిలింనగర్ మురికివాడల్లో ఉన్న చాలా బస్తీలకు ఎన్యూమరేటర్లు రాలేదని, అక్కడి 18 బస్తీల్లో ఇంకా వందలాది కుటుంబాలు సర్వే కోసం ఎదురు చూస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేదని వారు దుయ్యబడుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్ లోని శ్రీసాయినగర్, కాకతీయనగర్, జేకేకాలనీ, జేజే నగర్, రేణుకా నగర్, ఓల్డ్ సఫిల్‌గూడ, వినాయకనగర్, వసంతపురి కాలనీ, మల్లికార్జుననగర్, హనుమాన్‌పేట్, దయానంద్‌నగర్, ఆనంద్‌బాగ్, ఓల్డ్ మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ లోని జొన్నబండ, ఓల్డ్ అల్వాల్, మచ్చబొల్లారం, ఖానాజీగూడ, యాప్రాల్, ఎంప్లాయిస్ కాలనీ, కౌకూర్, భగత్‌సింగ్‌నగర్, భూపేస్నగర్, బాపూజీ నగర్ ప్రాంతాలలో అధిక శాతం కుటుంబాల పేర్లు నమోదు కాలేదు. దీంతో గత మూడు రోజులుగా వారు సర్వే అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. కంప్యూటరీకరణకు పరుగులు సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన వారి డేటాబేస్ తయారీకి జీహెచ్ఎంసీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వీలైనంత త్వరితంగా సర్వే వివరాలను డిజిటైజేషన్ చేయించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అంతేకాదు.. శుక్రవారంతో టెండర్ ప్రీబిడ్ సమావేశం.. సాంకేతిక, ఆర్థిక టెండర్లను ఖరారు చేసి.. మర్నాటి నుంచే ఒప్పందం పూర్తి చేసి.. పనులు చేపట్టాలనే తలంపుతో ఉన్నారు. ఒక్కో జోన్‌కు ఏకంగా 200 కంప్యూటర్లు.. మూడు షిప్టులుగా రేయింబవళ్లు పని చేసేందుకు తగిన సిబ్బంది కలిగిన సంస్థలు టెండరులో పాల్గొనాల్సిందిగా ఆర్ఎఫ్పీ జారీ చేశారు. ఇలా ఐదు జోన్లకు మొత్తం వెయ్యి కంప్యూటర్లు .. మూడు వేల మంది ఆపరేటర్లు 24 గంటల పాటు పని చేయనున్నారు. ఈ స్పీడ్‌కు తగిన విధంగా టెండరును దక్కించుకోగల సంస్థలు నగరంలో ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టెండరు ప్రకటనకు.. ఖరారుకు మధ్య ఒక్కరోజు మాత్రమే గడువివ్వడం..అదీ చిన్నాచితకా ప్రాజెక్టు కాకపోవడంతో అధికారుల ఆలోచన ఏమేరకు సఫలీకృతం కానుందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రీబిడ్ సమావేశంలో ఎలాంటి అభిప్రాయాలొస్తాయోననేది ఆసక్తికరంగా మారింది. అధికారుల దూకుడుకు తగ్గట్టుగా పని చేయగల సామర్ధ్యం ఉన్న సంస్థలున్నాయా.. లేవా? అన్నది నేడు తేలనుంది. కఠిన నిబంధనలు టెండరు నిబంధనలు సైతం కఠినంగా ఉన్నాయి. ఒప్పందం ముగియగానే ప్రాజెక్టు చేపట్టాలి. లేని పక్షంలో రోజుకు రూ. 20 వేల వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. టెండరు దక్కించుకున్న సంస్థ పది రోజుల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఇలాంటి నిబంధనల వల్ల ఎందరు ముందుకొస్తారనేదీ ఆసక్తికరంగా మారింది. -
11,45,611
సర్వేలో వివరాలు అందజేసిన కుటుంబాల సంఖ్య 34,465 ఇళ్లకు తాళం.. వరంగల్ నగరంలో అసంపూర్తి నమోదుకాని కుటుంబాలు 11వేలు బుధవారం జరగని సర్వే.. ప్రభుత్వ ఆదేశాలతో నిలిపివేత సాక్షిప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లాలో 11,45,611 కుటుంబాల వివరాలను నమో దు చేశారు. ముందుగా అంచనా వేసిన ప్రకారం 10,68,743 కు టుంబాలే ఉండగా.. సర్వే తర్వా త భారీగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 34,465 ఇళ్లకు తాళం వేసినట్లు నమోదు చేశారు. మరో 3521 కుటుంబాలను మరణించినట్లుగా పేర్కొన్నారు. వరంగల్ నగరంలో అధికారుల ప్రణాళిక లోపంతో దాదాపు 11వేల కుటుంబాల వివరాలు సేకరించలేదు. కాగా, సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ‘వరంగల్ నగరంలోని కొన్ని మినహా సర్వే సమగ్రంగా పూర్తయింది. సర్వేకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. మొత్తంగా మరో 12 శాతం సర్వే మిగిలింది. ప్రభుత్వ ఆదేశాలు రాగానే వంద శాతం పూర్తి చేస్తాం’ అని కలెక్టర్ వివరించారు. సర్వే వివరాలను కంప్యూటర్లో నమోదు చేసే ప్రక్రియ మొదలువుతోంది. సర్వే వివరాల కంప్యూటరీకరణకు 2100 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. 2100 డాటా ఎంట్రీ ఆపరేటర్లను, పర్యవేక్షణకు 2100 వీఆర్వోలను నియమించనున్నారు. సమగ్ర సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు సేకరించిన సమాచార పత్రాలను ప్రత్యేక బాక్స్‌లలో సీల్ చేసి హన్మకొండలోని ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. నగరంలో 98.75 శాతం వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో 98.75 శాతం కుటుంబాల సామాజిక స్థితిగతులపై సర్వే నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్యూమరేటర్ల కొరత, రూట్ మ్యాపుల తయారీలో దొర్లిన తప్పిదాలతో మంగళవారం ఒక్కరోజే సర్వే పూర్తి కాలేదు. బుధవారం కూడా సర్వే నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం సర్వే ప్రక్రియ నిర్వహించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు వచ్చిన తర్వాతే సర్వే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా వివరాలు నమోదుకాని 11వేల కుటుంబాల్లో 10 వేల కుటుంబాలకు సంబంధించిన ఇంటి నెంబర్లను, సెల్‌ఫోన్ నెంబర్లను అధికారులు బుధవారం నమోదు చేసుకున్నారు. తొమ్మిది శిక్షణ కేంద్రాలలో ఈ పని పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే సర్వే చేస్తామని అప్పుడు ఈ కుటుంబాల వివరాలను సర్వే నమూనాలో పొందుపరుస్తామని కార్పొరేషన్ అధికారులు వివరించారు. అందరికీ కృతజ్ఞతలు : టి.రవీందర్రావు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించిన సర్వే జిల్లాలో విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపారని... ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన కోరారు. సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు సిబ్బందికి అభినందనలు తెలిపారు. -
సర్వేజన కష్టాలు
ప్రచార ఆర్భాటమెక్కువ..ఏర్పాట్లు తక్కువ సమగ్ర సర్వే నిర్వహణలో అధికారుల వైఫల్యం వరంగల్ నగరంలో మరీ అధ్వానం వివరాల నమోదుకు ఆసక్తి చూపిన ప్రజానీకం అయినా.. ఇళ్లకు రాని సిబ్బంది ఇబ్బందులు పడిన కుటుంబాలు స్పందించని టోల్‌ఫ్రీ నంబర్లు కలెక్టర్ మొబైల్ స్విచ్ ఆఫ్ రాత్రి వరకూ కొనసాగిన సర్వే సాక్షి ప్రతినిధి, వరంగల్ : సరిపోని ఎన్యూమరేటర్లు, తక్కువ పడిన నమోదుపత్రాలు, ఉన్నతాధికారుల ప్రణాళికలేమి, కిక్కిరిసిన బస్సులు, ఊళ్లకు చేరేందుకు ప్రజల అవస్థలు, అవసరమైన సమాచారం కాకుండా అనవసర విషయాలు తెలుసుకోవడం.. వీటి మధ్య జిల్లాలో మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సర్వేపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలమైన ఉన్నతాధికారులు, నిర్వహణ ఏర్పాట్లు మాత్రం సరిగా చేయలేకపోయారు. ముందుగా గుర్తించిన 10.69 లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు అవసరమైన ఎన్యూమరేటర్ల(వివరాలు సేకరించేవారు)ను సమకూర్చుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. చివరి నిమిషంలో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులను తీసుకోవడంతో సర్వేకు మొదట్లో ఉన్న ప్రాధాన్యత తగ్గినట్లు కనిపించింది. సరిపడా ఎన్యూమరేటర్లు లేకపోవడంతో చాలా కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు నిర్వహించారు. కలెక్టరేట్లో, కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయకపోవడంతో సర్వే వివరాలు సేకరించే వారు తమ ఇళ్లకు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన వారికి నిరాశే మిగిలింది. ఇబ్బందులు ఉంటే మెస్సేజ్ చేయాలని సూచిస్తూ ప్రకటించిన కలెక్టర్ జి.కిషన్ మొబైల్ సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ప్రజలు నిరసన తెలిపారు. వివరాలు నమోదు చేసికోని వారు, ఎన్యూమరేటర్లు రాని వారి పరిస్థితి ఏమిటనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఉత్సాహం చూపినా... సమగ్ర కుటుంబ సర్వేలో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే విషయంలో ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉదయం నుంచి ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూశారు. ప్రజలు ఉత్సాహంపై బల్దియా అధికారులు నీళ్లు చల్లారు. ఎన్యూమరేటర్లకు కేటాయించిన ఇళ్ల వివరాల విషయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు చేసిన తప్పిదాలతో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇంటి నం బర్ల పరిధికి మాత్రమే పరిమితమయ్యారు. వం దలాది మంది కుటుంబాల వివరాలు నమోదు చేయలేదు. 400 మంది ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడింది. ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన మరో 100 మంది విధులకు హజరుకాలేదు. నగరంలో 2,44,646 కుటుంబాలు ఉంటే దాదాపు 25వేల కుటుంబాల వివరాలను సేకరించలేకపోయారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం 100 ఫీట్ల రోడ్డు మార్గలోని జవహన్కాలనీ, రాంనగర్‌లోని కొన్నిప్రాంతాలు, ఎన్ఐటీ ఎదురుగా ఉన్న కాలనీలు, జూలైవాడ, రెవెన్యూకాలనీ, ప్రకాష్‌రెడ్డిపేట తదితర కాలనీల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిసి పరిస్థితి వివరించారు. తమకు సంబంధంలేదని నగరపాలకసంస్థ వారికి ఫిర్యాదు చేయాలని డీఆర్వో సురేందర్‌కరణ్ నిర్లక్ష్యంగా చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు కొందరు కలెక్టర్ అధికారిక నివాసం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. సుబేదారి పోలీసులు నచ్చజెప్పి పంపించారు. నగరంలోని కొత్తవాడ, మర్రివెంకటయ్య కాలనీ, నవయుగ కాలనీ, రామన్నపేట, హన్మకొండలోని కొత్తూరు, కుమార్‌పల్లి, పోలీస్ హెడ్ క్వార్టర్స్, రెడ్డికాలనీ, వడ్డేపల్లి టీచర్స్ కాలనీ, రామకృష్ణ కాలనీ తదితర కాలనీల్లో అసలు సర్వే కోసం ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. 19 డివిజన్లోని రఘునాథ్‌నగర్ కాలనీవాసులు 200 మంది కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరికొందరు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జనగామ పట్టణం 5 వార్డులో ఎన్యూమరేటర్ ఒకే చోట కూర్చుని సర్వే చేస్తుండగా కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని 8వ వార్డులో పలు ఇళ్లకు, జనగామ మండలం గానుగుపాడ్, వడ్లకొండ, వెంకిర్యాలలో ఇందిరమ్మ ఇళ్లకు, బచ్చన్నపేట మండలం చిన్నరాంచెర్ల జీపీ పరిధిలోని గోపాల్‌నగర్‌లో బుడిగె జంగాలకు చెందిన 50 గుడిసెలకు, నర్మెట మండల కేంద్రంలో పలు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు సర్వే చేయడానికి మొండికేయడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నంబర్లు లేకపోవడంతో పాత ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటున్న చోట ఉమ్మడి కుటుంబంగా వివరాలు ఇవ్వాల్సి వచ్చింది. మానుకోట నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబరుపై పలు కుటుంబాలు నివాసం ఉన్నా వేర్వేరుగా నంబర్లు ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తింది. మానుకోట పట్టణ శివారు పత్తిపాక, మంగలికాలనీ, తదితర కాలనీలలో ఇండ్లకు నంబర్లు ఇవ్వకపోవడంతో పూర్తిస్థాయిలో సర్వే జరుగలేదు. కేసముద్రంలోనూ రెండుమూడు కుటుంబాలు ఉండే ఇళ్లకు ఒకే నంబరు ఇవ్వడంతో కుటుంబ యజమానులు సిబ్బందితో గొడవపడ్డారు. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం, మునిగలవీడు, చిన్న నాగారం గ్రామాల్లో సూరత్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు సిబ్బంది నిరాకరించగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గూడురు మండలంలోనూ నంబర్ల సమస్య తలెత్తింది. భూపాలపల్లి పట్టణంలో పలు కాలనీల్లో ఇంటి నంబర్ల ఆధారంగా ఇళ్లను గుర్తించేందుకు ఎన్యూమరేటర్లు కష్టపడాల్సి వచ్చింది. భూపాలపల్లి, గణపురం, చిట్యాల మండలాల అధికారులు సకాలంలో టిఫిన్, భోజనం అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిట్యాలలో కనీసం వాహన సౌకర్యం కల్పించకపోవడంతో కేటాయించిన ప్రాంతాలకు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు. రేగొండ, భూపాలపల్లి, చిట్యాల మండలాల్లో పలు చోట్ల పలు కుటుంబీకుల పేర్లు లిస్టులో లేకపోవడంతో బాధితులు వాగ్వివాదానికి దిగారు. నర్సంపేట పట్టణంలో 45 వుంది ఎన్యూవురేటర్లు గైర్హాజరయ్యూరు. సూపర్వైజర్లు ఇంటి నంబర్ల జాబితాను సరిగా రూపొందించకపోవడంతో సర్వే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. పలు వార్డుల్లో సర్వే టీం ఇంటికి వెల్లని వారి కోసం స్థానిక బాలుర హైస్కూల్లో వుూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటావుని ఆర్డీఓ తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఒక ఇంటిలో పలు కుటుంబాలున్నా ఒకే ఫారంలో వివరాలు నమోదు చేయడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరకాల నగర పంచాయతీ పరిధి 13వ వార్డులో ఎన్యూమరేటర్లతో స్థానికులు ఘర్షణకు దిగారు. కుటుంబంలో కొందరి పేర్లు మాత్రమే రావడంతో తప్పుడు సర్వే చేస్తున్నారని వాదించారు. పట్టణంలోని ఒక వాడలో ఇద్దరు భార్యలు నా పేరు అంటే నా పేరు రాయమంటూ గొడవకు దిగడంతో ఎన్యూమరేటర్ ఆ ఇంటిని సర్వే చేయకుండా వదిలి వేశారు. పరకాల మండలంలోని వెంకటాపూర్, నాగారం గ్రామాల్లో పలువురి పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. గీసుకొండ మండలం విలీన గ్రామాల్లో ఇంటి యజమానుల కుటుంబాలను మాత్రమే సర్వే చేశారు. వృద్ధుల పేర్లను లేకుండా చేశారు. సంగెం మండలంలోని తిమ్మాపురం, ఎల్గూరు స్టేషన్, మొండ్రాయిలో ఎన్యూమరేటర్లు సర్వే చేయడంలో ఇబ్బంది పడగా కొత్తవారితో చేయించారు. ఆత్మకూరు మండలంలో సిబ్బందికి ఇంక్ ప్యాడ్లకు బదులు స్కేచ్ పెన్నులు ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సమగ్ర సర్వే ప్రశాంతంగా జరిగింది. పలువురి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు ఆయా కుటుంబాల వివరాలు నమోదు చేసుకోలేదు. దీంతో బాధితులు గొడవకు దిగడంతో అధికారులు కల్పించుకొని సమస్యను పరిష్కరించారు. నియోజకవర్గం మొత్తం సర్వే తీరును జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు వి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగరి, హసన్‌పర్తి(రూరల్), హన్మకొండ గ్రామీణ మండలాల్లో అర్ధరాత్రి సర్వే జరిగింది. 150 మంది ఎన్యూమరేటర్లు విధులకు డుమ్మాకొట్టడంతో కానిస్టేబుళ్లు ఆ విధులు నిర్వర్తించారు. ఎల్లాపురంలో సర్వే ఆలస్యం కావడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కుమ్మరిగూడెం, మడికొండలోని కొన్ని ప్రాంతాల్లో సర్వే జరగలేదు. వర్ధన్నపేట మండలంలో ప్రత్యేక అధికారి బి.సంజీవరెడ్డి సర్వేను పర్యవేక్షించారు. పాలకుర్తి మండలం బమ్మెర శివారు పలుగుబోడు తండాలో ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబం సర్వే కోసం సొంత ఊరికి వచ్చింది. ఆ ఇంటి దూలం విరిగి పడి లకావత్ ధర్మా కుమారుడు నితిన్ రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇంటి నంబర్ల కేటాయింపులో పొరపాట్లపై దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావును ప్రజలు నిలదీసారు. తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇదే విషయంపై ప్రజలు ఎన్యూమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలంలో 46 మంది ఎన్యూమరేటర్లు విధులకు రాలేదు. మరిపెడ మండలంలో ఫారాలు సరిపోలేదు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో ఎన్యూమరేటర్ ఐ.మధు కళ్లు తిరిగి పడిపోయాడు. కురవి మండలం బలపాల, గుండ్రాతిమడుగులో అర్ధరాత్రి వరకు సర్వే జరిగింది. ఏటూరునాగారం మండలంలో ఒక దగ్గరే కూర్చుని వివరాలు నమోదు చేయడం కని పించింది. కొత్తగూడ మండలంలో సర్వే ప్రశాతంగా ముగిసింది. వెంకటాపురం మం డలంలో ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడడం తో ప్రేవేటు ఉపాధ్యాయులను, యువజన సంఘాల సభ్యులతో సర్వే చేయించారు. తాడ్వాయి మండలంలో ఇంటి నంబర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మంగపేట మండలంలో అధికారులు చేసిన తప్పులపై ప్రజలు నిలదీశారు. కొన్ని ఇళ్లను విస్మరించడంతో బాధితులు గ్రామ పంచాయతీకి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. గోవిందరావు పేట మండలంలో సర్వే ప్రశాతంగా జరిగింది.