Samuel Lemu
-
మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృతి
అబుజా: మరోసారి నైజీరియా రక్తంతో తడిసి ముద్దయ్యింది. సోమవారం మధ్యాహ్నం బార్నో రాజధాని మైదుగురి నగర మార్కెట్లో బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన బార్నోఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. గతవారం ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించి 35 మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. స్థానికంగా స్థావరాలు ఏర్పరుచుకున్న ఒక ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు వరుసగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో మూడు వేల మందికి పైగా మృతి చెందారని బార్నో అధికారులు తెలిపారు. -
మసీదు వద్ద పేలుళ్లు : 35 మంది మృతి
అబూజా : ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది మరణించగా... 150 మంది గాయపడ్డారని నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు మసీదు వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని చెప్పారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని.... ఆ వెంటనే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు బాధ్యులం తామేనంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని చెప్పారు. నైజీరియాలోని బోకోహరామ్ తీవ్రవాదులే ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ ఏడాది జరిపిన విధ్వంసంలో దాదాపు 3 వేలమందికి పైగా మరణించారని పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు.