Sanaa
-
వైమానిక దాడిలో 15 మంది మృతి
సనా: యెమన్ లో సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన దాడిలో కనీసం 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. యెమెన్ ఉత్తర ప్రావిన్స్ లోని ఆమరాన్ లో సిమెంట్ కర్మాగారంపై బుధవారం ఈ వైమానిక దాడి జరిగింది. కర్మాగారం మెయిన్ గేటు వద్ద కార్మికులు జీతాలు తీసుకుంటుండగా ఈ దాడి జరిగిందని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారని 'జిన్హువా' వార్తా సంస్థ పేర్కొంది. గాయపడిన వారిని ఆమరాన్ లోని ఆస్పత్రికి తరలించారని తెలిపింది. కుటాఫ్ ప్రాంతంలోని ఆల్-జుబారా ట్రైబ్ లోని పలు గ్రామాలపై బుధవారం వైమానిక దాడులు జరిగాయి. సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన మూడు వైమానిక దాడుల్లో 40 మంది గ్రామస్థులు చనిపోవడం లేదా గాయపడడం జరిగిందని స్థానికులు తెలిపారు. -
యెమెన్‌లో బాంబు పేలుళ్లు: 20 మందికి గాయాలు
యెమెన్ రాజధాని సనాలోని అల్ రాబట్ విధిలో నిన్న సంభవించిన వరుస జంట బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. క్షతగాత్రులను సనాలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పింది. అయితే నగరంలోని రాబర్ట్ వీధిలో చెత్త ఉంచిన ప్రదేశంలో మొదటి బాంబు పేలింది. ఆ ఘటనలో ఎవరు గాయపడలేదు. ఆ శబ్దానికి అటువైపుగా వెళ్తున్న పాదచారులు అందరు గుమ్మిగూడారు. మరి కొన్ని నిముషాల వ్యవధిలో మరో బాంబు పేలింది. దాంతో అక్కడ ఉన్నవారందరు తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడు ధాటికి సమీపంలోని కార్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో భద్రత సిబ్బంది రంగంలోని దిగారు. సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. అనంతరం స్థానికంగా తనిఖీలు చేపట్టారు. భద్రత దళాలను హతమార్చేందుకు ఆ బాంబులు పెట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దేశంలో బలంగా విస్తరించిన అల్ ఖైదా అనుబంధ సంస్థలే ఆ బాంబు పేలుళ్లకు కారణమని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే యెమెన్ దక్షణ భాగంలోని సాబ్వా రాజధాని అతక్లో నిన్న ఆత్మాహుతి దాడిలో ఆర్మీ నిఘా అధికారి మరణించాడు. -
బస్సులో బాంబు పేలుడు: ఆరుగురు మృతి
యెమెన్ రాజధాని సనాలో ఆదివారం ఉదయం బస్సులో బాంబు పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మరణించారని భద్రతాధికారులు ఇక్కడ వెల్లడించారు. యెమెన్‌లోని ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఈ ఘటనను బాధ్యులుగా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సనా విమానాశ్రయానికి వెళ్తున్న బస్సులో బాంబు పేలుడు సంభవించిందని తెలిపారు. బాంబు పేలుడు సంభవించడంతో సైనికుల మృతదేహలు రోడ్డుపైకి విసిరివేయబడ్డాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని భద్రతాధికారులు చెప్పారు. గతంలో యెమెన్‌లో ఆల్ ఖైదా సంస్థ ఇటువంటి ఘటనలకు పాల్పడిన సంఘటనలు లెక్కకి మిక్కిలి ఉన్నాయని వారు వివరించారు. -
తెరుచుకోనున్న యూఎస్ దౌత్య కార్యాలయాలు
మధ్య ప్రాచ్య దేశాల్లో తత్కాలికంగా మూసివేసిన రాయబార కార్యాలయాలు ఆదివారం నుంచి తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. ఈ మేరకు నిన్న ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి శనివారం వెల్లడించారు. కాగా యెమెన్ రాజధాని సనాలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని మాత్రం తెరవడం లేదని తెలిపింది. అలాగే పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాల్లోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేయాలని ఒబామా ప్రభుత్వం ఆదేశించిన సంగతిని ఈ సందర్భంగా ఆ అధికారి గుర్తు చేశారు. అలాగే కార్యాలయ సిబ్బంది స్వదేశానికి సాధ్యమైనంత త్వరగా తరలిరావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని యూఎస్ దౌత్య కార్యాలయాలపై తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా దాడుల చేయనున్నట్లు అమెరికా నిఘా సంస్థకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఒబామా ప్రభుత్వం వివిధ దేశాల్లోని దాదాపు 25పైగా యూఎస్ దౌత్య కార్యాలయాను ఈ వారం మొదట్లో మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే యెమెన్ దేశంలో ఆల్ ఖైదాకు చెందిన విభాగం అత్యంత వేగంగా దాడులు చేసే సూచనలు ఉన్నాయని యూఎస్ నిఘా వర్గాలకు సమాచారం చేరింది. దీంతో ఆ దేశ రాజధాని సనాలోని రాయబార కార్యాలయాన్ని ఇప్పుడు అప్పుడే తెరిచే ఆలోచనను యూఎస్ పక్కన పెట్టింది. -
తీవ్రవాదుల జాబితాను విడుదల చేసిన యెమెన్
ప్రముఖ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా యెమెన్ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమైంది. అందుకు దేశంలోని విదేశీ కార్యాలయాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆ దేశ హోంమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన 25 మంది తీవ్రవాదుల పేర్ల జాబితాను సోమవారం సాయంత్రం యెమెన్ రాజధాని సనాలో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల సమాచారం అందజేసిన లేదా ఆచూకీ తెలిపిన వారికి భద్రతా దళాలు రూ.23 వేల అమెరికన్ డాలర్లు పారితోషకంగా అందజేయనున్నాయని తెలిపింది. అయితే యెమెన్ ఆ ప్రకటన విడుదల చేయడంతో ముస్లిం దేశాల్లోని తమ దేశానికి చెందిన 20 దౌత్యకార్యాలయాలను అమెరికా వారం రోజులపాటు మూసివేసింది. యెమెన్‌లోని అల్‌ఖైదా శాఖ అత్యంత ప్రమాదకరమైనదని ఇటీవలే వాషింగ్టన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.