Sanchita Shetty
-
ప్రేమను వెతుక్కుంటూ నిత్యానంద
సినిమా మీద ఇంట్రెస్ట్ తెప్పించడానికి, ఆడియన్స్‌ను థియేటర్ వరకూ రప్పించడానికి కొన్నిసార్లు సినిమా టైటిల్ చాలు. ఆ ఫార్ములాను గట్టిగా నమ్ముతున్నట్టున్నారు తమిళ దర్శకుడు ఆదిక్. ఆల్రెడీ తన గత సినిమాలకు ‘త్రిష ఇల్లన నయనతార (తెలుగులో ‘త్రిషా లేదా నయనతార’) అఅఅ (అన్బానవన్ అసరదావన్ అడంగాదవన్) అని పెట్టారు. ప్రస్తుతం సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా చేస్తోన్న సినిమాకు ఆయన పెట్టిన టైటిల్ ‘కాదలై తేడి నిత్యానంద’ (అంటే ప్రేమను వెతుకుతూ నిత్యానంద). ఈ పాటికే మీకు అర్థం అయ్యింటుంది ఎంత క్రేజీ టైటిల్‌ని తన సినిమాకు పెట్టారో. పోస్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది కదూ. సోనియా అగర్వాల్, అమైరా దస్తూర్, సంచితా శెట్టి హీరోయిన్లుగా ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రేమను వెతుక్కునే అమర ప్రేమికుడిగా జీవీ ప్రకాశ్ కనిపిస్తారని ఊహించవచ్చు. -
బంగ్లాలో ఏం జరిగింది?
హృషికేశ్, నరైన్, మియాజార్జ్, సంచితా శెట్టి ప్రధాన పాత్రల్లో సాయిభరత్ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం ‘రమ్’. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్ మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ‘మంత్రిగారి బంగళా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం ఉత్కంఠ కల్గిస్తుంది. సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మియాజార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. అనిరుధ్ బాణీలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. జనవరిలో పాటలను, ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబీ త్రిష. -
అది మరుపురాని సంఘటన
కొన్ని చిత్రాల్లోని కొన్ని సంఘటనలు మనసులో నిలిచిపోతాయి.అవి భయపెట్టేవి కావచ్చు,థ్రిల్ చేసేవి కావచ్చు. అలాంటి సంఘటనే రమ్ చిత్రంలో తాను చవిచూశానని అంటోంది నటి సంచితాశెట్టి. సూదుకవ్వుమ్ చిత్రంలో ఊహా పాత్రలో మెరిసి యువత గుండెల్ని కొల్లగొట్టిన ఈ బ్యూటీ సుమారు మూడేళ్ల తరువాత తమిళంలో కథానాయకిగా నటిస్తున్న చిత్రం రమ్.నవ దర్శకుడు సాయి కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్ ఇన్ఫ్రక్చర్స్ పతాకంపై విజయ్ నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి ఆ చిత్ర కథానాయకి సంచితాశెట్టి తెలుపుతూ పిజ్జా-2 చిత్రం తరువాత తాను నటిస్తున్న తమిళ చిత్రం రమ్ అని తెలిపారు.హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తిగా రాత్రి వేళల్లోనే చిత్రీకరణను జరుపుకుంటోందన్నారు. ఇందులో కారు చేజింగ్ సన్నివేశం ఉంటుందన్న విషయం తనకు తెలుసు గానీ ఆ కారును తానే డ్రైవ్ చేయాలన్న సంగతి తెలియదన్నారు. అనూహ్యంగా దర్శకుడు తన కారు ఎక్కించి డ్రైవ్ చేయమన్నారని తెలిపారు. దీంతో వెన్నులో వణుకు పట్టుకొచ్చిందన్నారు.ఆ వెంటనే తన సహ నటులు రిషికేష్, వివేక్, అమ్జద్ కారు ఎక్కారన్నారు. ఇక తన భయం రెట్టింపైందని చెప్పారు. కారణం తనకు కారును సాధారణంగా నడపడమే వచ్చు అని, ఇలా అర్ధరాత్రి చేజింగ్ చేయడం అంటే చాలా కంగారు పడ్డానని అన్నారు. ఎలాగోలా ఆ కారు చేజింగ్ పూర్తి చేసిన తరువాత దర్శకుడు వచ్చి ఏమ్మా భయపడతావు. సన్నివేశం సూపర్‌గా వచ్చింది అని చెప్పడంతో సంతోషంగా ఊపిరి పీల్చుకున్నానని సంచితాశెట్టి చెప్పుకొచ్చింది. ఈ కారు చేజింగ్ సన్నివేశంలో నటించడం మరుపురాని సంఘటనగా ఆమె పేర్కొంది. రమ్ చిత్రం మూడో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
ఐదు రోజుల్లో 3 కోట్లు వసూలుచేసిన 'విల్లా'
హారర్- థ్రిల్లర్‌గా వచ్చిన 'పిజ్జా2: విల్లా' చిత్రం పిజ్జా అంత గొప్పగా వసూళ్లు చేయలేకపోయినా.. క్రమంగా దూసుకెళ్తోంది. తమిళనాడులోనే మొదటి ఐదు రోజుల్లో ఇది 3.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాణానికి అయ్యిన మొత్తం ఖర్చే ఐదు కోట్ల రూపాయలు కావడం ఇక్కడ గమనార్హం. పిజ్జా లాంటి బీభత్సమైన ఓపెనింగులు దీనికి రాకపోవచ్చు గానీ, అయినా క్రమంగా బాక్సాఫీసులో స్థానం సంపాదిస్తోందని ట్రేడ్ ఎనలిస్టు త్రినాథ్ తెలిపారు. పిజ్జా సినిమా ఇటు విమర్శకుల నుంచి, అటు ప్రేక్షకుల నుంచి సమాన స్థాయిలో ఆదరణ పొందిందని, కానీ విల్లాకు మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయని అంటున్నారు. చాలామందికి సినిమా ముగింపు సరిగా అర్థం కాలేదని, సినిమా హారర్ తరహా కాబట్టి, చూసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్లు చూడకపోయి ఉండొచ్చని త్రినాథ్ అన్నారు. అయితే క్రమంగా రెండోసారి చూసేటప్పుడు మాత్రం అన్నింటికీ కనెక్ట్ అవుతారని అన్నారు. అశోక్ సెల్వన్, సంచితా శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో కూడా విడుదలైంది.