అది మరుపురాని సంఘటన | Sanchita Shetty's amazing car thrills in RUM | Sakshi
Sakshi News home page

అది మరుపురాని సంఘటన

Published Sun, Apr 3 2016 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

అది మరుపురాని సంఘటన

అది మరుపురాని సంఘటన

కొన్ని చిత్రాల్లోని కొన్ని సంఘటనలు మనసులో నిలిచిపోతాయి.అవి భయపెట్టేవి కావచ్చు,థ్రిల్ చేసేవి కావచ్చు. అలాంటి సంఘటనే రమ్ చిత్రంలో తాను చవిచూశానని అంటోంది నటి సంచితాశెట్టి. సూదుకవ్వుమ్ చిత్రంలో ఊహా పాత్రలో మెరిసి యువత గుండెల్ని కొల్లగొట్టిన ఈ బ్యూటీ సుమారు మూడేళ్ల తరువాత తమిళంలో కథానాయకిగా నటిస్తున్న చిత్రం రమ్.నవ దర్శకుడు సాయి కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్ ఇన్‌ఫ్రక్చర్స్ పతాకంపై విజయ్ నిర్మిస్తున్నారు.
 
 అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి ఆ చిత్ర కథానాయకి సంచితాశెట్టి తెలుపుతూ పిజ్జా-2 చిత్రం తరువాత తాను నటిస్తున్న తమిళ చిత్రం రమ్ అని తెలిపారు.హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తిగా రాత్రి వేళల్లోనే చిత్రీకరణను జరుపుకుంటోందన్నారు. ఇందులో కారు చేజింగ్ సన్నివేశం ఉంటుందన్న విషయం తనకు తెలుసు గానీ ఆ కారును తానే డ్రైవ్ చేయాలన్న సంగతి తెలియదన్నారు.
 
  అనూహ్యంగా దర్శకుడు తన కారు ఎక్కించి డ్రైవ్ చేయమన్నారని తెలిపారు. దీంతో వెన్నులో వణుకు పట్టుకొచ్చిందన్నారు.ఆ వెంటనే తన సహ నటులు రిషికేష్, వివేక్, అమ్జద్ కారు ఎక్కారన్నారు. ఇక తన భయం రెట్టింపైందని చెప్పారు. కారణం తనకు కారును సాధారణంగా నడపడమే వచ్చు అని, ఇలా అర్ధరాత్రి చేజింగ్ చేయడం అంటే చాలా కంగారు పడ్డానని అన్నారు.
 
  ఎలాగోలా ఆ కారు చేజింగ్ పూర్తి చేసిన తరువాత దర్శకుడు వచ్చి ఏమ్మా భయపడతావు. సన్నివేశం సూపర్‌గా వచ్చింది అని చెప్పడంతో సంతోషంగా ఊపిరి పీల్చుకున్నానని సంచితాశెట్టి చెప్పుకొచ్చింది. ఈ కారు చేజింగ్ సన్నివేశంలో నటించడం మరుపురాని సంఘటనగా ఆమె పేర్కొంది. రమ్ చిత్రం మూడో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement