Sanjay Manjrekar (cricketer)
-
నువ్వు నాతో మాట్లాడతావా? మంజ్రేకర్ ప్రశ్నకు జడ్డూ ఏమన్నాడంటే!
Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. అఖరి వరకు జరిగిన ఈ ఉత్కంఠ పోరులో దాయాది జట్టుపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన పాండ్యా.. అనంతరం బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అదే విధంగా టీమిండియా విజయంలో భారత్ విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. కీలక దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు. అనంతరం సూర్య ఔటయ్యాక హార్దిక్ పాండ్యాతో కలిసి జడేజా భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు కావల్సిన నేపథ్యంలో జడేజా(35) ఔటయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం జడేజాను భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేశాడు. అయితే మంజ్రేకర్ ప్రశ్న అడగకముందే జడ్డూ నవ్వడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మంజ్రేకర్ తన మొదటి ప్రశ్నగా.. జడ్డూ నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? అన్నాడు. దానికి బదులుగా జడేజా నవ్వుతూ.. "అవును, అవును కచ్చితంగా మాట్లాడుతా" అంటూ సమాధానమిచ్చాడు. అనంతరం ఇద్దరూ ఒక్క సారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జడేజా అరకొర క్రికెటర్! కాగా గత కొంత కాలంగా మంజ్రేకర్-రవీంద్ర జడేజా మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని ‘అరకొర క్రికెటర్’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అనంతరం మంజ్రేకర్ వాఖ్యలకు జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు. "ఇప్పటికే నా కెరీర్లో నువ్వు ఆడిన మ్యాచ్లకంటే నేను రెట్టింపు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. మొదట మనుషులను గౌరవించడం నేర్చుకోండి. ఇకనైనా ఇలాంటివి ఆపితే మంచిది" అంటూ ట్విటర్ వేదికగా బదులు ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో విఫలమైన జడేజాకు భారత జట్టులో చోటు దక్కడం కష్టమంటూ కూడా మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఇద్దరూ సరదాగా సంభాషించుకోవడం చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. Success makes you the bigger person 😄@imjadeja pic.twitter.com/RhqqGFEL0b — Nachiket Kher (@NachiketKher) August 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); For his match-winning knock of 33* off 17 deliveries, @hardikpandya7 is our Top Performer from the second innings. A look at his batting summary here 👇👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/DEHo3wPM1N — BCCI (@BCCI) August 28, 2022 -
T20 WC 2022: 'ఆ ఆల్‌రౌండర్‌కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్ జడేజా చోటు సంపాదించడం చాలా కష్టమని అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ భారత జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తుండడంతో జట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు సవాల్‌తో కూడుకున్నదే అని చెప్పుకోవాలి. కాగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు గాయం కారణంగా జడేజా దూరమయ్యాడు. అయితే ఐపీఎల్-2022లో ఆడిన జడేజా తీవ్రంగా నిరాశపరిచాడు. 10 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 116 పరుగులతో పాటు 5వికెట్లు పడగొట్టాడు. "ఏడో స్థానంలో దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ, ఐపీఎల్లోను కార్తీక్ దుమ్మురేపాడు. కాబట్టి కార్తీక్ స్ధానంలో జడేజా జట్టులోకి రావడం అంత సులభం కాదు అని భావిస్తున్నాను. అదే విధంగా హార్దిక్ పాండ్యా కూడా భీకర ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ పరంగా టీమిండియా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే జడేజాకు కూడా జట్టును గెలిపించగల సత్తా ఉంది. చాలా మ్యాచ్‌లలో భారత జట్టును ఒంటి చేత్తో జడేజా విజయ తీరాలకు చేర్చాడు. కాబట్టి టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేయడంలో సెలక్టర్లకు తలనొప్పి రావడం ఖాయమని" సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IRE vs IND: 'టీమిండియా అత్యుత్తమ జట్టు.. మేము గట్టి పోటీ ఇస్తాం' -
నన్ను వ్యాఖ్యాతగా తీసుకోండి
ముంబై: మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనను మళ్లీ టీవీ వ్యాఖ్యాతగా తీసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని అభ్యర్థించాడు. యూఏఈలో జరగబోయే ఐపీఎల్–13లో వ్యాఖ్యానం చేసేందుకు అనుమతించాలని కోరుతూ బోర్డుకు ఈ–మెయిల్ పంపాడు. ‘గౌరవనీయులైన బోర్డు ఉన్నతాధికారులకు మనవి. నేను ఇదివరకే కామెంటేటర్‌గా నాకు స్థానం కల్పించాలని మెయిల్ చేశాను. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కావడంతో బీసీసీఐ.టీవీ త్వరలోనే కామెంట్రీ ప్యానెల్‌ను ఎంపిక చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలున్న నన్ను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నాను. గతంలో బోర్డు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించడంలో పొరపాటు జరిగింది. ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. అలాగే నడుచుకుంటానని తెలియజేస్తున్నాను’ అని మంజ్రేకర్ ఆ ఈ–మెయిల్లో పేర్కొన్నారు. బీసీసీఐ నియమావళికి విరుద్ధంగా బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ రవీంద్ర జడేజాను విమర్శించడంతో కొందరు క్రికెటర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది మార్చిలో కామెంట్రీ ప్యానెల్ నుంచి మంజ్రేకర్‌ను తొలగించారు. భారత్–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ముందే ఉన్నపళంగా అతన్ని తప్పించారు. అయితే ఆ సిరీస్ కరోనా వల్ల రద్దయింది. ఇప్పుడు మంజ్రేకర్‌ను మన్నించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. అయితే దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని బోర్డు అధికారులు తెలిపారు. కాగా 71 ఏళ్ల భారత దిగ్గజం సునీల్ గావస్కర్ క్రికెట్ వ్యాఖ్యానం కోసం యూఏఈ వెళ్లనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయనకు ఉన్న చోటే వర్చువల్ కామెంట్రీ అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఆటపై ఉన్న ఆసక్తితో నేరుగా కామెంట్రీ చేసేందుకు ఆయన అక్కడికి వెళ్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. -
హర్మన్.. పొవార్ అవసరం లేదు : మంజ్రేకర్
ముంబై : మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. కోచ్‌గా అతనికిచ్చిన గడువు గత నెల 30వ తేదీతో ముగిసిపోవడంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే టీ20 మహిళా ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్‌తో వివాదం కారణంగా పొవార్ మళ్లీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేవనే వాదన వినిపించింది. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని కూడా అందరూ భావించారు. కానీ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలు పొవార్‌కు మద్దతుగా నిలవడంతో కథ మొదటికి వచ్చింది. అతడి ఆధ్వర్యంలో జట్టు మెరుగ్గా ఆడిందని కోచ్‌గా మరికొంత కాలం కొనసాగించాలని వీరిద్దరు బోర్డుకు లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఈ లేఖలపై మంజ్రేకర్ ట్విటర్లో స్పందించారు. ‘పొవార్ కోచ్‌గా లేని సమయంలో కూడా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. దాదాపు టైటిల్ గెలిచినంత పనిచేసింది. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్ గుర్తు తెచ్చుకోవాలి. పొవార్‌ను కోచ్ పదవి నుంచి తీసేస్తే, అక్కడి నుంచి కొత్తగా మొదలు పెట్టాలి. అంతేగాని కోచ్ పదవీ కాలాన్ని పెంచుకుంటూ పోకూడదు’ అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇక మిథాలీ అభిమానులు సైతం హర్మన్ ప్రీత్, స్మృతి మంధానలపై మండిపడుతున్నారు. పోవార్ వల్లే భారత మహిళలు ప్రపంచకప్ గెలిచే అవకాశం కోల్పోయారని, అటువంటి కోచ్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక కోచ్ పొవార్ తనను ఎంతగానో అవమానించాడని మిథాలీ రాజ్ బీసీసీఐకు లేఖ రాసిన విషయం తెలిసిందే. Harmanpreet needs reminding that when Powar was not coach India reached the finals of the WC and almost won it. By suggesting that if Powar is removed we have to start from scratch is an exaggeration of any coach’s role in the team. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) December 4, 2018 చదవండి: కోచ్‌గా పొవార్‌నే కొనసాగించండి: హర్మన్ లేఖ ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ -
గంభీర్ బ్యాట్స్‌మన్ కాదు.. కెప్టెనే..!
న్యూఢిల్లీ : ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. ఢిల్లీకి గంభీర్ లాంటి సమర్ధవంతమైన నాయకుడి అవసరముందని అన్నారు. గంభీర్‌ను జట్టు సారథ్య బాధ్యతల నిర్వహణకే ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందని అభిప్రాయపడ్డారు. ‘తన సహచర ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలతో ఢిల్లీ ఆరు మ్యాచ్‌లలో ఐదింటిని కోల్పోయి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్డడుగున నిలిచింది. జట్టును ముందుండి నడిపించాల్సింది కెప్టెనే. కానీ, మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లభించక పోవడంతో అతనిపై ఒత్తిడి పెరగడం సహజం. దాంతో గంభీర్ కూడా తన ఆటపట్ల శ్రద్ధ పెట్టలేక పోయాడ’ని మంజ్రేకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మాక్స్వెల్ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్ వైఫల్యాలు గంభీర్‌ను బాధించి ఉండొచ్చని అన్నారు. టీం సభ్యులందరూ వారి సామర్థ్యాలకు తగ్గట్లు ఆడితే నాయకుడికి ఏ సమస్యలు ఉండవని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ‘వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జట్టులో మార్పులు చేయాలనుకోవడం మంచి పనే. అయితే, కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వచ్చినంత మాత్రాన ఢిల్లీ దూసుకుపోతుందని చెప్పలేం. అందరి సమష్టి కృషి ఫలితమే వారికి విజయాలను తెచ్చిపెడుతుంద’ని మంజ్రేకర్ చెప్పారు. బౌలింగ్ పరంగా కూడా ఢిల్లీ పటిష్టంగా లేదని, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఒక్కడిపైనే ఆధారపడడం సరైంది కాదని సంజయ్ అన్నారు. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సంజయ్ మంజ్రేకర్ (క్రికెటర్), మునాఫ్ పటేల్ (క్రికెటర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల మైన్లు, సిమెంట్, ఎలక్ట్రికల్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి బాగుంటుంది. కుజప్రభావం వల్ల కొంత దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అధికారులతోనూ, తోటివారితోనూ వాగ్వివాదాలు, కుటుంబ సభ్యులతో వాదులాటలతో అందరినీ దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మాట్లాడేప్పుడు సంయమనం పాటించడం మంచిది. అయితే 9 నవ వసంత చక్రం చివరి దశ కావడం వల్ల సంవత్సరమంతా సంపూర్ణత, సంతృప్తి, కార్యసిద్ధి కలుగుతాయి. సంతానం పురోగతి సంతృప్తినిస్తుంది. మీ డేటాఫ్ బర్త్ 12. దీనికి బృహస్పతి అధిపతి. దీనిమూలంగా మీరు మంచి ఊహాశక్తి, చతురత కలిగి ఉండటం వల్ల అందరూ మిమ్మల్ని ఆత్మీయులుగా చూస్తారు. లక్కీ నంబర్స్: 3,5,9; లక్కీ కలర్స్: ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ;లక్కీ డేస్: ఆది, మంగళ, గురువారాలు. సూచనలు: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. తొందరగా ధనవంతులు కావాలనే కోరికను తగ్గించుకోవాలి. దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, గురువులను, పండితులను గౌరవించడం, అనాథలకు ఆసరా ఇవ్వడం మంచిది. - డాక్టర్ ముహ్మద్ దావూద్