రవీంద్ర జడేజా(Pic Credit: Disney+Hotstar)
Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. అఖరి వరకు జరిగిన ఈ ఉత్కంఠ పోరులో దాయాది జట్టుపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు.
తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన పాండ్యా.. అనంతరం బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అదే విధంగా టీమిండియా విజయంలో భారత్ విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. కీలక దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు.
అనంతరం సూర్య ఔటయ్యాక హార్దిక్ పాండ్యాతో కలిసి జడేజా భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే ఆఖరి ఓవర్‌లో ఏడు పరుగులు కావల్సిన నేపథ్యంలో జడేజా(35) ఔటయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం జడేజాను భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేశాడు.
అయితే మంజ్రేకర్ ప్రశ్న అడగకముందే జడ్డూ నవ్వడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మంజ్రేకర్ తన మొదటి ప్రశ్నగా.. జడ్డూ నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? అన్నాడు. దానికి బదులుగా జడేజా నవ్వుతూ.. "అవును, అవును కచ్చితంగా మాట్లాడుతా" అంటూ సమాధానమిచ్చాడు. అనంతరం ఇద్దరూ ఒక్క సారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
జడేజా అరకొర క్రికెటర్!
కాగా గత కొంత కాలంగా మంజ్రేకర్-రవీంద్ర జడేజా మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని ‘అరకొర క్రికెటర్’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అనంతరం మంజ్రేకర్ వాఖ్యలకు జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు. "ఇప్పటికే నా కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌లకంటే నేను రెట్టింపు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను.
మొదట మనుషులను గౌరవించడం నేర్చుకోండి. ఇకనైనా ఇలాంటివి ఆపితే మంచిది" అంటూ ట్విటర్ వేదికగా బదులు ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో విఫలమైన జడేజాకు భారత జట్టులో చోటు దక్కడం కష్టమంటూ కూడా మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఇద్దరూ సరదాగా సంభాషించుకోవడం చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Success makes you the bigger person 😄@imjadeja pic.twitter.com/RhqqGFEL0b
— Nachiket Kher (@NachiketKher) August 28, 2022
For his match-winning knock of 33* off 17 deliveries, @hardikpandya7 is our Top Performer from the second innings.
— BCCI (@BCCI) August 28, 2022
A look at his batting summary here 👇👇#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/DEHo3wPM1N
Comments
Please login to add a commentAdd a comment