sanjay patil
-
టీమిండియా స్టార్లపై ‘చీఫ్ సెలక్టర్’ ఆగ్రహం! అగార్కర్‌కు విన్నపం
టీమిండియా స్టార్ క్రికెటర్ల తీరుపై ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్(Sanhay Patil) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొక్కుబడిగా రంజీల్లో ఆడటం వల్ల ముంబై జట్టుకు తీరని అన్యాయం జరిగిందన్నాడు. ‘స్టార్ల’ కోసం ఉత్తమంగా రాణిస్తున్న వర్ధమాన క్రికెటర్లను పక్కనపెట్టడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు.దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేకాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను అతిక్రమించిన ఇషాన్ కిషన్(Ishan Kishan), శ్రేయస్ అయ్యర్‌లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించి వేటు వేసింది. తద్వారా ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ బరిలో దిగాలనే కచ్చితమైన సంకేతాలు ఇచ్చింది.కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుఈ నేపథ్యంలో టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమైన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రికార్డుల రారాజు విరాట్ కోహ్లి కూడా రంజీ బరిలో దిగారు. ఇక రోహిత్‌తో పాటు అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే తదితరులు ముంబై తరఫున మ్యాచ్‌లు ఆడారు.అయితే, రోహిత్‌తో పాటు జైస్వాల్ తాము ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై.. ఈసారి సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తమ జట్టు వైఫల్యానికి టీమిండియా ఆటగాళ్లే పరోక్ష కారణమనేలా వ్యాఖ్యలు చేశాడు.అగార్కర్‌కు విన్నపం‘‘ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెటర్ల వల్ల అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఆసక్తిలేకుండా దేశీ జట్టు తరఫున బరిలోకి దిగి వారు బాగా ఆడకపోతే నష్టం మనకే వస్తుంది. కాబట్టి అసోసియేషన్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.బీసీసీఐ ఆదేశాల వల్ల మనం వారికి జట్టులో చోటు ఇస్తున్నామన్న మాట వాస్తవం. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ మొత్తానికి నాదొక విన్నపం. కేవలం మీరు చెప్పారన్న కారణంగానే ఇంటర్నేషనల్ స్టార్లు దేశీ మ్యాచ్‌లు ఆడుతున్నారు.బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందనే ఉద్దేశంతో తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఇలా చేస్తున్నారు. కానీ ఇకపై దేశవాళీ మ్యాచ్‌లలో కూడా వారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటామని మీరు హెచ్చరించండి.టీమిండియాకు ఎంపిక చేసే సమయంలో ఈ ప్రదర్శనను పరిశీలిస్తామని చెప్పండి. అలా కాకుండా కేవలం ఆడి రండి అని చెబితే మాత్రం దేశీ జట్ల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని స్పోర్ట్‌స్టార్‌తో సంజయ్ పాటిల్ వ్యాఖ్యానించాడు.సెమీస్‌లో విదర్భ చేతిలో ఓటమికాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూళ్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. ఇక కెప్టెన్ అజింక్య రహానే సహా సూర్యకుమార్ యాదవ్ విదర్భతో సెమీ ఫైనల్లో పూర్తిగా నిరాశపరిచారు. రహానే 18, 12 పరుగులు చేయగా.. సూర్య 0, 23 రన్స్ మాత్రమే చేశాడు. మరోవైపు.. శివం దూబే 0, 12 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక శార్దూల్ 33 ఓవర్లలో 133 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లో 37, 66 పరుగులు చేశాడు.చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
‘నినాదాలు కాదు.. మహిళలకు గౌరవం ఇవ్వటం నేర్చుకోండి’
బెంగళూరు: కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ తీవ్రంగా ఖండించారు. సంజయ్ పాటిల్ ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకు మహిళలకు మద్దతు పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్కు నిద్ర పట్టడం లేదన్నారు. ఆమెకు నిద్ర పట్టాలంటే నిద్ర మాత్ర లేదా ఒక పెగ్గు ఎక్కువగా తాగాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సంజయ్ పాటిల్ వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తాజాగా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ వీడియో ద్వారా స్పందించారు. ‘బీజేపీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. మహిళలను కించపరచడమే బీజేపీ వాస్తవ అజెండా. జై శ్రీరామ్, బేటీ బచావో.. బేటీ పడావో వంటి నినాదాలు ఇవ్వటం కాదు. ముందు మహిళలకు మర్యాదు ఇవ్వటం నేర్చుకోవాలి. ఇదే మా హిందూ సంస్కృతి అని సంజయ్ పాటిల్ ఉపన్యాసాలు ఇస్తారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నన్ను ఒక్కరిని అవమానించినట్లు కాదు.. మొత్తం కర్ణాటక రాష్ట్ర, దేశ మహిళల అవమానించినట్లు’ అని లక్ష్మీ హెబ్బాల్కర్ మండిపడ్డారు. సంజయ్ పాటిల్ ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక..లోక్‌సభ ఎన్నికల్లో బెలగావి పార్లమెంట్ స్థానం నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ పోటీచేస్తున్నారు. మరోవైపు.. బీజేపీ తరఫున ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బరిలో ఉన్నారు. జగదీష్ శెట్టర్ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ టికెట్ ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ చేరారు. మళ్లీ ఇటీవల తిరిగి బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన బెలగావి టికెట్ దక్కించుకున్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. బాబ్రీ మసీదు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, రామ మందిరం కోరుకున్న వాళ్లు బీజేపీకి ఓట్లేసి గెలిపించాలన్నారు. దీంతో ఎన్నికల ప్రచారం పూర్తిగా మత ప్రచారంలా మారిపోయిందంటూ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నేత సంజయ్ పాటిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 'నా పేరు సంజయ్ పాటిల్. నేను హిందువును. మనది హిందూదేశం. బీజేపీని గెలిపిస్తే రామ మందిరం నిర్మిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాలికర్ రామ మందిరం నిర్మిస్తామని హామీ ఇస్తారు. కానీ వారిని గెలిపిస్తే కచ్చితంగా బాబ్రీ మసీదు నిర్మిస్తారు. మసీదు కోరుకునేవాళ్లు కాంగ్రెస్‌కు, రామ మందిరం కావాలనుకుంటే బీజేపీకి మద్దతు తెలపాలని' బహిరంగ సభలో సంజయ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోటార్‌సైకిల్ ర్యాలీ సరిగ్గా చేయడం లేదని చెప్పిన పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించి విమర్శల పాలైన విషయం తెలిసిందే. రోడ్లు, నీళ్లు అంటూ అభివృద్ధి, పథకాల గురించి మాట్లాడకుండా బీజేపీ నేత సంజల్ పాటిల్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. -
ఎదురులేని శ్రీనివాసన్!
చెన్నై: చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎంత మంది అడ్డుకోవాలని ప్రయత్నించినా... బీసీసీఐలో తనకు ఎదురులేదని శ్రీనివాసన్ మరోసారి నిరూపించుకున్నారు. నేడు (ఆదివారం)జరిగే బీసీసీఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఇక ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే సుప్రీం కోర్టులో బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) వేసిన పిటిషన్ కారణంగా ఆ తీర్పు వచ్చేదాకా శ్రీనివాసన్ ఎన్నికైనా బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. దీంతో దాల్మియానే అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగించే వీలుంది. అయితే సంతకాలు చేసే అధికారాన్ని మాత్రం దాల్మియాకు ఇచ్చేందుకు శ్రీనివాసన్ ఇష్టపడడం లేదు. ఈ విషయంలో కార్యదర్శి సంజయ్ పటేల్ ముఖ్యమైన డాక్యుమెంట్స్‌పై సంతకాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డు చీఫ్ బరిలో శశాంక్ మనోహర్, శరద్ పవార్లు పోటీలో నిలుస్తారని కథనాలు వెలువడినప్పటికీ వారిద్దరి నుంచి ఇప్పటిదాకా స్పందన కనిపించలేదు. అలాగే ఏజీఎంలో ఐపీఎల్ చైర్మన్‌గా రాజీవ్ శుక్లా స్థానంలో ఎవరిని నియమించనున్నారో తేలనుంది. దాల్మియా పేరు వినిపిస్తున్నప్పటికీ ఈ బాధ్యతలో ఉన్నవారు తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి ఉండడంతో ఎవరైనా యువ పరిపాలకుడిని నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. హర్యానా సంఘం చీఫ్ అనిరుధ్ చౌధురి పేరు ఈ పోస్ట్‌కు ముందు వరుసలో ఉంది. నూతన ఉపాధ్యక్షుడిగా శుక్లా ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా బీసీసీఐ నూతన ఉపాధ్యక్షుడిగా నియామకం కానున్నారు. ఆయనతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి సావంత్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి స్నేహ్ బన్సాల్ కూడా ఉపాధ్యక్షులుగా ఎంపికవనున్నారు. ఇప్పటిదాకా ఉపాధ్యక్షులుగా కొనసాగిన అరుణ్ జైట్లీ, నిరంజన్ షా, సుధీర్ దబీర్ వివిధ కార ణాల రీత్యా తమ పదవుల పొడిగింపునకు నిరాకరించారు. నేటి ఏజీఎంలో వీరి ఎంపిక ఖరారు కానుంది. 2014 సాధారణ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర నిర్వహించాల్సి రావడంతో బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ బోర్డు ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే దబీర్, షా మార్పు వెనుక పలు కథనాలు వినిపిస్తున్నాయి. దబీర్.. శశాంక్ మనోహర్‌కు, షా.. శరద్ పవార్‌కు సన్నిహితం కాబట్టే ఉద్వాసన పలికారని సమాచారం. చిత్రక్ మిత్రా (బెంగాల్), శివలాల్ యాదవ్ (హైదరాబాద్) ఉపాధ్యక్షులుగా మరో ఏడాదిపాటు కొనసాగుతారు. ఎన్నికయ్యే ఆఫీస్ బేరర్లు: అధ్యక్షుడు: శ్రీనివాసన్, కార్యదర్శి: సంజయ్ పటేల్, కోశాధికారి: అనిరుధ్ చౌధురి, సంయుక్త కార్యదర్శి: అనురాగ్ ఠాకూర్, ఉపాధ్యక్షులు: సావంత్ (వెస్ట్), శుక్లా (సెంట్రల్), ఎస్పీ బన్సాల్ (నార్త్), శివలాల్ (సౌత్), చిత్రక్ మిత్రా (ఈస్ట్).