Santi
-
భర్త వేధింపులు తాళలేక..
భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని నల్లబండకు చెందిన శాంతి(24)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువవడంతో.. శాంతి ఆదివారం రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడని.. మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. -
మొన్న రోజా - నేడు శాంతి!
-
మొన్న రోజా - నేడు శాంతి!
నగరి(చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేదని చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్ శాంతిపై సోమవారం దాడి జరిగిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కె. శాంతిపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత ముద్దు కృష్ణమ నాయుడు వర్గీయులు సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. కుడి చేతికి గాయమైంది. గతంలో జాతర సమయంలో తనపై దాడి జరిగితే, ఇప్పుడు చైర్‌పర్సన్‌పై దాడి జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్దుకష్ణమ నాయుడు దిగజారుడు రాజకీయాలే ఈ దాడులకు కారణమన్నారు. స్మగ్లర్లను ఆయన తన అదుపులో ఉంచుకుని ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దాడులకు చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారని రోజా ప్రశ్నించారు.