saptagiri rural bank
-
బ్యాంకు దోపిడీ దొంగ అరెస్టు
796 గ్రాముల బంగారం స్వాధీనం నిందితుడు సినిమా నిర్మాత ? సత్యవేడు : చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో 2014 నవంబర్ 16న జరిగిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి తమిళనాడు రాష్ట్రం తిరువారుర్కు చెందిన ఎన్.బాలమురుగన్(45)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్న అతడిని ఈ నెల తొమ్మిదో తేదీ పీటీ వారెంట్‌పై వరదయ్యపాళెం పోలీసులు తీసుకొచ్చారు. నిందితుడి నుంచి 796 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. చిన్న వయసు నుంచే.. బాలమురుగన్ 18 ఏళ్ల వయసు నుంచే చోరీలకు అలవాటుపడ్డాడు. ఇతనిపై ఇంటి దొంగతనాలకు సంబంధించి తమిళనాడులో 30 కేసులు, కర్ణాటకలో 80 వరకు కేసులు ఉన్నాయి. బెంగళూరులో చోరీలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడ మంజుల అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు అందరూ తమిళనాడులో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. గొప్పవాడు కావాలని... తమ కుటుంబ సభ్యుల కంటే గొప్పగా ఉండాలని, తనకు గుర్తింపు రావాలని బాలమురుగన్ సినిమాలు తీయాలని ఆలోచించాడు. అందుకు డబ్బు ఎక్కువ కావాల్సి వస్తుందనే ఉద్దేశంతో చిన్న దొంగతనాలు మానేసి బ్యాంకు దోపిడికీ ప్లాన్ చేశాడు. ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నపుడు మొబైల్లో ఇంటర్నెట్ ద్వారా దొంగతనం చాకచక్యంగా చేసే విధానం తెలుసుకున్నాడు. సెక్యూరిటీ ఉన్న బ్యాంకుల వివరాలను మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే గుర్తించాడు. చోరీ సమయంలో గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచేవాడు. మొట్ట మొదట అతడు హైదరాబాద్‌లోని ఓ గ్రామీణ బ్యాంకులో చోరీ చేశాడు. అనంతరం వరదయ్యపాళెం బ్యాంకు, ఆ తరువాత బాలానగర్ బ్యాంకుల్లో దొంగతనాలు చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోనూ నాలుగు బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు ప్రస్తుతం ‘మనసా వినవే’ అనే తెలుగు సినిమా ను రూ. 7 కోట్లు ఖర్చు చేసి తీస్తున్నట్లు తెలిసింది. మీడియా సమావేశంలో వరదయ్యపాళెం సీఐ టి.నరసింహులు, ఎస్ఐ షేక్షావలిపాల్గొన్నారు. -
సప్తగిరి గ్రామీణ బ్యాంకు ముట్టడి
ఒక్క రైతుకూ బంగారు రుణం మాఫీ కాని వైనం కొంత వుందికి మాత్రమే పంట రుణాల మాఫీ పత్తికొండ బ్యాంకును ముట్టడించిన రైతులు గంగవరం : రుణవూఫీలో తవుకు అన్యాయుం జరిగిందని ఆగ్రహించిన రైతన్నలు శుక్రవారం పత్తికొండ సప్తగిరి గ్రామీణ బ్యాంకును వుుట్టడించారు. బ్యాంకు గేట్లను ముసేసి సువూరు ఐదు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వూట్లాడుతూ 1200 వుంది రైతులు బంగారు నగలు తాకట్టుపెట్టి వ్యవసాయు రుణాలు తీసుకున్నావున్నారు. తాకట్టు పెట్టే సవుయుంలో టెన్-1తోపాటు పాసుపుస్తకాల ఫొటోస్టాట్ కాపీలు కూడా అందచేశామని పేర్కొన్నారు. 980 వుంది రైతులు పాసుపుస్తకాలు తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రుణవూఫీ జాబితాలో బంగారు నగలు తాకట్టు పెట్టిన ఏ ఒక్క రైతు పేరూ జాబితాలో లేకపోవడం దారుణవున్నారు. అన్ని రికార్డులూ సక్రవుంగా అందచేసి రుణాలు తీసుకున్నప్పటికీ బ్యాంకు అధికారులు గోల్‌వూల్ చేసి వ్యవసాయు రుణాల జాబితాలో చేర్చకుండా కవుర్షియుల్ జాబితాలో పెట్టారని వాపోయూరు. ఇప్పటికే వుూడు సార్లు నోటీసులు జారీ చేశారని ఈ విషయుంపై బ్యాంకులో సంప్రదిస్తే సరైన సవూధానం కూడా చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధలనకు లోబడి ఉన్నప్పటికీ తవు పేర్లు రుణవూఫీ జాబితాలో ఎందుకు లేవని ప్రశ్నించారు. బంగారు రుణాల కింద రూ.4 కోట్లు, పంట రుణాల కింద రూ.6 కోట్లు తీసుకోగా, రుణవూఫీ అరుుంది కేవలం రూ.2 కోట్లు వూత్రమేనని అందులో బంగారు రుణాల్లో ఒక్కరికి కూడా న్యాయుం జరగలేదని ఆరోపించారు. బ్యాంకర్ల తప్పిదవూ లేక ప్రభుత్వ తప్పిదవూ అనే విషయూన్ని ఉన్నతాధికారులు తేల్చాలని డివూండ్ చేశారు. విషయుం తెలుసుకున్న ఎస్ఐ నిత్యబాబు సిబ్బందితో కలసి ధర్నా వద్దకు చేరుకుని ఎలాంటి ఉధ్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా వుుందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం ఎంపీడీవో విద్యారవు, తహశీల్దార్ రవుణి, వ్యవసాయూధికారి గీతాకువూరి ధర్నా వద్దకు చేరుకుని రైతులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్లి న్యాయుం చేస్తావుని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కొందరు ఇంటిదొంగలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. జూలై 28న దాసకుప్పం బ్రాంచ్‌లో మేనేజర్ మనోహరుడు ఖాతాదారులతో నిమిత్తం లేకుండా వారి పేర్లతో రూ.1.30 కోట్లు రుణం తీసుకుని, మింగేశారు. కాగా శనివారం అర్ధరాత్రి వరదయ్యపాళెం బ్రాంచ్‌లో 750 గ్రాముల బంగారం, 13 కిలోల వెండిని దొంగలు లూటీ చేశారు. ఈ ఘటన వెనుక ఇంటి దొంగల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సంఘటనలు బ్యాంకు ప్రతిష్ఠకు మాయనిమచ్చగా మారుతాయని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంత వాసులకు సేవలు అందిస్తోన్న అతి పెద్ద బ్యాంకుల్లో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఒకటి. ఆ బ్యాంకు యాజమాన్యంలో కీలక అధికారి బ్యాంకు కార్యకలాపాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే విమర్శలు సిబ్బంది నుంచే వినిపిస్తుండడం గమనార్హం. బ్యాంకులో తనకు సన్నిహితులైన అధికారులుఎంత పెద్ద తప్పు చేసినా ఆ అధికారి వెనకేసుకొస్తున్నారని ఆ బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు దాసకుప్పం బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలను ఉదహరిస్తున్నారు. రూ.1.30 కోట్లు స్వాహా చేసిన మేనేజర్ సత్యవేడు మండలం దాసకుప్పం బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తోన్న మనోహరుడు ఆ బ్యాంకు యాజమాన్యంలో కీలక అధికారికి అత్యంత సన్నిహితుడు. మేనేజర్ మనోహరుడు దాసకుప్పం బ్రాంచ్‌లో ఖాతాదారులతో నిమిత్తం లేకుండా వారి పేర్లపై రూ.1.30 కోట్లను రుణంగా తీసుకుని మింగేశాడు. ఒక్క స్వయం సహాయక మహిళా సంఘాల పేర్లతోనే రూ.54 లక్షలు మింగేశారు. ఎస్సీ, ఎస్టీ రుణాలు, పంట రుణాల విభాగంలో రూ.70 లక్షలు కాజేశారు. తీసుకోని రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలు దాసకుప్పం బ్రాంచ్ ఎదుట భారీ ఎత్తన ఆందోళన చేయడంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మేనేజర్ మనోహరుడు రూ.1.30 కోట్లను కాజేసినట్లు తేల్చిన అధికారులు సత్యవేడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనోహరుడిపై సస్పెన్షన్ వేటుతో యాజమాన్యం చేతులు దులుపుకుంది. కానీ కేసు దర్యాప్తునకు ఉపయోగపడే సమాచారాన్ని సత్యవేడు పోలీసులకు అందించడంలో యాజమాన్యం సహాయ నిరాకరణ చేస్తోందనే విమర్శలు బ్యాంకు వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. దీనిని అలుసుగా తీసుకున్న ఇంటిదొంగలు వరదయ్యపాళెం బ్యాంకుకు కన్నం వేసేందుకు దారి తీసిఉంటుందనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి 12.05 గంటలకు వరదయ్యపాళెం బ్రాంచ్‌ను దొంగలు లూటీ చేశారు. కిటికీ ఊచలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సహాయంతో రెండు లాకర్లను పగులగొట్టి 750 గ్రాముల బంగారం, 13 కేజీల వెండి దోచుకున్నట్లు పోలీసులు తేల్చారు. శ్రీకాళహస్తి-తడ రహదారి పక్కనే ఉండడం, ఏదో అలికిడి రావడంతో బ్యాంకును లూటీ చేసే యత్నాన్ని విరమించుకుని, దోచుకున్న సొమ్ముతో దొంగలు ఉడాయించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులో పని చేసే సిబ్బంది హస్తం లేకుండా ఈ దోపిడీ జరిగే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేసును అదే కోణంలో దర్యాప్తు చేస్తోండడం గమనార్హం.