Sarvam Thaalamayam
-
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం
షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన సర్వం తాళమయం చిత్రం ప్రదర్శించనున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్, నెడుముడి వేణు, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సర్వం తాళమయం. ప్రముఖ ఛాయాగ్రహకుడు రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 22వ షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు మనోరమ విభాగంలో అధికారికపూర్వకంగా ఎంపికైనట్లు చిత్ర వర్గాలు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. -
గుండె లోతులను తాకే ‘సర్వం తాళమయం’
కమర్షియల్ సినిమా మూసలో అప్పుడప్పుడు మెరిసే కళాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సామాజిక అంశాలను ప్రస్థావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కే సినిమాలను జయాపజయాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరూ అక్కున చేర్చుకుంటారు. ఆ బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగీత ప్రధాన చిత్రమే సర్వం తాళమయం. దాదాపు 18 ఏళ్ల విరామం తరువాత రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, నెడుముడి వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే.. పీటర్ జాన్సన్ (జీవీ ప్రకాష్ కుమార్) సంగీత వాయిద్యాలు తయారు చేసే దళితవర్గానికి చెందిన కుర్రాడు. తమిళ సినీ హీరో విజయ్ అంటే పీటర్‌కు విపరీతమైన అభిమానం. ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే పీటర్ జీవితంలోకి అనుకోకుండా కర్ణాటక సంగీతం ప్రవేశిస్తుంది. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పాలకొల్లు రామశాస్త్రీ దగ్గర సంగీత నేర్చకునేందుకు చేరతాడు. ఎలాగైన గురువు తగ్గ శిష్యుడు అనిపించుకోవాలన్న ప్రయత్నంలో పీటర్‌కు ఎదురైన సమస్యలేంటి..? ఈ ప్రయాణంలో పీటర్లో వచ్చిన మార్పులేంటి..? చివరకు పీటర్ అనుకున్నది సాధించాడా? అన్నదే మిగతా కథ. కథగా చెప్పటానికి ఏమీ లేకపోయినా దర్శకుడు మనసును తాకే భావోద్వేగా సన్నివేశాలను సినిమాను తెరకెక్కించాడు. శాస్త్రీయ సంగీతం యొక్క గొప్పదనాన్ని చెబుతూనే సమాజంలో వేళ్లూనుకుపోయిన అంతరాలను తెర మీద ఆవిష్కరించాడు. సుధీర్ఘ విరామం తరువాత దర్శకత్వం వహించినా.. తన మార్క్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. రొటీన్ స్టైల్లో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా ప్రేక్షకుడిని కథలో లీనం చేయటంలో సక్సెస్ అయ్యాడు. సంగీత విద్వాంసుడు రామశాస్త్రీ పాత్ర పరిచయంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. తొలి భాగం పాత్రల పరిచయం, ఆసక్తికర సన్నివేశాలతో మలచిన దర్శకుడు.. ద్వితీయార్థాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కథాపరంగా మరిన్ని ఎమోషనల్ సీన్స్‌కు అవకాశం ఉన్నా దర్శకుడు సినిమాను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నమే చేశాడు. రాజీవ్ మీనన్ తయారు చేసుకున్న కథలోని పాత్రలకు ప్రతీ ఒక్క నటుడు జీవం పోశారు. సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతూ వస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అల్లరి చిల్లరి కుర్రాడి, తరువాత సంగీత కళాకారుడిగా మారే క్రమంలో ప్రకాష్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. ఇక కీలక పాత్రలో నెడుముడి వేణు నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. హీరోయిన్ అపర్ణ బాలమురళి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో తనవంతు ప్రయత్నం చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒకప్పటి హీరో వినీత్ మంచి నటన కనబరిచాడు. సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరింత హైప్ తీసుకువచ్చింది. తన పాటలు, నేపథ్య సంగీతంతో రెహమాన్ ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుల గుండె లోతుల్లోకి చేరేలా చేశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సినిమాటోగ్రఫి, ప్రతీ సన్నివేశాన్ని సహజంగా తెర మీద చూపించటంలో కెమెరామేన్ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
గొప్ప సంగీతభరిత చిత్రాన్ని చూశా
‘శంకరాభరణం, సాగరసంగమం’ వంటి అద్భుత సంగీతభరిత చిత్రాలను అందించారు కళా తపస్వి కె.విశ్వనాథ్. సంగీతం నేపథ్యంలో రాజీవ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం ‘సర్వం తాళమయం’. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సర్వం తాళమయం’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించారు. పైగా ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కి నా ఆశీర్వాదాలు’’ అన్నారు. రాజీవ్ మీనన్ మాట్లాడుతూ– ‘‘దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, నాగ్ అశ్విన్, మహి వి. రాఘవ్ తదితరులు మా చిత్రాన్ని చూసి అభినందించడం సంతోషంగా ఉంది. ఏఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, నిర్మాత: లత. -
'సర్వం తాళమయం'కు కళాతపస్వి ప్రశంసలు
శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, రాజీవ్ మీనన్ రూపొందించిన ‘సర్వం తాళ మయం’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన చూసిన ఆయన ‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు’ అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ సినిమా మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత లత తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. -
కదిలించేలా ‘సర్వం తాళమయం’ ట్రైలర్
నటుడు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన సంగీత ప్రధాన చిత్రం సర్వం తాళమయం. వాయిద్యాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడు సంగీత విద్వాంసుడు కావాలనుకుంటే అతనికి ఎదురైన కష్టాలు, అవమానాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది లాంటి సూపర్ హిట్ సినిమాలన తెరకెక్కించిన రాజీవ్ మీనన్ 18 ఏళ్ల విరామం తరువాత ఈ సినిమాతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే తమిళ నాట రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో ఈ నెల 8న తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రాయూనిట్. జీవి ప్రకాష్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.