Sathamanam Bhavati
-
శతమానం భారతి:లక్ష్యం 2047.. పీఎస్‌యూలు
చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి స్వాతంత్య్రాన్ని ఇచ్చి వెళ్లింది బ్రిటిష్ ప్రభుత్వం! మరి నాలుగు డబ్బులెలా చేతిలో ఆడటం? పరిశ్రమలే మనకు ప్రాణాధారాలు అన్నారు జవహర్లాల్ నెహ్రూ. పరిశ్రమలు నెలకొల్పాలంటే ప్రభుత్వమే కానీ, ప్రైవేటు వ్యక్తుల వల్ల కాని పరిస్థితి ఆనాటిది. దాంతో ప్రభుత్వమే.. కూడబెట్టుకున్న డబ్బుతో కూడు, గుడ్డ, నీడతో పాటు.. ఆర్థికంగా అండనిచ్చే విధంగా.. ఉపాధి కల్పన, స్వావలంబన సాధించేలా పరిశ్రమల్ని నెలకొల్పింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెట్ వంటి భారీ కంపెనీలను స్థాపించింది. అవి కాస్త పుంజుకోగానే ప్రైవేటు వ్యక్తులూ ధైర్యం చేసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అలా వచ్చిన పరిశ్రమలే ‘పీఎస్‌యు’లు. అంటే.. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీలు. వచ్చే పాతికేళ్లలో పీఎస్‌యులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు ఈ అమృత మహోత్సవాల సందర్భంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. 51 శాతం కన్నా ఎక్కువ ప్రభుత్వ వాటాలు ఉన్న సంస్థలను పీఎస్యూలనీ, 100 శాతం ప్రభుత్వ వాటాలుంటే పీఎస్ఈలనీ అంటారు. నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ ద్రవ్యీకరణ పథం కింద పీఎస్‌యు ఆస్తుల విక్రయం ద్వారా రానున్న ఏళ్లలో 2.5 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకే 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ అధీనంలోని పీఎస్ఈ ఆస్తుల అమ్మకం ద్వారా మరో మూడు లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని కోరింది. -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
ప్రేమమ్ నాగవల్లి
‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. ‘అ..ఆ..’ సినిమా ట్రైలర్లో వినిపించే ఈ డైలాగ్‌తో తెలుగు సినిమా అభిమానుల మనస్సుల్లోకి దూసుకొచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. నిజానికి అంతకన్నా ముందే ఒక మలయాళ సినిమాతో తెలుగు కుర్రకారుకు ఈ భామ పరిచయమైంది. ఆ సినిమాయే ‘ప్రేమమ్’. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే, అదే పాత్రలో మళ్లీ కనిపించి మెప్పించింది అనుపమ. పరిచయమైతే మలయాళ పరిశ్రమలోనే అయినా, ఇప్పుడు ఈ హీరోయిన్ స్టార్‌గా దూసుకెళ్తోంది మాత్రం తెలుగులోనే! ఈ లేటెస్ట్ స్టార్ సెన్సేషన్ గురించి కొన్ని విశేషాలు... తెలుగులోనే స్టార్‌గా... అనుపమ మలయాళ సినిమాతోనే హీరోయిన్ అయినా ప్రస్తుతానికి ఆమె కెరీర్ తెలుగులోనే సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతోంది. ‘అ..ఆ..’ విడుదలైన వెంటనే అనుపమకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘శతమానం భవతి’, ‘ప్రేమమ్’ సినిమాలతో వరుసగా సూపర్‌హిట్స్ వచ్చాయి. దీంతో మిడిల్ బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు స్టార్ అనుపమనే! ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటిస్తోన్న ‘హలో గురూ ప్రేమకోసమేరా!’ దసరా కానుకగా విడుదల కానుంది. కాలేజీకి నో చెప్పి సినిమాల్లోకి! అనుపమ పరమేశ్వరన్ పుట్టి, పెరిగిందంతా కేరళలోనే! మలయాళ భామ. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ కలలు కనేది. ఆ పిచ్చే ఆమెకు ‘ప్రేమమ్’ సినిమాలో అవకాశం తెచ్చిపెట్టింది. కొత్తవాళ్ల కోసం దర్శకుడు ఆల్ఫన్స్ పుత్రన్ వెతుకుతూ ఉంటే అనుపమ ఫొటోషూట్ ఆయన కంట్లో పడింది. వెంటనే ‘ప్రేమమ్’లోని మూడు ప్రేమకథల్లో ఒక కథకు హీరోయిన్గా ఎంపికచేశాడు. అప్పటికి అనుపమ వయసు 18 ఏళ్లు. తన డ్రీమ్ కావడంతో కాలేజీకి కూడా నో చెప్పేసింది. డబ్బింగ్ చెప్పిందంటే... ‘అ..ఆ..’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అనుపమకు తెలుగు రాదు. కానీ ఆ సినిమాలో తన పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అనుపమ స్పెషాలిటీస్‌లో ఆ వాయిస్ కూడా ఒకటి. అందుకే అప్పట్నుంచీ అన్ని సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. అనుపమ వాయిస్‌ను తెలుగు ప్రేక్షకులు, తెలుగులో విన్నది ‘అ..ఆ..’ ట్రైలర్‌లోని ఈ డైలాగ్‌తోనే – ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. లైఫ్‌లో అదే పెద్ద మిరాకిల్! చిన్న వయసులోనే కెరీర్లో పెద్ద సక్సెస్ చూసిన అనుపమ, సినిమాల్లోకి రావడమే తన జీవితంలో జరిగిన పెద్ద మిరాకిల్ అని చెప్తుంది. ఇప్పటికీ ఇదంతా కలలా ఉంటుందని, ఒక్కోసారి ఎలాంటి సినిమాలు ఎంపికచేసుకోవాలో తెలియనప్పుడు దర్శకులు త్రివిక్రమ్, ఆల్ఫన్స్ పుత్రన్లను అడుగుతానని అంటుంది. ఈ దర్శకులే అనుపమను తెలుగు, మలయాళ సినీ పరిశ్రమలకు పరిచయం చేశారు. బ్లాక్‌బస్టర్ డెబ్యూట్ ‘ప్రేమమ్’ విడుదలవ్వడమే పెద్ద బ్లాక్‌బస్టర్. మలయాళ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసిందీ సినిమా. తెలుగు ప్రేక్షకులు సైతం ఆన్లైన్లో వెతుక్కొని మరీ చూసేలా చేసింది. అలా తెలుగులోకి రాకముందే ‘ప్రేమమ్’లో మేరీ పాత్రలో కనిపించిన అనుపమ ఇక్కడ కూడా ఫేమస్. ఆ క్రేజే ఆమెను వెంటనే తెలుగుకు తీసుకొచ్చింది. తెలుగులో ‘అ..ఆ..’లో నాగవల్లి రోల్‌తో డెబ్యూట్ ఇచ్చింది అనుపమ. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అయింది. తమిళంలో ‘కోడి’ అనే సినిమాతో డెబ్యూట్ ఇచ్చింది. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్. -
దిల్ రాజు బ్యానర్లో రాజ్ తరుణ్
శతమానం భవతి సినిమా సమయంలో దిల్ రాజు, రాజ్ తరుణ్ మధ్య విబేధాలొచ్చాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. శతమానం భవతి సినిమాను ముందుగా రాజ్ తరుణ్ హీరోగా చేయాలని భావించాడు దిల్ రాజు. అయితే చివరి నిమిషంలో శర్వానంద్‌తో సినిమా చేశాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో రాజ్ తరుణ్ చేతులారా మంచి హిట్ సినిమాను చేజార్చుకున్నాడని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రాజ్ తరుణ్, దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయబోతున్నాడట. శతమానం భవతి సినిమా సమయంలో అప్పటికే ఏకె ఎంరట్టైన్మెంట్స్తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. అందుకే మరోసారి దిల్ రాజు ఆఫర్ ఇవ్వగానే వెంటనే ఒప్పేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే దిల్ రాజు బ్యానర్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు రాజ్ తరుణ్. -
శతమానం... తెలుగు సినిమాకు గర్వకారణం
‘‘తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వంగా ఉంది. ‘దిల్’రాజు, సతీశ్ వేగేశ్నల కృషితో ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు లభించింది. తెలుగు చిత్రసీమకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, తోటి నిర్మాతను గౌరవించిన అల్లు అరవింద్‌గారిని అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. శర్వానంద్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’కి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరపున చిత్రనిర్మాత, దర్శకుడు, హీరోలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సన్మానించారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ సన్మానం కార్యక్రమం జరిగింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘జీవితంలో గొప్ప ఘనత సాధించిన సమయంలోనే... పెద్ద అండ (భార్య)ను కోల్పోయాను. నా సన్నిహితులైన అరవింద్‌గారికి ఆ బాధ ఎలాంటిదో తెలుసు. జాతీయ పురస్కారం కంటే 15ఏళ్లుగా అరవింద్‌గారి వంటి మంచి వ్యకితో స్నేహాన్ని గొప్పదిగా భావిస్తున్నా’’ అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ – ‘‘మా ఆవిడ ‘శతమానం భవతి’ చూసి, ‘అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు చెయ్యొచ్చు కదా’ అనడిగింది. నేనూ ఇలాంటి మంచి కుటుంబ కథాచిత్రం చేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించాలనే ‘దిల్’ రాజు తపనే అవార్డు రావడానికి కారణమైంది’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘నేషనల్ అవార్డు రావడం నా కెరీర్లో ఫస్ట్‌టైమ్. నా జీవితంలో సంతోషకరమైన క్షణమిది’’ అన్నారు శర్వానంద్. ఈ వేదికపై ‘రుద్రవీణ’కు నర్గిస్‌దత్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ, అది తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన అవార్డుగా భావించానన్నారు చిరంజీవి. అల్లు అర్జున్, నాని, అల్లు శిరీష్ పాల్గొన్నారు. -
పలకరింపే పులకరింపై....
‘రమ్మని నిను పిలవాలా... వీలేదో కుదరాలా... అమ్మనే మరిచే పనులేలా... కమ్మని పండుగ వేళ... నలుగురితో కలిసేలా.... నిన్ను ఇంకెవరో దిద్దాలా...’దీన్ని ఆధారంగా చేసుకుని చక్కని పాట తయారయింది. సినిమా కథ అంతా ఈ వాక్యాలలో వచ్చింది. శతమానం భవతి చిత్రంలోని ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా’ పాటకు మంచి ప్రశంసలు అందుకున్నాను. డైరెక్టరు వేగేశ్న, నేను పాటలలోని భావం గురించి చర్చిస్తుండేవాళ్లం. ఆయనతో కలిసి ‘శతమానం భవతి’ చిత్రానికి పనిచేయమన్నారు. అలా ఆ చిత్రంలో పాట రాసే అవకాశం వచ్చింది. ‘చాలారోజుల తర్వాత మన పల్లెకు వెళుతున్నప్పుడు మనసులోని ఆలోచన, అనుభూతి ఎలా ఉంటాయనేది సందర్భం. మనలోనే కాదు మనం వస్తున్నందుకు మన పల్లె ఎలా అనుభూతి చెందుతుందో కూడా ఈ పాటలో పొందుపరచాలి. పాట వినగానే అందరికీ పల్లెకు వెళ్లాలనే కోరిక కలగాలి’ అని చెప్పారు. విదేశాల్లో ఉన్న పిల్లలు తెల్లవారితే వస్తారనగా, అన్ని సంవత్సరాలుగా నిరీక్షించిన తల్లి, ఆ ఒక్కరాత్రి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని తొందరపడుతుంటుంది. ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా... వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా...’ అంటూ ప్రారంభించాను. చేదతో బావులలో గలగల... చెరువులో బాతుల ఈతల కళ... / చేదుగా ఉన్న వేపను నమిలే వేళ / చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో/ మాటలే కలిపేస్తూ...మనసారా మమతల్ని పండించు అందించు హృదయంలా/ చలిమంటలు ఆరేలా... గుడిగంటలు మోగేలా... సుప్రభాతాలే వినవేలా... / గువ్వలు వచ్చే వేళ... నవ్వులు తెచ్చే వేళ... స్వాగతాలవిగో కనవేలా... పల్లెల్లో తెల్లవారుజామున కనువిందు చేసే మధురానుభూతులు జీవితాంతం నిలిచిపోతాయి. అటువంటి భావాలను పల్లవిలో చూపించాను. చేదల సహాయంతో బావులలో నీళ్లు తోడటం, పక్కనే ఉన్న చెరువులో బాతులన్నీ ఈత కొడుతూ కళకళలాడుతూ కనిపించడం...ఇటువంటి అనుభూతులన్నీ పల్లెల్లో మాత్రమే కనిపిస్తాయి. పక్షులు ఉదయాన్నే గూటి నుంచి బయలుదేరుతాయి. సాయంత్రానికి గూటికి చేరుతాయి. కాని ‘గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ... స్వాగతాలవిగో కనవేలా...’ అంటూ పక్షులు వస్తున్నట్లు రాశాను. ఎక్కడికో ఎగిరిపోయిన గువ్వలు అనే కొడుకులు, కూతుళ్లు చాలా కాలం తరువాత వస్తున్నారు కనుక, గువ్వలు వచ్చేవేళ , అనే ప్రయోగం చేశాను. చాలా కాలం తరువాత వస్తున్న కూతురికి, తను మర్చిపోయిన ప్రదేశాలను గుర్తు చేయాలి. అది సాధారణంగా ఉంటుంది. ఈవిడకు గుర్తు వచ్చింది అని చెప్పడం కంటే, ఆవిడను ఆ గ్రామం తలచుకుంటోంది అనే భావనలో చెప్పాలి అనుకున్నాను. పొలమారే పొలమంతా... ఎన్నాళ్లో నువు తలచి/ కళమారే ఊరంతా ... ఎన్నేళ్లో నువ్వు విడిచి /మొదట అందని దేవుడి గంట... మొదటి బహుమతి పొందిన పాట / తాయిలాలకు తహతహలాడిన పసితనమే గురుతొస్తోందా/ ఇంతకన్నా తీయనైన జ్ఞాపకాలే... దాచగల ఋజువులు ఎన్నో ఈ నిలయాన / నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాలా... నువ్వెదిగిన ఎత్తే కన బడక / నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా... తన్నెవరూ వెతికే వీల్లేక / కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే... సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్లే... అంటూ... ఆమెను తలచుకుంటున్న పొలానికే పొలమారింది అని చమత్కరించాను. బాల్యంలో తాను చూసినవన్నీ మారిపోయాయి. తను ఆడుకున్నవి, ఆప్యాయంగా ఆడి వదిలేసినవన్నీ గుర్తు వస్తాయి. తాను ఊగిన ఊయల తను ఎంత ఎత్తు ఎదిగిందో చూడాలనే ఉద్దేశంతో ఒంటరిగా ఊగుతోందని... చెప్పాను. ఇక తరవాత వచ్చేది మనవరాలు... హీరోయిన్... ఆమెను పరిచయం చేయాలి... అది కూడా హృద్యంగా సాగాలి. పల్లెటూరి అందాలు అనే చిన్న భాషలో మాట్లాడితే ఎవ్వరికైనా అర్థం అవుతుంది. అందం మాట్లాడే భాష అర్థం కాని వారు ఉండరు. మనసుతో చూస్తే అన్నీ మనతో మాట్లాడతాయి. అంటూ... పూల చెట్టుకి ఉందో భాష... అలల మెట్టుకి ఉందో భాష... / అర్థమవ్వని వాళ్లే లేరే అందం మాటాడే భాష/ పలకరింపే పులకరింపై పిలుపునిస్తే / పరవశించడమే మనసుకు తెలిసిన భాష / మమతలు పంచే ఊరు... ఏమిటి దానికి పేరు... పల్లెటూరేగా ఇంకెవరూ / ప్రేమలు పుట్టిన ఊరు... అనురాగానికి పేరు ... కాదనేవారే లేరెవరూ మన అమ్మ సిటీలో ఉండవచ్చు, కాని అమ్మ వండే వంట పల్లెటూరిదే. నాన్న నగరంలో ఉద్యోగం చేస్తుండచ్చు, కాని నాన్న తాలూకు పెంకుటింటి భావాలు పల్లెటూరు నుంచి వచ్చినవే. వాళ్ల ద్వారానే ప్రేమలు, ఆప్యాయతలు, మమతలు వస్తాయి. ఎన్ని తరాలైనా స్వచ్ఛమైన మమతను రుచి చూడాలంటే పల్లెటూరికి వెళ్లి తీరాల్సిందే. – సంభాషణ: డా. వైజయంతి