ఇందిరాగాంధీ బి.హెచ్.ఇ.ఎల్. సందర్శన
చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి స్వాతంత్య్రాన్ని ఇచ్చి వెళ్లింది బ్రిటిష్ ప్రభుత్వం! మరి నాలుగు డబ్బులెలా చేతిలో ఆడటం? పరిశ్రమలే మనకు ప్రాణాధారాలు అన్నారు జవహర్‌లాల్ నెహ్రూ. పరిశ్రమలు నెలకొల్పాలంటే ప్రభుత్వమే కానీ, ప్రైవేటు వ్యక్తుల వల్ల కాని పరిస్థితి ఆనాటిది. దాంతో ప్రభుత్వమే.. కూడబెట్టుకున్న డబ్బుతో కూడు, గుడ్డ, నీడతో పాటు.. ఆర్థికంగా అండనిచ్చే విధంగా.. ఉపాధి కల్పన, స్వావలంబన సాధించేలా పరిశ్రమల్ని నెలకొల్పింది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెట్ వంటి భారీ కంపెనీలను స్థాపించింది. అవి కాస్త పుంజుకోగానే ప్రైవేటు వ్యక్తులూ ధైర్యం చేసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అలా వచ్చిన పరిశ్రమలే ‘పీఎస్‌యు’లు. అంటే.. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీలు. వచ్చే పాతికేళ్లలో పీఎస్‌యులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు ఈ అమృత మహోత్సవాల సందర్భంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. 51 శాతం కన్నా ఎక్కువ ప్రభుత్వ వాటాలు ఉన్న సంస్థలను పీఎస్‌యూలనీ, 100 శాతం ప్రభుత్వ వాటాలుంటే పీఎస్‌ఈలనీ అంటారు. నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ ద్రవ్యీకరణ పథం కింద పీఎస్‌యు ఆస్తుల విక్రయం ద్వారా రానున్న ఏళ్లలో 2.5 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకే 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ అధీనంలోని పీఎస్‌ఈ ఆస్తుల అమ్మకం ద్వారా మరో మూడు లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment