మహబూబాబాద్‌లో నిలిచిన 'శాతవాహన'
వరంగల్ : విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న శాతావాహన ఎక్స్‌ప్రెస్ ఇంజన్లో శుక్రవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. దీనిపై రైల్వే ఉన్నతాధికారులకు స్టేషన్ అధికారుల సమాచారం అందించారు. అయితే సాంకేతిక సిబ్బంది ఇంకా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోలేదు.
సదరు రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్‌ప్రెస్ రైల్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.