sathya sai seva samithi
-
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాయగడ: జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవ సమితి ఉచిత రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించింది. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణమూర్తి మాట్లాడుతూ రాయగడ జిల్లా బ్లడ్‌బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ పి.కేశుబుద్ధి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 62 మంది సత్యసాయి భక్తులు పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. సుమారు 62 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు. ఇంతవరకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా నిత్యన్నదానం, వస్త్రదానం నిర్వహించామని, ఇప్పుడు రక్తదాన శిబిరం నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్.వి.రమణమూర్తితో పాటు సత్యసాయి సేవ సమితి కన్వీనర్ ఎస్.సోమేశ్వరరావు, డి.సత్యనారాయణ, బి.రామ్మోహనరావు, సతీష్, మహేష్, యూత్ సేవ సభ్యులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేదింట్లో పెళ్లికి చేయూత
సారంగాపూర్(జగిత్యాల) : పేదింట్లో పెళ్లికి అన్నీ తామై అండగా నిలబడింది సత్యసాయి సేవాసమితి. సారంగాపూర్ గ్రామంలో జరిగే పెళ్లింటి వారికి కావల్సిన ముఖ్యమైన వస్తువుల నుంచి కా పురం ఏర్పాటు చేసుకోవడానికి నూతన జంటకు అవసరమైన సామగ్రి అందించి పెళ్లి పెద్దగా నిలి చింది. సారంగాపూర్‌కు చెందిన గంగాధరి నర్సయ్య–తేజమ్మ కుమార్తె జమున(మానస) వివాహం గంగాధర్‌తో బుధవారం జరగనుంది. నర్సయ్య–తేజమ్మది నిరుపేద కుటుంబం కావడంతో పెళ్లి ఖర్చులు వారికి ఇబ్బందికరంగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాలకు చెందిన సత్యసాయి సేవా సమితి సభ్యులు గుండ రాజశేఖర్–అర్చన, గుండ వెంకటేశం–సువర్ణ తమ వంతు సహాయంగా మంగళసూత్రం, మెట్టెలు, బట్టలు, పెళ్లి చీర, తాంబూలం, పళ్లెం, గ్లాసులు, బిందె, మంగళహారతి, అవసరమైన ఇతర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు బట్టు రాజేందర్, కొటగిరి మహేందర్, వంగల లక్ష్మీనారయణ, మహంకాళి మహేశ్, అరుణ, శ్రీలత, పద్మజ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సంస్థ జగిత్యాల: మండలంలోని గుట్రాజ్‌పల్లికి చెందిన మల్లేశం–సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రిక రజిని వివాహానికి భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సంస్థ వారు రూ.10 వేలు ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సుదర్శన్, భూమేశ్వర్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఘనంగా సామూహిక వివాహాలు
హిందూపురం అర్బన్ : స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ధర్మశాలలో ఆదివారం పది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా నవ దంపతులకు పట్టు వస్త్రాలు, తాళి బొట్టు, కాలిమెట్టలు సమకూర్చి ఉచితంగా వివాహాలు చేశారు. కార్యక్రమానికి దంపతుల తల్లిదండ్రులు, బంధుగణం, సత్యసాయి సేవాద⌠æరాష్ట్ర కోఆర్డినేటర్ లాలాలజపతిరాయ్, జిల్లా ఇన్చార్జి కిరణ్‌కుమార్, ఎస్కే యూనివర్శిటీ డీన్, జిల్లా అధ్యక్షుడు రామాంజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చలం మాట్లాడుతూ కరుణమూర్తి సత్యసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. అనంతరం నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించి భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు.