satyam computers scam
-
కుంభకోణం బయటపడే ఏడాది ముందే రామలింగరాజును కలిశా : ఆనంద్ మహీంద్రా
ముంబై: సత్యం కంప్యూటర్స్ సంక్షోభం బైటపడటానికి ఏడాది ముందే అందులో తమ ఐటీ సంస్థ టెక్ ఎంను విలీనం చేద్దామనుకున్నట్లు మహీంద్రా గ్రూ ప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఇందుకు సంబంధించి అప్పట్లో సత్యం చైర్మన్ రామలింగరాజుకు ప్రతిపాదన కూడా చేసినట్లు తెలిపారు. కానీ ఆయన నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని మహీంద్రా తెలిపారు. బహుశా కంపెనీ ఖాతాల్లో లొసుగులు ఉండటమే ఇందుకు కారణమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2009 లో సత్యం కంప్యూటర్స్‌ను టెక్ మహీంద్రా టేకోవర్ చేసే క్రమంలో 100 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలపై పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటైనప్పుడు రామలింగ రాజుతో పరిచయం ఏర్పడిందని మ హీంద్రా చెప్పారు. అప్పట్లో టెక్ ఎం, సత్యం వ్యా పారాల మధ్య సారూప్యతలు ఉండేవని తెలిపారు. అందుకే టెక్ ఎంను సత్యంలో విలీనం చేసే ఉద్దేశంతో రాజుకు ఆఫర్ ఇచ్చినట్లు మహీంద్రా పేర్కొన్నారు. 2009లో రూ. 5,000 కోట్ల స్కాము బైటపడిన తర్వాత సత్యంను టెక్ ఎం టేకోవర్ చేసింది. -
‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వీక్షించనున్న టీ. హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్'లోని సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజుపై రూపొందించిన ఎపిసోడ్‌ను తెలంగాణ హైకోర్టు వీక్షించనుంది. 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ డాక్యుమెంటరీని విడుదల చేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ క్రమంలో ఈ సిరీస్‌ను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి అనుమతించాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు రామలింగరాజుకు సంబంధించిన ఎపిసోడ్‌ను తాము మొదట చూస్తానని ఇద్దరు జడ్జీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. (‘అలా చేయొద్దని చట్టంలో ఎక్కడుంది’) నెట్‌ఫ్లిక్స్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌ను ఆన్లైన్ వేదికల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా తీసినట్లు పేర్కొన్నారు. కేవలం 49 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ను చూడటం ద్వారా డాక్యుమెంటరీ విడుదలను నిలిపివేయడం రచయితలు,చిత్రనిర్మాతల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం అవుందని పేర్కొన్నారు. అలాగే ట్రయల్ కోర్టు తమ వాదనలు వినకుండా వెబ్ సిరీస్ విడుదలను నిలిపివేసిందన్నారు. అయితే ఇప్పటికే సత్యం కేసులో రామలింగరాజు దోషిగా తేలడంతో ఆయనకు సంబంధించిన ప్రతి విషయం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తుందన్నారు. కాబట్టి రామలింగరాజు దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ సిరీస్ ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 న హైదరాబాద్‌లోని స్థానిక సివిల్ కోర్టు నెట్‌ఫ్లిక్స్ తన వెబ్ సిరీస్ 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియా' ప్రసారం చేయకుండా తాత్కాలిక మధ్యంతర స్టే జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కు సంబంధించి 7 వేల కోట్ల అకౌంటింగ్ కుంభకోణంలో దోషిగా తేలిన బి రామలింగరాజు ఆ వెబ్ సీరీస్ ఆపాలంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. బాయ్స్ బిలియనీర్స్ సీరిస్ సత్యం కుంభకోణం నేపథ్యంలోనే తనపై తీశారనే అనుమానం ఉందని తనకు ఉన్న గోప్యత హక్కులను ఈ సీరీస్ ఉల్లంఘిస్తుందని రామలింగ రాజు ఆరోపించారు. తనపై ఉన్న కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న కారణంగా తనను నేరస్తుడిగా చూపించే ప్రయత్నంలో భాగంగా వస్తున్న వెబ్ సీరీస్ ఆపాలని కోర్టును కోరారు నెట్‌ఫ్లిక్స్ వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రత్యేక వెబ్ లింక్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్ న్యాయవాది అందించిన పాస్వర్డ్ ద్వారా ఎపిసోడ్ చూడటానికి అంగీకరించారు. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబర్ 25 న జరుగుతుంది. కాగా వివాదాస్పద బాడ్ బాయ్ బిలియనీర్స్ వెబ్ సిరీస్ సత్యం కంప్యూటర్స్ రామలింగరాజుతోపాటు మరో 3 మంది భారతీయ బిలియనీర్ల కథ ఆధారంగా రూపొందించారు. బ్యాంకులను, జనాన్ని మోసగించి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా , సహారా సుబ్రతా రాయ్ పీఎన్ బీ స్కాంలో నిందితులైన నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీలను ఉద్దేశించి తీసినట్లు అర్ధమవుతుంది. -
రామలింగరాజుకు బెయిల్
-
రామలింగరాజుకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : రామలింగరాజుకు ఊరట లభించింది. సత్యం కుంభకోణం కేసులో ఆయనకు న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు మిగతా నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష చొప్పున, మిగతా నిందితులు రూ.50 వేలు పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
'ఆ అధికారం మాకు లేదు..హైకోర్టుకు వెళ్లండి'
హైదరాబాద్: సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సత్యం రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారు పెట్టుకున్న అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్‌ను సమీక్షించే అధికారం తమకు లేదన్న నాంపల్లి కోర్టు.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. -
'సత్యం' శిక్షను సవాలుచేసిన రామలింగరాజు
-
'సత్యం' శిక్షను సవాలుచేసిన రామలింగరాజు
సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలుచేస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో రామలింగరాజు సోమవారం నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టుకు సమర్పించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి గత గురువారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.