satyamurthy
-
బొమ్మల చొక్కా, పూల చీర కార్టూన్లు మరి కనిపించవు..
గత వారం రవీంద్ర భారతిలో నిర్వహించిన చలం గారి సభకు వెళ్ళి వస్తుండగా మా అబ్బాయి మోహన్ నీలోఫర్ కేఫ్ మీదుగా వెడదాం, పని ఉంది అన్నాడు. ఆ నీలోఫర్ రోడ్డు, రెడ్ హిల్స్ తోవ వెంట నాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ హైద్రాబాద్ నగరంలో నా బ్రతుకు ప్రారంభమయ్యింది ఇక్కడే . ఈ ప్రాంతాల్లోనే తొలిసారిగా తెలుగు సాహిత్యంలో మహామహులను చూశాను, కలిశాను, కొన్ని వందల రోజులు, గంటలు, రాత్రింబవళ్ళు వారితో కలిసి ఉన్నాను. అమాయకంగా, బ్రతుకు భాగ్యంగా ఎన్ని మంచి అనుభవాలు జ్ఞాపకాలను ఇక్కడ సంపాదించుకుని మూట గట్టుకున్నానో! ఎపుడు ఆ స్మృతుల దస్తీ విప్పినా గుప్పుమని జాజుల పరిమళమే, మిగల మగ్గిన నేరేడు పళ్ల తీపి వగరు వాసనే. ఇక్కడి హనుమాన్ టెంపుల్ పక్కనే సత్యసాయి డిజైనింగ్ స్టూడియోలో నా తొలి ఉద్యోగం మొదలయ్యింది. సత్యసాయి డిజైనింగ్ స్టూడియో యజమాని ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు. నేను చేరినప్పుడు అక్కడ ఉన్నది నలుగురం. సత్యమూర్తి గారు, వారి అబ్బాయి సాయి భాస్కర్, నేను, అఫీస్ అసిస్టెంట్ రామకృష్ణ. అది పంతొమ్మిది వందల తొంభై ఏడు. ఆయన దగ్గర నేను ఒక నెల మాత్రమే ఉద్యోగం చేశాను. ఈ రోజుకు అది ఇరవై ఆరు సంవత్సరాల కాలంగా గతించి పోయినప్పటికీ, నేను ప్రతి రోజూ సత్యమూర్తి గారిని తలుచుకుంటాను. ఎలా అంటే ఇదిగో ఇక్కడ నా ఎడమ పక్కన తల తిప్పి చూస్తే గోడ వైపుగా పెలికాన్ రంగు ఇంకు సీసాల మీదు గా నేను నిత్యం వాడే క్రొక్విల్ నిబ్ ఒకటి ఉంటుంది. దాని హేండిల్ చూశారూ, అది అల్లాటప్పా, అణాకాని రకమో, ఎక్కడ పడితే అక్కడ దొరికేదో కాదు, ఆర్డర్ చెయ్యగానే పొస్ట్ లో వచ్చిపడే కంపేనీ తయారి రకం ది అసలే కాదు. అదే పనిగా కొలతలు ఇచ్చి మరీ తయారు చూపించిన హేండిల్ అది. ఎబోనైట్ మిశ్రమంతో తయారు చేయించింది. సత్యమూర్తి గారు ఒక పెన్నుల కంపెనీలో ఫలానా రకంగా కావాలి అని కోరి చేపించిన హేండిళ్లు నాలుగో ఐదో ఉన్నాయి. అందులో ఒకటి ఆయన మహా చిత్రకారులు చంద్ర గారికి ఇచ్చారు , ఒకటి నాకు ఇచ్చారు. మిగతావి ఆయన వద్దే ఉన్నాయి. చంద్ర గారికి నేనంటే ఎంత వాత్సల్యం ఉండేది అంటే ఆయన దగ్గరికి వెళ్లిన ప్రతి సారి ఏదోఒక వస్తువు నా చేతిలో పెట్టేవారు. నా జేబులో ఉంచేవారు. సత్యమూర్తి గారు కాదు నాకు మొదట ఆ హేండిల్ ఇచ్చింది. చంద్ర గారే. ఈ తయారి వెనుక కథ కూడా ఆయనే చెప్పారు. చాలా అందంగా ఉంటుంది ఆ నిబ్బు హేండిల్. దాని పై నుండి నా కన్ను తిప్పుకోలేకపోతుంటే దానిని నా చేతిలో పెట్టి ఉంచుకో అని చల్లని వెన్నెల నవ్వు నవ్వారు. అ జరిగిన కొద్ది కాలానికి పత్రికల్లో నా బొమ్మలు చూసి నన్ను తెగ ప్రేమించిన సత్య మూర్తి గారు మరో రెండు హేండిళ్ళు, కొన్ని డిప్పింగ్ నిబ్బులు చేతిలో పెట్టి ఆయనా నవ్వారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను వేస్తున్న ప్రతి బొమ్మ వెనుక నిబ్బులా నిలబడి సత్యమూర్తి గారు గుర్తు ఉండనే ఉంటారు. కథంతా ఇక్కడ మొదలు కాలేదు. అంతకు ముందే, నేను బడిలో , జూనియర్ కాలేజీలో చదువుతున్న రొజుల్లోనే మొదలయ్యింది. బొమ్మలంటే ఇష్టం. బొమ్మలు వేయడం ఎలాగో తెలీదు. అలాంటప్పుడు విశాలాంద్ర వారి పుస్తకాల వ్యానులో పుస్తక్ మహల్ వారి ప్రచురణ, సత్యమూర్తి గారి రచన "హౌ టు డ్రా కార్టూన్స్" పుస్తకంలో ఔత్సాహికులకు స్టెప్ బై స్టెప్ పాఠాలు ఉన్నాయి. సత్యమూర్తి గారి పేరు ఆ పుస్తకం లో చూడ్డం అంతకన్నా కన్నా ముందే నాకు తెలుసుగా. పత్రికల్లో కార్టూన్లు, కాలెండర్ల మీద గోడకెక్కిన బొమ్మలు, పుస్తకాల ముఖచిత్రాలు మాతరానికి పరిచయమే గా. బొమ్మల పరిచయం వేరు, బొమ్మలు ఎలా వెయ్యాలో చెప్పే మాష్టారుగా తెలుసుకోవడం వేరు. ఆయన రచించిన ఆ పుస్తకం ఒళ్ళో ఉంచుకుని నేను బొమ్మల సాధన చేసాను. ఆ పుస్తకం దయ వల్లనే నేను రోటరింగ్ అనే పెన్నును, బౌ పెన్ అనే సాధనాన్ని, నల్లని ఇండియన్ ఇంకు ను, తెల్లని పోస్టర్ వైట్ ని ... ఇట్లా అవసరమైన సాంకేతిక వ్యవహార జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నేల మీద పడుకుని చూస్తే మనిషి ఎట్లా కనపడతాడు? ఫ్యాను రెక్క ఎక్కి చూస్తే మనిషి ఏమని తెలుస్తాడు అనే వివరాలు నేర్చుకున్నాను. నాకు ఊహ తెలిసీ తెలియగానే మారియో మిరండా బొమ్మలు ప్రాణమై కూచున్నాయి. మనుషుల ఆ ఆకారాలు, డ్రాయింగ్ లో ఆ రిచ్ నెస్. పూలు, తీగలు, ఎగబాకిన కొమ్మలు, నిలువుగా నిలబడ్డ చెట్లు, వెనుక భవనాల సముదాయాలు, ఆ గోడకు లతల డిజైన్లు, కిటికీల మీద షోకు వంపులు. బ్రైట్ గా కనపడే ఇంకు రంగులు, గట్టి నిబ్బు పనితనం. అవంటే నాకు బాగా ఆకర్షణ. ఆ రకంగా సత్యమూర్తి గారిని తెలుగు వారి మారియో గా భావిస్తాను నేను. ఆయన రేఖ చాలా తీరుగా ఉంటుంది. కాంపొజిషన్ బాలెన్స్ గా , అక్షరాలు తీర్చి దిద్దినట్లుగా కుదురుతాయి. జస్ట్ చిక్కని నలుపుతో అలా ప్రింట్ అయిన స్టికర్ తీరుగా ఉంటుంది ఆయన చిత్ర రచన. చాలా మట్టమైన పని కనబరుస్తారు ఆయన తన బొమ్మల్లో. మనుషుల వ్యవహారం, ఆ నవ్వు, ఆ భంగిమలు, వారు తొడుక్కున్న చొక్కాలపై, కట్టుకున్న చీరల మీద, కూచున్న సోఫాల మీద పొందికైన పూలు, బొమ్మలు, నిలువు, అడ్డం చారలు, కాళ్లకు తొడుక్కున్న బూట్ల మీద వెలుతురు తళుకు. పిక్చర్ పెర్ఫేక్ట్. మనిషి గా కూడా ఆయన పెర్ఫెక్ట్ గా ఉండే వారు. తిన్నని సఫారీ సూటు, తీర్చి దువ్విన క్రాపింగ్, గట్టి కళ్ళజోడు. నేను ఆయన్ని చూసే సరికి యాభైలు దాటేసారు. యవ్వనపు రోజుల్లో ఆయన అద్భుతమైన అందగాడని, అలా ఆయన నడిచి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవని ఆయన రోజుల ఆర్టిస్ట్ లంతా చెప్పేవారు. ఆయన గురించి చంద్ర గారు చెప్పే ఒక సరదా ముచ్చట వినతగ్గది. చాలా చాలా ఏళ్ల క్రితం అప్పటికీ చంద్ర గారు ఇంకా బొమ్మల్లోకి అడుగు పెట్టని సమయంలో హైద్రాబాద్ లో సెవెన్ స్టార్ సిండికేషన్ వారు తొలిసారిగా బాపు గారి బొమ్మల కొలువు ఏర్పాటు చేసారుట. ఆ రోజుల్లో తెలుగు పత్రికల్లో బొమ్మల పాపులర్ ఫిగర్స్ ఇద్దరే. ఒకరు బాపు, మరొకరు "చదువుల్రావు" అనే కార్టూన్ స్ట్రిప్ వేసే సత్యమూర్తిగారు. ఆ చదువుల్రావు క్యారెక్టర్ సత్యమూర్తి గారి స్వంత బొమ్మేనని నా అనుమానం. ఆ పక్కనే జయశ్రీ అనే పెద్ద కళ్ల చిత్రసుందరి భలే ఉంటుంది . సరే! చంద్రగారు ఎక్జిబిషన్ హాల్ లో అడుగు పెట్టి బొమ్మలన్ని చూసేసి ఈ బొమ్మలేసినాయన ఎక్కడున్నాడా అని వెదుక్కుంటూ వెడితే ఒక చోట అల్లా కోలాహలంట . ఎంచక్కని చుక్కలు బొలెడు మంది ఒక పురుషుణ్ణి చుట్టు ముట్టి ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అని అటో పక్కా ఇటో పక్క తనుకులాడుతున్నారుట. అంతా చేస్తే ఆయన బాపుగారు కాదు, చదువుల్రావుట. సత్యమూర్తి గారి బొమ్మకు, ఆయన హీరో పర్సనాలిటికీ అంత క్రేజ్ ఉండేదిట ఆ రోజుల్లో. బాపు ఎక్కడా అని చూస్తే ఒక చెట్టు కింద నిలబడి వంటరిగా తనమానాన ఒక సిగరెట్ కాల్చుకుంటున్నాట్ట మహానుబావుడు. సత్యమూర్తి గారి స్టూడియో లో నేను కొంత కాలం పని చేసాను కదా. భలే ప్రొఫెషనల్ గా ఉండేది ఆయన సెటప్, బొమ్మలు గీసే పద్దతి, ఆ స్టూడియో. అచ్చం అమెరికన్ చిత్రకారుల మాదిరి డ్రాఫ్టింగ్ టేబుల్, పక్కన బొమ్మల సరంజామా, ఇంకులు, రంగులు. కాసింత దూరంలో అరలు అరలు గా తెరుచుకునే ఒక పెద్ద టేబుల్, అందులో సైజుల వారిగా, మందం వారిగా అద్భుతమైన డ్రాయింగ్ షీట్లు. చమన్ లాల్ కాగితాలు. బొమ్మలని చాలా పద్దతిగా గా వేసే వారు ఆయన , ఒక బొమ్మ మీద రకరకాల పెన్నులు వాడేవారు. చాలా వెడల్పైన ఫ్లాట్ నిబ్స్ తో రేఖలు గీసేవారు. సాలిడ్ బ్లాక్ ఫిల్లింగ్. బొమ్మల కథలు, అడ్వర్టైజ్మెంట్ కార్టూన్లు, పెద్ద పెద్ద కంపెనీల లోగొలు, మోనోగ్రామ్ లు. తీరైన పుస్తకాల కలెక్షన్, ఎన్నో విధాలైన టైపోగ్రాఫ్స్, ఫాంట్ ల పుస్తకాలు, కలర్ స్కీం గైడ్లు. అప్పుడు ఇంకా కంప్యూటర్ ఇంకా రాలేదు. ఈ రోజు మీరు చూసే పాల ప్యాకెట్ దగ్గరి నుండి, అగ్గిపెట్టె దగ్గరి నుండి, తలకాయ నొప్పి మందు, తిన్నది సరిగా జీర్ణంకావడానికి సిరప్... అవీ ఇవని కాదు వ్యాపార ప్రపంచంలోని సమస్త వస్తోత్పత్తికి సంబంధించిన బొమ్మలు, ఎంబ్లంలు, అక్షరాలు స్వయంగా, తీరొక్క రీతిగా అన్నీ చేత్తోనే వ్రాసేవారు, చిత్రించేవారు అప్పటి చిత్రకారులు . ఇప్పుడు ఆ రోజులు, అటువంటి పనిమంతులు కరువై పోయారు. ప్రతీదీ కాపీ పేస్ట్. స్వంత బుర్ర పెట్టి ఏదీ రావడం లేదు. అన్నీ కంప్యూటరే, అన్నీ ప్రింట్ కాగితాలే, అంతా ప్లాస్టిక్ ప్రచారమే, అన్నీ కాపీ ఈజ్ రైటే. అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన రూపూ, రంగూ, రేఖ మీద, ఆ జీవితం మీద ఒక పుస్తకం తెలుగు సాహిత్యానికి , జీవితానికి మనం బాకీ ఉన్నాము. నిజానికి దానిని మనకు అందించి ఉండవలసినది సత్యమూర్తి గారు. తెలుగు పొస్టర్ డిజైన్ కు సంబంధించి చాలా విషయజ్ఞానం ఉన్న మరో వ్యక్తి శ్రీ గీతా సుబ్బారావు గారు. ఆయన ఎలా ఉన్నారో! ఏం చేస్తున్నారో తెలీదు. ముందు మనం ఏదయినా పుచ్చుకొవాలనే తపన ఉంటే కదా ఇచ్చేవారికి ఇవ్వాలి అనిపించేది. గీతాసుబ్బారావు గారి అన్నగారు శ్రీ వీరాజీ గారూ ఆయన ఒక తరం తెలుగు పత్రికా జీవితాన్ని తన ఆత్మకథ గా అద్భుతంగా చెప్పుకున్నారు. అది ఏవయిందో తెలీదు. అవన్నీ పుస్తకాలు గా రావలసినది. ఏదీ రాదు. ప్రెస్ అకాడమిలు ఎందుకు ఉన్నవో నాకైతే నిజంగా తెలీదు. నేను ఆయన వద్ద ఉద్యోగం చేసింది నెల మాత్రమే . చిన్న ఊరినుండి వచ్చిన వాడిని .ఏమీ తెలీదు. స్కేలు పట్టుకోవడం, సెట్ స్క్వయర్ ఉపయోగించడం, ప్రెంచ్ కర్వ్స్ వాడి లోగో డిజైన్ లు చేయడం, అక్షరాలూ వ్రాయడం, తొంబై డిగ్రీల్లో టెక్నీకల్ పెన్ను వాడటం అన్ని ఆయన దగ్గరే తొలిసారి చూసాను, తెలుసుకున్నాను. ఆయన నా గురువు. చాలా కాలం విరామం తరువాత ఒకసారి ఆయన్ని ఒక కార్టూన్ షోలో చూశాను. నన్ను చూసి ఎంతో సంతోషించారు. ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెలితే గుప్పెట నిండా గుప్పెడు నిబ్బులు పెట్టారు. ఒక మంచి డ్రాఫ్టింగ్ టేబులు వాళ్ల అబ్బాయి తో ఇప్పించారు. ఇపుడు ఏది తలుచుకున్నా గతం. ఒకానొక కాలంలో ,ఒకే కాలంలో బాపు, జయదేవ్, సత్యమూర్తి, బాలి, చంద్ర, గోపి, మోహన్, రాజు, బాబూ, కరుణాకర్... గార్ల వంటి అత్యంత అరుదైన చిత్రకారులు ఇక్కడ ఉండేవారు, మాతో మాట్లాడేవారు, అభిమానించేవారు, తప్పులు దిద్దేవారు ఒప్పులుగా మిగలడానికి తమదైన ప్రయత్నం చేసేవారు అని అనుకోవడం తప్పా మరేం మిగల్లేదు. ఇప్పుడు గురువులు ఎవరూ లేరు. శిష్యులుగా మిగలడానికి ఎవరికీ రానిదీ, తెలియనిదీ ఈరోజుల్లో ఏదీ లేదు. తెలుగులో బొమ్మలకు, కార్టూన్ కళకు, మనకు ఒకప్పుడు ఉండిన ఒక కళకు, నల్లని సిరాకు, పదునైన పాళికి చివరి రోజులివి. సత్యమూర్తిగారికి కూడా శ్రద్దాంజలి (ప్రముఖ కార్టూనిస్ట్, ఒక తరం గురువు సత్యమూర్తి గారు 83 ఏళ్ళ వయసులో 25-05-23 న మననుండి దూరమయ్యారు, తెలుగు కార్టూన్ లో చివరగా మిగిలిన బొమ్మల చొక్కాలు, పూల చీరలు, నిలువు చారల, అడ్డ గీతల ఫర్నీచర్ కూడా మాయమయ్యింది. అన్వర్ అర్టిస్ట్, సాక్షి -
48 గంటల్లో నా భార్య ఆచూకీ కనుక్కోండి!
తాండూరు: తన భార్య కనిపించకుండా పోయి నాలుగు నెలలు కావస్తున్నా పోలీసులు ఆమె ఆచూకీని కనుక్కోవడం లేదని, 48 గంటల్లో కేసును ఛేదించకపోతే ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి ఓ వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారస్తుడు దొరిశెట్టి సత్యమూర్తి ప్రస్తుతం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ మార్చి 6వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయారు. దీనిపై సత్యమూర్తి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకు న్నారు. అయితే పోలీసులు కేసు గురించి పట్టించు కోవడం లేదని సత్యమూర్తి ఆరోపించారు. శుక్రవా రం రాత్రి తన ఇద్దరు కూతుళ్లతో కలసి సెల్ఫీ వీడి యో తీశారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కను క్కోవాలని, లేదంటే పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని డెడ్‌లైన్ విధించారు. శుక్రవారం రాత్రి 2 గంటల నుంచి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకు ని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, సత్యమూర్తి ఎక్కడున్నా రావాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ కోరారు. సత్యమూర్తి సెల్ఫీ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో శనివారం ఆయన మీడి యా సమావేశం నిర్వహించారు. అన్నపూర్ణ మిస్సిం గ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
ఆధ్యాత్మిక కేంద్రం కాదు పరివర్తన క్షేత్రం
సాక్షి, హైదరాబాద్: ‘మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు.. చూస్తే అన్నీ వేర్వేరు. కానీ కలిసి సాగితేనే సుఖ జీవనం. మంచి జీవితం కావాలంటే సహజీవనం అవసరం. అదే సమతాభావం.. రామానుజుల తత్వం. కానీ ఇప్పుడు సమాజంలో ఎన్నో వికార పోకడలు. నేనే గొప్ప, నేనే నిలవాలన్న స్వార్థ చింతనలు పెరిగిపోయాయి. ఈ తీరు మారాలి. మన ఇల్లు, ఊరు, సమాజం, దేశం, ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలి. అందుకు రామానుజులు చూపిన సమతా మార్గంలో మనం సాగాలి. ఆ దిశగా మేం వేస్తున్న తొలి అడుగు ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’’.. ఇది త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పిన మాట.శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ రూపొందించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి ‘సాక్షి’తో మాట్లాడారు. సామాజికంగా సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా.. విద్యా విధానం లో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉంది. విద్యార్థిగా చిన్నప్పుడు పడ్డ బీజాలే వారి భవిష్యత్ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మనం వాడుకలో నైతికతకు రాముడిని, జీవన విధానానికి భగవద్గీతను మార్గంగా చూపుతాం. కానీ పాఠ్యాంశాల్లోకి వచ్చేసరికి 2,500 ఏళ్లకు ముందు మనకు నాగరికతే లేదని, అప్పుడే శిలాయుగం మొదలైందని అంటున్నాం. ఇలాంటి చదువు చదివినప్పుడు రాముడు, భగవద్గీత, జీవన విధానం, నైతికతలకు ప్రాధాన్యం ఎక్కడుంది? ఈ రెండింటికీ పొంతనేది? దేశీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన పూర్వీకుల వైజ్ఞానిక చైతన్యానికి విద్యావిధానంలో చోటు దక్కాలి. ఇప్పటివరకు మన దేశంలో దేవతామూర్తుల భారీ విగ్రహాలున్నాయేగానీ.. ఆది శంకరాచార్యులు, రామానుజులు వంటి గురువుల భారీ మూర్తులు లేవు. ఈ క్రమంలో మహామూర్తిగా శ్రీరామానుజాచార్యుల విగ్రహం రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. తాము దీనిని రికార్డు కోసం చేయడం లేదని, దీని వెనుక గొప్ప పరమార్థం దాగి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వివరించారు. ప్రకృతిలో మనుషులతోపాటు అన్ని జీవులూ సమానమేనన్న రామానుజుల స్ఫూర్తిని అందరం అనుసరించాలని.. ఆ దిశగానే ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’ను ఏర్పాటు చేస్తున్నామని ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రామానుజుల ఆలోచనా విధానం 16 శతాబ్దం చివరివరకు కొనసాగింది. ఆంగ్లేయులు వచ్చాక ధ్వంసమైంది. వారు మనుషుల మధ్య అంతరాల మంటలు పెట్టి చలికాచుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆంగ్లేయుల రీతి కొంత సజీవంగా ఉంది. గణతంత్ర భారతంలో రాజ్యాంగం ప్రసాదించిన సమతాస్ఫూర్తిని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం. ఎక్కువ మంది రాజకీయ నేతల్లోని నిగూఢమైన స్వార్ధ ప్రవృత్తే దీనికి కారణం. అందుకే.. ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం వస్తే.. ఇంకా తెల్లవారలేదు, ఆ చీకట్లు పోలేదు అంటుంటారు. కొత్త విద్యా విధానం రావాలి ఏడెనిమిది శతాబ్ధాలకు పూర్వందాకా అంతరిక్షంలోకి మనిషి వెళ్లనేలేదు. అలాంటిది కొన్ని వేలఏళ్ల కిందటే కచ్చితమైన ఖగోళ రహస్యాలను వరాహమిహిరుడు గ్రంధస్థం చేశారు. ఇలాంటి మన పూర్వీకుల వైజ్ఞానిక అద్భుతాలకు విద్యా విధానంలో చోటుదక్కనప్పుడు.. మన సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమే ఉండదు. వైద్యరంగంలో మన పూర్వీకులు అద్భుతాలు చేశారు. కానీ తర్వాతికాలంలో మన సంప్రదాయ వైద్యం, నాటి వైజ్ఞానిక అద్భుతాలను వ్యూహాత్మకంగా అణచివేశారు. ఇప్పటికైనా నాటి వివరాలు, రహస్యాలు, ఆధారాలు అన్నీ మన పాఠాల్లోకి రావాలి. ఇందుకు కొత్త జాతీయ విద్యా విధానం రావాలి. దీనిపై కొంత ప్రయత్నం జరుగుతోంది. ఆజాదీకా అమృతోత్సవాలను ఘనంగా చేసుకోగలుతున్నాం. రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు చేసుకోబోతున్నాం.. ఇవన్నీ కొంత శుభసూచకాలుగా మాకు కనిపిస్తున్నాయి. యువతలో మార్పు రావాలి ఆశిష్టః దృఢిష్టః బలిష్టః యువాస్యాత్ సాధు యువాధ్యాయకః అని వేదం స్పష్టంగా చెప్తోంది. యువత మంచి తిండి తినాలి, తిన్నది హరాయించుకోవాలి, దాన్ని శక్తిగా మార్చుకోవాలి, ఆ శక్తితో సమాజానికి సేవ అందించాలి. లేకపోతే యువత సమాజానికి దండుగగా మారుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడదే జరుగుతోంది. యువత రకరకాల వ్యసనాలు, విలాసాలకు లోనవడాన్ని ప్రగతికి చిహ్నంగా భావిస్తోంది. చాలా మంది దారి తప్పి సమాజాన్ని కుంగదీస్తున్నారు. ఇది మారాలి. యువత సమాజానికి ఉపయోగపడే శక్తిగా తయారు కావాలి. కండల లక్ష్యం బలహీనుడిని ఆదుకోవడం, ధన సంపాదన లక్ష్యం ధనహీనుడి ఉద్ధరణ, విద్యాధికుడి లక్ష్యం మార్కులు, ఉద్యోగం కాదు.. విద్యా రహితుడిని విద్యావంతుడిగా మార్చటం.. ఇది రామానుజుల స్పూర్తి. ఇలా ఉన్నప్పుడు సమాజంలో దమము (నియంత్రణ) ఉంటుంది. లేకుంటే తిరగబడి మదము అవుతుంది. మనం సమాజంలో ఓ భాగంగా సమాజ సమగ్ర వికాసానికి ఉపయోగపడాలన్న ఆలోచన అందరిలో ఉండాలనేది రామానుజుల సందేశం. దీన్నే ఆయన వేదాంత పరిభాషలో శరీర శరీరి భావ సంబంధంగా పేర్కొన్నారు. రామానుజుల ఆలోచన సంపత్తిలో ఇదే కీలకం. ఆయన అడుగే ఓ విప్లవం కొందరిపై అంటరానివారిగా ముద్ర వేసి, సమాజానికి దూరంగా పెట్టిన భయంకర పరిస్థితులున్న సమయంలో రామానుజులు ఈనేలపై నడయాడారు. అంటరాని వారిని చేరదీస్తే తల తీసేసే పరిస్థితులను ఎదుర్కొని.. వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పంచ సంస్కారాలు చేశారు. మంత్రదీక్షలు ఇచ్చి, వైష్ణవులుగా మార్చారు.తిరుక్కులతార్గా వారికి గౌరవప్రదమైన కులానికి చెందినవారన్న పేరు పెట్టారు. ఇది గొప్ప సామాజిక మార్పు దిశలో రామానుజులు వేసిన విప్లవాత్మక అడుగు. పండితలోకాన్ని, పాలకులను, ప్రజలను ఒప్పించి ముందుకు సాగిన మహనీయుడు రామానుజులు. ఇప్పుడూ కులాల మధ్య భారీ అగాధం ఉంది. మళ్లీ రామానుజులు రావాల్సిందే.. సర్వప్రాణులూ దైవ స్వరూపమే.. ప్రకృతిలో మనిషే కాదు.. చెట్లు, జంతువులు, సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి. అవి లేకుండా మనిషి ఉండలేడు, కానీ మనిషి లేకుండా అవి ఉండగలవు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మనిషి ఇంటికే పరిమితమైతే.. ప్రకృతి పరవశించిన విషయాన్ని కళ్లారా చూశాం. అందుకే మనం పదిలంగా ఉండాలంటే వాటిని కాపాడాల్సిందే. ఇందుకు ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. వాటి మానాన వాటిని బతకనీయడమే. అందుకే రామానుజుల అనుసరణ ఏంటంటే.. ‘మాధవ సేవగా సర్వప్రాణి సేవ’. మహనీయుల చరిత్రతో డిజిటల్ లైబ్రరీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. సమతా భావం కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడిన మహనీయుల చరిత్రను అందులో నిక్షిప్తం చేస్తున్నాం. అబ్రహం లింకన్, మండేలా, మలాలా.. ఇలాంటి 116 మందిని గుర్తించి వారి వివరాలను నిక్షిప్తం చేశాం. రామానుజుల ప్రబోధాలను జనంలోకి తీసుకెళ్లి మార్పునకు అవకాశం కల్పించడం, దేశ పురోగతికి బాటలు వేసేలా చేయాలన్నది నా కల. ఈ కేంద్రంతో కొంత నెరవేరినట్లవుతోంది. దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా దారితప్పిన మనిషి పరివర్తనకు బాట వేసే కేంద్రంగా పరిగణించాలి. ఆధునిక పద్ధతిలో యువతకు.. సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సాధారణ గుడిగా, ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి దర్శనం చేసుకుని వెళ్తే ఉపయోగం ఉండదు. రామానుజుల ఆలోచనలు, సమాజానికి అందించిన సేవలు, మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటో ప్రజలు గ్రహించగలగాలి. ఆ దిశగానే అగుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. రామానుజుల సందేశం వ్యవస్థలోకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వైష్ణవంలో దివ్య దేశాలుగా పేర్కొనే 108 దేవాలయాల నమూనాలను స్ఫూర్తి కేంద్రంలో నిర్మించాం. వాటిని దేవాలయాలుగా భావించి కాదు, రామానుజులను ప్రభావితం చేసిన ప్రాంతాల నేపథ్యంగా ఏర్పాటు చేశాం. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంగా దీనికి నామకరణం చేశాం. అంతా ప్రకృతి బిడ్డలమన్న భావన రావాలి రోమ్రోమ్మే రామ్ హై అంటాడు భక్తుడు. ఇందుగలడు అందులేడన్న సందేహం లేదంటాడు ప్రహ్లాదుడు. పశుపక్ష్యాదులు, మనిషి అంతా ప్రకృతి సంతానమే. అలాంటప్పుడు ఈ భేదాలు, ఆధిపత్య ధోరణులు ఎందుకు? అందుకే అనేకముల్లో ఒకటిగా ఉండాలని రామానుజులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. కులాలు, వర్గాలు, మతాలు, రంగులు, లింగభేదంతో విడిపోద్దని సూచించారు. దానికి తన అనుభవాన్నీ జోడించారు. ‘పదడుగుల ఎత్తు పునాదితో ఇల్లు కట్టి నన్ను ఆహ్వానించారు. అంతెత్తు పునాది ఎందుకని అడిగాను. పక్కనే ఉన్న నది పొంగి చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయినా.. నా ఇల్లు నిలిచి ఉండాలన్న ఉద్దేశంతో ఇలా కట్టానని అతను చెప్పాడు. ఊరంతా కొట్టుకుపోతే ఒక్కడివీ మిగిలి ఏం చేద్దామని? అందరితో కలిసి సాగు, చేతనైతే అందరినీ నిలిపి నువ్వూ నిలువ’ని చెప్పారు. పర సహనం కోల్పోవడం అశాంతికి మూలం ఒకే భాష మాట్లాడేవారు, ఒకే దేవుడిని పూజించేవారు కూడా వైషమ్యాలతో మారణహోమం సృష్టించుకుంటున్నారు. పరసహనం కోల్పోతున్నారు. ఆధిపత్య ధోరణి విశృంఖలమవుతోంది. నేను అగ్రాసనంలో ఉండాలన్న స్వార్ధంతో ఇతరులను అణచివేయటం పరిపాటిగా మారింది. వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, సమాజాల మధ్య, దేశాల మధ్య ఇదే తీరు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అణ్వాయుధాలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నకోవిడ్ కూడా ఇదే కోవలో వెలువడ్డ జీవాయుధం. ఇలాంటి ధోరణి మారాలన్నదే వెయ్యేళ్ల కింద రామానుజులు చేసిన ప్రయత్నం. -
11న బాధ్యతలు స్వీకరించనున్న సోము వీర్రాజు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర గల ది వెన్యూ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగనుందని విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి తెలిపారు. మంగళవారం జరుగనున్న ఈ పదవీ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అఖిల భారత సంఘటన్ సహ కార్యదర్శి సతీష్ జీ పాల్గొంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జి సునీల్ దియోడర్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, పాకలపాటి సన్యాసిరాజు, అడ్డూరి శ్రీరామ్, పాలూరి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమ ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించారు. -
తండ్రికి దేవిశ్రీ మ్యూజికల్ విషెస్..
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన డీఎస్పీ.. ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నామని పేర్కొన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి అని చెప్పుకోవడం ఎప్పుడు గర్వంగా ఉంటుందన్నారు. ఆయన బర్త్ డే రోజును మ్యూజికల్‌గా జరుపుకుందామని చెప్పిన దేవి.. అభిమానుల కోసం తన షోలకు సంబంధించిన కొన్ని ప్రదర్శనలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్పారు. తొలుత యూఎస్ఏలో ఓ షో కోసం శ్రద్దా దాస్‌తో కలిసి రాఖీ రాఖీ సాంగ్ రిహార్సల్ చేస్తున్న వీడియోను దేవి శ్రీ పోస్ట్ చేశారు. రిహార్సల్‌కు, ఫైనల్ షోకు మధ్య నాకు తేడా తెలియదని అన్నారు. నాకు తెలిసిందల్లా.. ప్రేమతో పర్ఫామెన్స్ అందించడమేనని పేర్కొన్నారు. అది తనకు నెర్పించిన తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపిన దేవి.. మ్యూజికల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. కాగా, దేవికి తన తండ్రి సత్యమూర్తిపై ఎంత ప్రేమ ఉందో అందరికి తెలిసిందే. పలు వేడుకలపై దేవి తన తండ్రిపై ఇష్టాన్ని వ్యక్తపరిచారు కూడా. అనారోగ్య కారణాలతో సత్యమూర్తి కొన్నేళ్ల కిందట మృతిచెందారు. ‘ఏ కష్టం ఎదురొచ్చినా...’ అంటూ సాగే పాటను రచించిన దేవి.. తన తండ్రిపై ప్రేమను అందులో వ్యక్తపరిచారు. ఈ సాంగ్‌ను దేవి తన సోదరుడు సాగర్‌తో కలిసి పాడారు. So here is d 1st of #DSPSingleShotVideos #RAKHI wit @shraddhadas43 I never know d difference between REHEARSAL & FINAL SHOW All I know is d LOVE to PERFORM❤️ Thanks to my Father 4 teaching me that🙏🏻 HAPPY MUSICAL BDAY dearest DADDY#SatyaMurty garu❤️https://t.co/yYTyQgrbTo — DEVI SRI PRASAD (@ThisIsDSP) May 24, 2020 -
'ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం బాధాకరం'
సినీ రచయితలు సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి ఒకే రోజు మరణించడం బాధాకరమని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విచారం వ్యక్తం చేశారు. సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత గొర్తి సత్యమూర్తి (61) చెన్నైలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మరో రచయిత శ్రీనివాస చక్రవర్తి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.