savitri river
-
సావిత్రి నదిలో 22 మృతదేహలు లభ్యం
-
మరో మూడు మృతదేహాల గుర్తింపు
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ వద్ద సావిత్రి నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయిన ఘటనలో గాలింపుబృందాలు శుక్రవారం మరో మూడు మృతదేహాలను వెలికితీశాయి. దీంతో ఇంతవరకు లభించిన మృతదేహాల సంఖ్య 17కు చేరింది. బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెన వరద ధాటికి కొట్టుకు పోవడంతో రెండు ఆర్టీసీ బస్సులతో పాటు అనేక ప్రైవేటు వాహనాలు నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పంపించినట్లు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ పాటిల్ తెలిపారు. 20 బోట్లు, 160 మంది కోస్టుగార్డ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపడుతున్నాయని పాటిల్ చెప్పారు. గాలింపు చర్యల్లో నది భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక మత్స్యకారుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నామన్నారు. ఘటనా స్థలానికి 120 కిలోమీటర్ల దూరంలో కొన్ని మృతదేహాలు లభ్యమైనట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. -
మహారాష్ట్రలో 14 మృతదేహాలు వెలికితీత
ముంబై : మహద్ వద్ద ముంబై - గోవా జాతీయ రహదారిపై వంతెన కూలడంతో.... బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికితీసినట్లు ఉన్నతాధికారులు శుక్రవారం మంబైలో వెల్లడించారు. గల్లంతైన మరో 42 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో సావిత్రి నది పొంగి ప్రవహిస్తుంది. గత శుక్రవారం ముంబై - గోవా జాతీయ రహదారిపై ఉన్న బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కుప్పకూలింది. ఈ సమయంలో బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న రెండు బస్సు నదిలో కొట్టుకుపోయాయి.దీంతో బస్సులోని ప్రయాణికులు గల్లంతయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి... సహాయక చర్యలు చేపట్టింది. -
ప్రమాద స్థలికి 100 కి.మీ దూరంలో మృతదేహం
ముంబై: ముంబై-గోవా హైవేలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు డ్రైవర్ మృతదేహం గుర్తించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో వంతెన కూలిపోవటంతో నాలుగు బస్సులు, రెండు కార్లు గ్లల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వాహనాలను గుర్తించేందుకు 300 కేజీల మాగ్నెట్ సహాయంతో గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో నేవీ గజ ఈతగాళ్లు పాల్గోంటున్నారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. రాత్రి వేళలో వంతెన కొట్టుకుపోవడంతో హైవేపై వెళ్తున్న వారు ఎంత మంది నదిలో పడిపోయారనే విషయం స్పష్టంగా తెలియటం లేదు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. కూలిన బ్రిడ్జి 1928లో నిర్మించింది.