మహారాష్ట్రలో 14 మృతదేహాలు వెలికితీత | 14 bodies recovered so far in maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో 14 మృతదేహాలు వెలికితీత

Published Fri, Aug 5 2016 11:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

14 bodies recovered so far in maharashtra

ముంబై : మహద్ వద్ద ముంబై - గోవా జాతీయ రహదారిపై వంతెన కూలడంతో.... బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికితీసినట్లు ఉన్నతాధికారులు శుక్రవారం మంబైలో వెల్లడించారు. గల్లంతైన మరో 42 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో సావిత్రి నది పొంగి ప్రవహిస్తుంది. గత శుక్రవారం ముంబై - గోవా జాతీయ రహదారిపై ఉన్న బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కుప్పకూలింది. ఈ సమయంలో బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న రెండు బస్సు నదిలో కొట్టుకుపోయాయి.దీంతో బస్సులోని ప్రయాణికులు గల్లంతయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి... సహాయక చర్యలు చేపట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement