కోవిడ్‌పై సీసీఎంబీ–ఎస్బీఐ పరిశోధన
సాక్షి, హైదరాబాద్: ‘ఎస్బీఐ ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్’ను భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ భాగస్వామ్యంతో పనిచేయనున్న సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరికి రూ.9.94 కోట్ల విలువైన చెక్కును అందజేశారు.
మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ భారత్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలను మరింత ధృఢం చేసుకునే దిశలో ఎస్బీఐ సెంటర్ ఫర్ ఎక్స్‌లెక్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్ ఏర్పాటుకు సీఎస్ఐఆర్–సీసీఎంబీతో భాగస్వామ్యం కావడం తమ సంస్థకు ఎంతో గర్వకారణమని చెప్పారు. కోవిడ్‌ను అర్థం చేసుకునేందుకు అవసరమైన అమూల్యమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో భాగంగా ఎస్బీఐ ఫౌండేషన్ ఏర్పడిందని దినేష్ ఖారా తెలిపారు. కార్యక్రమంలో ముంబై డీఎండీ, సీడీవో ఓపీ మిశ్రా, హైదరాబాద్ డీఎండీ, ఐఏడీ ఆర్.విశ్వనాథన్, ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ మంజులా కల్యాణసుందరం, ఫౌండేషన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.