సీఎస్‌ఆర్ కోసం ఎస్‌బీఐ ఫౌండేషన్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిర్వహణ కోసం ముంబై కేంద్రంగా ‘ఎస్‌బీఐ ఫౌండేషన్’ను ఏర్పాటు చేసింది. ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు జూలై నుంచి ప్రారంభంకానున్నాయి. కంపెనీ లాభాల్లో 2 శాతాన్ని విధిగా సీఎస్‌ఆర్‌పై వెచ్చించాలని ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడానికి ముందు నుంచే తాము తమ సంస్థ లాభాల్లో ఒక శాతాన్ని సీఎస్‌ఆర్ మీద ఖర్చు చేస్తున్నామని ఎస్‌బీఐ సీఎస్‌ఆర్ జనరల్ మేనేజర్ వినోద్ పాండే అన్నారు.
గత ఆర్థిక సంవత్సరం రూ.115 కోట్లను సీఎస్‌ఆర్‌పై వెచ్చించిందని తెలిపారు. ఈ ఫౌండేషన్‌కు ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చైర్మన్‌గా, మేనేజింగ్ డెరైక్టర్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించనున్నారు.