పట్టణాల్లో చెత్త వేస్తే జరిమానా!: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: పట్టణాల్లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వే స్తే జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. స్వచ్ఛ్ భారత్‌లో ప్రజల భాగస్వామ్యంపై ‘స్కేలింగ్ అప్ సిటిజెన్స్’ పేరిట జరిగిన వర్క్‌షాప్‌ను మంగళవారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. మిషన్‌లో దేశ ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసే పద్ధతులపై వర్క్‌షాప్‌లో చర్చిస్తామని చెప్పారు దేశ భద్రత విషయంలో అన్ని పార్టీలూ ఒకే గొంతుకగా వ్యవహరించాలని, కానీ కాంగ్రెస్ అలా వ్యవహరించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని, పాక్ ఆక్రమిత కశ్మీర్, బెలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతోందో ప్రపంచానికి తెలియాలన్నారు.