వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు కారణంగా రద్దు కానున్న రైళ్ల వివరాలకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. వివిధ మార్గాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు ముందస్తు సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2016 జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు రద్దు కానున్న రైళ్ల వివరాలను సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు సికింద్రాబాద్-పట్నా(12791/12792) ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి జనవరి 10, 14, 17, 21, 24, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 28 తేదీల్లో రద్దవుతుంది.
పట్నా నుంచి జనవరి 9, 12, 16, 19, 23, 26, 30, ఫిబ్రవరి 2, 6, 9, 13, 16, 20, 23, 27 తేదీల్లో రద్దు కానుంది.
హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ (12723/12724) హైదరాబాద్ నుంచి జనవరి 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో, ఢిల్లీ నుంచి జనవరి 14, 21, 28 తేదీల్లో, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రద్దు కానుంది.
హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్(12721/12722) ఎక్స్ప్రెస్ జనవరి 11, 18, 25, ఫిబ్రవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో జనవరి 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో రద్దు కానుంది.
విశాఖపట్నం-కాజీపేట్ (12861/12862) ఎక్స్ప్రెస్ జనవరి 11, 18, 25 ఫిబ్రవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో జనవరి 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో రద్దు కానుంది.
పలు రైళ్లకు అదనపు హాల్టింగ్
సికింద్రాబాద్-డానాపూర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్కు ఈ నెల 10వ తేదీ నుంచి బిహార్లోని ఆరా రైల్వేస్టేషన్లో 2 నిమిషాలపాటు హాల్టింగ్ కల్పించనున్నారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు సాయంత్రం 5.32 గంటలకు, తిరిగి వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12.57 గంటలకు ఆరా స్టేషన్లో ఆగనుంది.