'భారత్‌లో పెట్టుబడులే మాకు ఆసక్తి'
న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నామని ఆస్ట్రియా విదేశాంగమంత్రి సెబాస్టియన్ క్రూజ్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , ఆస్ట్రియా విదేశాంగ మంత్రి సెబాస్టియన్ క్రూజ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశం ద్వారా యూరప్‌తో తమ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ ముందడుగు వేయనుందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ, విద్యుత్, సహజవాయువుశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతో కూడా క్రూజ్ సమావేశం కానున్నారు. అనంతరం గురువారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను, ప్లాన్సీ ఇండియా మెటీరియల్ సంస్థ(మైసూర్)ను సందర్శించనున్నారు. ఈ సంవత్సరం జరగబోయే యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇండియా సమావేశం, సమావేశ ప్రాముఖ్యతను గురించి మంగళవారం నాటి సమావేశంలో చర్చించారు.