Secret files
-
బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్షుడి మెడకు రహస్య ఫైళ్ల వ్యవహారం
వాషింగ్టన్: రహస్య ఫైళ్ల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫైళ్లు బయటపడడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నివాసంలో తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. విల్మింగ్టన్లోని బైడెన్ ప్రైవేట్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకంగా 13 గంటలపాలు సోదాలు చేపట్టారు. మొత్తం ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు వీటిని ఉన్నతాధికారులకు నివేదించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయ బృందాలతోపాటు శ్వేతసౌధం అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని తెలిసింది. సోదాల్లో ఫైళ్లతో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. ఆరు ఫైళ్లు లభ్యం కాగా, ఇందులో కొన్ని బైడెన్ సెనేటర్‌గా ఉన్నప్పటివి, మరికొన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలానికి సంబంధించినవని ఆయన వ్యక్తిగత అటార్నీ బాబ్ బోయర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నాకు ఎలాంటి విచారం లేదు: బైడెన్ గత ఏడాది నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలో బైడెన్‌కు చెందిన పెన్ బైడెన్ సెంటర్లో, డిసెంబర్ 20న వాషింగ్టన్ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి రహస్య దస్త్రాలు బయటపడడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన వాటిని నేషనల్ ఆర్కైవ్స్ అందజేశారు. నిజానికి పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని అభిశంసించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు పంపించాలి. ఇదిలా ఉండగా, తన నివాసాల్లో జరుగుతున్న సోదాలపై బైడెన్ స్పందించారు. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. అయితే, బైడెన్ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్య పత్రాల విషయంలో బైడెన్ ఇక తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆయన కుటుంబంతోపాటు కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపారాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ నివాసాల్లో రహస్య పత్రాలు బయటపడడంపై కాంగ్రెస్ విచారణ చేపడుతుందని స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్‌కు సన్ స్ట్రోక్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారమే అండగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించే చైనా, రష్యాలో హంటర్ బైడెన్‌కు వ్యాపారాలున్నాయి. ఆయా దేశాల్లో పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్ లక్షలాది డాలర్లు ముడుపులుగా స్వీకరించాడని సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు హంటర్ బైడెన్‌కు చెందినవిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ల్లో ఆయన మత్తు మందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిళ్లు బయటపడడం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలను న్యూయార్క్ పోస్టు పత్రిక ప్రచురించింది. -
ఫోన్లో మీ సీక్రెట్లు దాచేయండిలా!
ప్రస్తుతం మొబైల్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఒకానొక కాలంలో వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే తన స్నేహితులు ఎవరో తెలుసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అందరి జీవితాలు ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు, మొబైల్ ఫోన్లోనే ఉన్నాయి. ఒక్కసారి మన ఫోన్ ఎవరికైనా ఇచ్చినా, లేదా ఎవరికైనా దొరికిన మన జీవితంలోని సీక్రెట్స్ మొత్తం దాదాపు వాళ్లకి తెలిసిపోయినట్లే. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్లకో, స్నేహితులకో, తెలిసి వాళ్లకో మన ఫోన్ ఇస్తూ ఉంటాం అలాంటప్పుడు వాళ్లకి మీ సీక్రెట్స్ తెలియకుండా దాచేయాలనుకుంటున్నారా? అయితే మీరు థర్డ్ పార్టీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండానే ఇలా చేయండి. మీ సీక్రెట్ ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ అన్ని దాచేయండి. హిడెన్ పోల్డర్ క్రియేట్ చేయడం: 1. మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి 2. స్టోరేజ్‌లోకి వెళ్లండి. 3. అక్కడ న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. 4. మీకు నచ్చిన ఫోల్డర్ నేమ్ పెట్టుకోండి 5. ఇప్పుడు దాన్ని హిడెన్ ఫోల్డర్ చేయాలనుకుంటే ఫోల్డర్ నేమ్‌కి ముందు డాట్ (.) పెట్టండి 6. మీరు హైడ్ చేయాలనుకున్న మొత్తం డేటాను ఈ ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి, అంతే దాచేయాలనుకున్న ఫైల్స్ అన్ని ఇంకెవరికి కనిపించవు. ఆల్రెడీ ఉన్న ఫోల్డర్ని హైడ్ చేయాలంటే... 1. మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేయండి. 2. మీరు ఏ ఫోల్డర్ దాచేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లండి. 3. ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ అనే ఆప్షన్‌కి వెళ్లండి. 4. అక్కడ ఫైల్ నేమ్‌ని .నోమీడియా (.nomedia) అని రాయండి. 5. అలా చేసిన తరువాత ఫైల్ మేనేజర్ యాప్ నుంచి బయటకు వచ్చి మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి. 6. ఇంకా మీ ఫైల్ ఎవరికి కనిపించదు. ఇంత వరకు బాగానే ఉంది. మరి దాచేసిన ఫైల్ని మనం చూడాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? హైడ్ చేసిన ఫోల్డర్ని చూడాలనుకుంటే ... ఫైల్ మేనేజర్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు హైడ్ చేసిన ఫోల్డర్ ఎక్కడ ఉందో చూడొచ్చు. ఇక ఆల్రెడీ ఉన్న ఫోల్డర్ని హైడ్ చేసిన వారు .నోమీడియా(.nomedia) ఫైల్‌ను ఫోల్డర్ నుంచి డిలీట్ చేసేయండి. మీరు దాచిన సీక్రెట్‌ను మీరు చూడగలుగుతారు. -
శాస్త్రి మరణంపైనా అనుమానాలు!
ఆయన మృతికి సంబంధించిన ఫైళ్లనూ బయటపెట్టాలి.. - లాల్ బహదూర్ శాస్త్రి తనయుల డిమాండ్ న్యూఢిల్లీ: నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసిన నేపథ్యంలో.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణానికి సంబంధించిన ఫైళ్లను కూడా వెల్లడి చేయాలన్న డిమాండ్ ప్రారంభమైంది. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి ఆదివారం ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్లో 1966, జనవరి 11న తన తండ్రి ఆకస్మికంగా చనిపోవడం వెనుక అనేక అనుమానాలున్నాయని, అందువల్ల దానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని అనిల్ కోరుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి త్వరలో లేఖ రాస్తానన్నారు. 1965నాటి భారత్-పాక్ యుద్ధానంతర శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేందుకు తాష్కెంట్ వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి(61).. సంతకాలు జరిగిన మర్నాడే హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారని నిర్ధారించారు. అయితే, తన తండ్రి మృతదేహం నీలంగా మారిందని, తెల్లటి మచ్చలు కనిపించాయని అనిల్ చెప్పారు. తాష్కెంట్లో కానీ భారత్‌లో కానీ తన తండ్రి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించలేదని, పోస్ట్‌మార్టం చేసి ఉంటే మరణానికి కారణం తెలిసేదన్నారు. ఆ మరణం వెనుక కుట్ర ఉండి ఉండొచ్చనేది భావిస్తున్నానన్నారు. ‘కచ్చితంగా చెప్పలేను కానీ ఏదో జరిగింది. నాడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఎవరికీ శిక్ష పడలేదు. ఒక వెయిటర్‌ను మాత్రం అరెస్ట్ చేసి, వదిలేశారు. తాష్కెంట్‌కు వెళ్లినప్పుడు మా అమ్మ ఆ వెయిటర్‌ను కలవాలనుకుంది. కానీ అతడు ఎక్కడున్నాడో తెలియదని అధికారులు చెప్పారు. మా నాన్న డైరీ మాయమైంది. తాష్కెంట్ ఒప్పందం గురించీ అందులో రాసి ఉండొచ్చు. నాన్నచనిపోయినప్పుడు ఆయన బెడ్ పక్కన ఉన్న థర్మాస్ ఫ్లాస్క్‌ను భారత్ తీసుకురాలేదు. ఆ థర్మాస్ ఫా్లస్కలో ఉన్న దానివల్లే మరణం సంభవించి ఉండొచ్చు. మృతిపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉన్న నాన్నగారి డాక్టర్, సహాయకుడు ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. ఇవ్వన్నీ అనుమానాలకు తావిచ్చేవిలా ఉన్నాయి’ అని అన్నారు. తన తండ్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గత పర్చాల్సిందిగా ఐకే గుజ్రాల్, చంద్ర శేఖర్ సహా ఎందరో ప్రధానులను కోరానని లాల్ బహదూర్ శాస్త్రి మరో కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి తెలిపారు. నేతాజీ ఫైళ్లను బయటపెట్టండి: నేతాజీ కుమార్తె కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కేంద్రం వద్దనున్న రహస్య ఫైళ్లను బయట పెట్టాలని ఆయన కుమార్తె అనితా బోస్ పాఫ్ ప్రధానిమోదీని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన 64 రహస్య ఫైళ్ల కాపీలు ఇంకా తనకు చేరలేదని ఆమె ఆదివారమిక్కడ తెలిపారు. అందుకే వాటిల్లో ఉన్న వివరాలు, ముఖ్యంగా నేతాజీ మరణానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ తన వద్ద లేదన్నారు. ఇన్నేళ్లూ రహస్యంగా మూసి ఉంచిన ఫైళ్లను బహిర్గతం చేయాలని స్కాలర్‌గా, నేతాజీ కుమార్తెగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు 72 ఏళ్ల అనిత చెప్పారు. జపాన్‌లోని నేతాజీ చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు చేస్తే, మిస్టరీ వీడే అవకాశముందని అన్నారు.