secretly
-
ష్.. మీ ఫోన్ వింటోందా?
మీరేం మాట్లాడుతున్నారు? ఏం చేయాలని అనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ మీ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ వినేస్తోంది. మనపై మన ఫోన్ ఉంచుతున్న నిఘా గుట్టును తేల్చేయడానికి నిపుణులు 4 సూచనలు చేస్తున్నారు. మన సంభాషణలను రహస్యంగా వినేస్తున్న స్మార్ట్ ఫోన్లు మనం దేని గురించి మాట్లాడితే.. ఆ అంశంపై యాడ్స్ వెబ్సైట్ల నుంచి సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా అవే ప్రకటనల గోల మీరేం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. ఇంట్లో మీ గదిలో కూర్చుని మీ భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో ఇవన్నీ మాట్లాడుకున్నారు. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ ఒకరు మాత్రం రహస్యంగా అన్నీ వినేస్తున్నారు.. వినడమే కాదు, మీ మాటలన్నీ విశ్లేషించి... మీ అవసరానికి సూటయ్యేలా సూచనలు చేస్తున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఇంతకీ అన్నీ వింటున్న ఆ ఒక్కరు ఎవరు?.. మీ స్మార్ట్ ఫోనే! నిఘా పెట్టేదెలాగో, అది మనకు తెలిసేదెలాగో తెలుసుకుందామా..ఇంటర్నెట్ సెర్చింగ్ నుంచి మైక్రోఫోన్‌తో నిఘా దాకా..మీరు ఏదైనా ప్రదేశం గురించో, మరేదైనా సమాచారం కోసమో ఇంటర్నెట్లో సెర్చింగ్ చేస్తే.. ఆ తర్వాత మీ ఫోన్లో, కంప్యూటర్లో ఆ ప్రదేశం, సమాచారానికి సంబంధించిన ప్రకటనలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఢిల్లీలో మంచి హోటళ్లు ఏమేం ఉన్నాయని సెర్చ్ చేశామనుకోండి. ఆ తర్వాత కొన్నిరోజుల వరకు మనం ఏ వెబ్సైట్లు ఓపెన్ చేసినా.. వాటిలో ఢిల్లీలోని హోటళ్ల సరీ్వసులు, ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ మన ఫోన్ మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నామనేదీ తెలుసుకుంటోంది. ఫోన్లోని మైక్రోఫోన్ ద్వారా నిఘాపెడుతోంది. మరి మన ఫోన్ ఇలా మనపై నిఘా పెట్టిందా లేదా అనేది చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని ‘నార్డ్ వీపీఎన్’ సంస్థ టెక్ నిపుణులు చెబుతున్నారు.మనపై ఫోన్ నిఘా గుట్టు తేల్చేద్దాం ఇలా..1. మీరు ఇప్పటివరకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయని, సోషల్ మీడియాలో పెట్టని, ఎప్పుడూ మాట్లాడని ఒక కొత్త టాపిక్‌ను ఎంచుకోండి.2. మీ ఫోన్‌ను మీకు దగ్గరలో పెట్టుకుని ఈ టాపిక్‌పై నాలుగైదు రోజులు తరచూ మాట్లాడండి. ఎవరితోనైనా చర్చించండి. ఉదాహరణకు ఏదైనా దేశం, అక్కడి నగరాలు, టూరిస్టు ప్లేసులు, రెస్టారెంట్లు వంటి అంశాలను మాట్లాడండి.3. అయితే ఈ టాపిక్కు సంబంధించి ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ఎక్కడా సెర్చింగ్, పోస్టింగ్ వంటివి చేయకూడదు. కేవలం ఫోన్‌ను మీకు సమీపంలో పెట్టుకుని సదరు టాపిక్‌పై మాట్లాడాలి. మిగతా విషయాల్లో మీ ఫోన్‌ను మామూలుగానే వాడుతూ ఉండాలి.4. 4,5 రోజుల తర్వాతి నుంచి మీ ఫోన్లో, మీ ఈ–మెయిల్‌తో లింక్ అయి ఉన్న స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, కంప్యూ టర్లలో.. మీరు చూసే వెబ్సైట్లు, సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే యాడ్స్‌ను కాస్త గమనిస్తూ ఉండండి.5, ఒకవేళ మీరు మాట్లాడిన అంశానికి సంబంధించి యాడ్స్ తరచూ కనిపిస్తూ ఉంటే.. ఫోన్ మీపై నిఘా పెట్టి, మీ సంభాషణలలోని టాపిక్స్‌ను యాడ్స్ కోసం వాడుతున్నట్టే.ఈ నిఘా నుంచి బయటపడేదెలా? ⇒ ఫోన్లో సోషల్ మీడియా, ఈ–కామర్స్, బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన యాప్స్ నుంచి.. గేమ్స్, యుటిలిటీస్ యాప్స్ వరకు ఉంటా యి. వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు స్టోరేజీ, మైక్రోఫోన్, కెమెరా వంటి పరి్మషన్లు ఇస్తుంటాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ⇒ పెద్ద కంపెనీల యాప్‌లతో సమస్య ఉండకపోవచ్చుగానీ.. గేమ్స్, యుటిలిటీస్, ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్స్టాల్ చేసుకునే యాప్‌లు, యాడ్స్‌పై లింకులను క్లిక్‌చేయడం ద్వారా డౌన్లోడ్ అయ్యే యాప్‌లతో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి యాప్‌లకు ఇచ్చే పరి్మషన్లు దుర్వినియోగమై.. మీ ఫోన్‌తోనే మీపై నిఘా మొదలవుతుంది. అందువల్ల ముఖ్యమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ⇒ యాప్స్‌కు అవసరమైన పరి్మషన్లు మాత్రమే ఇవ్వాలి. అప్పుడప్పుడూ ఏయే యాప్స్‌కు ఏ పరి్మషన్లు ఇచ్చినదీ, సెట్టింగ్స్‌లోకి వెళ్లి పరిశీలించాలి. అనవసర యాప్స్‌కు ఇచ్చిన పరి్మషన్లను తొలగించాలి. వీలైతే అవసరం లేని యాప్స్‌ను తొలగించేయడం మంచిది. ⇒ ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ యాప్ సెట్టింగ్స్‌లో ‘ఆలో వెన్ లాక్డ్’ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి. దీనితో ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు మైక్రోఫోన్ వాడకుండా ఉంటుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: అరుదైన వన్యప్రాణులను ఈశాన్య రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పాతబస్తీ కేంద్రంగా అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిందితుడి నుంచి 4 స్లోలోరిస్లతో పాటు నక్షత్ర తాబేలు, మరో అరుదైన తాబేలును స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం వెల్లడించారు. కేసును అధీనంలోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పాతబస్తీలోని బార్కస్‌కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్ మందుల షాపు నిర్వహిస్తున్నారు. ఈ ఆదాయం చాలకపోవడంతో అదనపు రాబడి మార్గాలు అన్వేషించారు. ఏడాది క్రితం పావురాల అమ్మకం మొదలెట్టారు. ఆపై కొన్ని రకాలైన పిల్లులు, కోళ్లను విక్రయించేవారు. వీరి వద్దకు వచ్చే కస్టమర్లలో అనేకులు అరుదైన జంతువులు కావాలని కోరడంతో వీరి దృష్టి వాటిపై పడింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి.. కొందరు కస్టమర్లలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో కొన్ని అరుదైన జంతువులకు నగరంలో డిమాండ్ ఉందని అలీ బిన్ గుర్తించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే వాటిని అక్రమ మార్గంలో తెచ్చి విక్రయించడం ద్వారా తేలిగ్గా భారీ మొత్తం సంపాదించవచ్చని అన్నదమ్ములు పథకం వేశారు. అలీ బిన్ ఈశాన్య రాష్ట్రాల్లో జంతువులను స్మగ్లింగ్ చేసే వారిని సంప్రదించాడు. వారి సహకారం తో ప్రైవేట్ వాహ నాల్లో వాటిని సిటీకి తీసుకు వస్తున్నాడు. వీటిని కొన్నాళ్ల పాటు తమ ‘కబూతర్ ఖానా’లోనే ఉంచి ఆపై కోరిన వారికి మూడు రెట్ల ధరకు అమ్ముతున్నారు. వీరి దందాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో సిబ్బంది నిందితుల ఇంటిపై దాడి చేశారు. సాలెహ్ బిన్ను అదుపులోకి తీసుకుని నాలుగు స్లో లోరిస్‌లు, స్టార్ తాబేలు, డొప్ప తాబేలును స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జంతువులతో సహా నిందితుడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పరారీలో ఉన్న అలీ బిన్ చిక్కితే ఈ కేసులో కీలకాంశాలు వెలుగులోకి రావచ్చు. స్లో లోరిస్.. రూ.50 వేలు లోరిస్కు చెందిన కొన్ని అవయవాలను సంప్రదాయ వైద్యంలో ఔషధాల తయారీకి వాడుతున్నారు. దీని మాంసం తింటే పటుత్వం పెరుగుతుందని, సజీవంగా తమ ప్రాంగణంలో పాతి పెడితే అదృష్టం పడుతుందనే మూఢనమ్మకాలున్నాయి. ►క్షీరదాల జాతికి చెందిన స్లో లోరిస్ జంతువు నిశాచరి. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో కూడా ఇది లేదు. ఇవి ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లో ఉంటాయి. ►శాకాహారి అయిన స్లో లోరిస్ చెట్లపై నివసిస్తూ బొప్పాయి సహా కొన్ని రకాలైన పళ్లను తింటుంది. దీనికి ఆహారం నిమిత్తం రోజుకు రూ.300 వరకు వెచ్చిస్తున్నారు. ►దీనిని రూ.15 వేలకు ఖరీదు చేసి రూ.50 వేలకు అలీ సోదరులు విక్రయిస్తున్నారు. నక్షత్ర తాబేలు రూ.40 వేలు.. స్టార్ టార్టాయిస్ ఇంట్లో ఉంచుకున్నా, పెంచుకున్నా భవిష్యత్తు బాగుంటుందని, అదృష్టం వరిస్తుందనే నమ్మకం ఉంది. మెత్తడి డొప్ప తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్మకం పలువురిలో ఉంది. ►స్టార్ టార్టాయిస్గా పిలిచే నక్షత్ర తాబేళ్లు పొడి ప్రాంతాలు, కొన్ని అడవుల్లో జీవిస్తుంటాయి. ఇవి భారీ సంఖ్యలో విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంటాయి. ►సుదీర్ఘ సమయం నీటి అడుగున ఉండగలిగే మెత్తడి డొప్ప తాబేలు దేశంలోని గంగ, సింధు, మహానదుల్లో మాత్రమే దొరుకుతుంది. ►నక్షత్ర తాబేళ్లను రూ.10 వేలకు కొని.. రూ.40 వేలకు, మెత్తని డొప్పతో ఉండే తాబేళ్లను రూ.5 వేలకు ఖరీదు చేసి రూ.20 వేలకు విక్రయిస్తున్నారు. -
యాహూ సీక్రెట్ స్కానింగ్ సంచలనం?
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఇంక్ మరోసారి చిక్కుల్లో పడింది. అమెరికా ప్రభుత్వ నిఘా అధికారులతో కలిసి కస్టమర్ ఇ-మెయిల్స్ ను స్కాన్ చేసిన యాహూ గూఢచర్యం చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీని కోసం ఏకంగా ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు, వినియోగాదారుల ఈ-మెయిల్ ఖాతాలకు వచ్చే సమాచారాన్ని తస్కరించేందుకు యాహూ గత సంవత్సరం ఓ సాఫ్ట్ వేర్ ను తయారుచేసిందని, దీని సాయంతో రహస్యంగా అన్ని యాహూ మెయిల్ ఖాతాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం డిమాండ్ కు కట్టుబడి వందల మిలియన్ల యాహూ మెయిల్స్ స్కానింగ్ చేసినట్టు సమాచారం. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఆదేశం మేరకు ఖాతాలను హ్యాక్ చేస్తోందని ముగ్గురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. సందేశాలను శోధించడం కోసం నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, ఎఫ్‌బీఐ అధికారుల కోసం యాహూ ఈ పని చేస్తోందని సంస్థను వీడిన ఈ ముగ్గురు ఉద్యోగులు వెల్లడించారు. అధికారులు చెప్పిన కొన్ని పదాలు, సంకేతాల కోసం యాహూ యూజర్లకు వస్తున్న మెయిల్స్ మాత్రమే ఈ సాఫ్ట్ వేర్ సాయంతో స్కాన్ అవుతున్నాయని, అప్పటికే స్టోర్ అయివున్న మెసేజ్ లను స్కానింగ్ చేయడం లేదని వివరించారు. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఖాతాలపై పూర్తి నిఘా ఉంచేందుకూ యాహూ అంగీకరించలేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ అధికారి వెల్లడించారు. వీరు అందించిన సమాచారం ప్రకారం, యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరిస్సా మేయర్ ఈ నిర్ణయాన్ని కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారనీ, ప్రస్తుతం ఫేస్ బుక్ టాప్ భద్రతా ఉద్యోగిగా వున్న , యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ స్టామోస్ జూన్ 2015 సం.రంలో సంస్థ నుంచి నిష్క్రమణకు దారితీసింది. అయితే, యాహూ దీనిపై స్పందించడానికి నిరాకరించిందింది. అలాగే సంస్థ మాజీ అధికారి స్టామోస్ కూడా ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ఇదే డిమాండ్ పై గతంలో ఇంటర్నెట్ కంపెనీలు ఆశ్రయించిందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే సాధారణంగా ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ద్వారా దేశీయ నిఘా కోసం కొన్ని అభ్యర్ధనలు చేస్తుందని, ఏ ఏజెన్సీ సమాచారాన్ని కోరి ఉంటుందనేది తెలుసుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఉపకరించేలా యాహూ రహస్యంగా సదరు సమాచారం సేకరించిందా? గూగుల్, రెడిఫ్ లాంటి ఇతర ఈ-మెయిల్ సేవల సంస్థలనూ ఇలాగే నిఘా వర్గాలు కోరాయా? అన్నది తెలియాల్సివుందని అభిప్రాయపడుతున్నారు. -
పోకిరీ వేషం... కుదిరింది రోగం!
-
సీమ ఉన్నతాధికారులతో డీజీపీ రహస్య సమావేశం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : డీజీపీ దినేష్‌రెడ్డి గురువారం తిరుపతిలో రాయలసీమ పరిధిలోని ఎస్పీలు, డీఐజీలు, ఐజీతో రహస్యంగా సమావేశమయ్యారు. ఉదయం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న డీజీపీ దినేష్‌రెడ్డి సాయంత్రానికి హుటాహుటిన తిరుపతికి చేరుకుని, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ఎస్పీలు, డీఐజీ, ఐజీతో రహస్యంగా సమావేశమయ్యారు. సమైక్యాం ధ్రఉద్యమ నేపథ్యంలో రాయలసీమలో భద్రత గురిం చి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అవసరమై తే మరిన్ని బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సమైక్యాంధ్రఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న వారిని బైండోవర్ చేయాలని, విశ్వవిద్యాలయాలపై ప్రత్యేక నిఘా వేయాలని డీజీపీ ఆదేశించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘రాయల తెలంగాణ’ నేపథ్యంలోనే..? ఓట్లు సీట్లే పరమావధిగా రాష్ట్ర విభజనకు నడుం కట్టిన కాంగ్రెస్ మరోకుట్రకు తెరతీసిందేమోననే అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసేలా కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. సీమకు చెందిన కొందరు నాయకులు ఇటీవల రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.