security market
-
బాంబే డైయింగ్‌కు సెబీ భారీ షాక్, కంపెనీ స్పందన ఇది!
సాక్షి, ముంబై: ఆర్థిక నివేదికల వెల్లడిలోఅవకతవకలు, అక్రమాల ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ బాంబే డైయింగ్ న్యాయ పోరాటానికి దిగింది. సెబీ ఆర్డర్‌పై అప్పీల్ చేయడానికి తన చట్టబద్ధమైన హక్కును వినియోగించు కుంటుందని బాంబే డైయింగ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సాట్)ని ఆశ్రయించనున్నట్లు బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది. తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సెబీ ఆర్డర్‌ను తాను పరిశీలించామని, అయితే దశాబ్దం క్రితం నాటి ఖాతాలపై సెబీ చర్యలు చేపట్టిందని తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరం, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి చెల్లుబాటు కాని ఖాతాలను, ఆమోదించని, లేదా సరిగా లేని వివరాలను అన్వయించడానికి ప్రయత్నించిందని కంపెనీ పేర్కొంది. కాగా ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగంపై సెబీ సెక్యూరిటీస్ మార్కెట్లో ప్రవేశించకుండా సెబీ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. అలాగే వాడియా గ్రూప్‌పై సెబీ 157.5 మిలియన్ రూపాయల జరిమానా కూడా విధించింది. 2011-12, 2018-19 సంవత్సరాల్లో కంపెనీ కార్యకలాలపై నిశితంగా పరిశీలించినట్లు సెబీ తెలిపింది. అంతేకాదు వాడియా గ్రూప్‌నకు చెందిన బొంబే డైయింగ్ ప్రమోటర్స్ నుస్లీవాడియా, ఆయన ఇద్దరు కుమారులను కూడా సెక్యూరిటీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించకుండా రెండేళ్ల పాటు బ్యాన్ చేసింది. దీంతోపాటు వాడియా గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ స్కేల్ సర్వీసెస్‌పైనా నిషేధం విధించింది. ఈ కంపెనీకి చెందిన మాజీ డైరెక్టర్లు డీఎస్ గగ్‌రాత్, ఎన్‌హెచ్ దంతేవాలా, శైలేష్ కార్నిక్, ఆర్ చంద్రశేఖరన్, బొంబే డైయింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దర్గేష్ మెహతాపై కూడా సెబీ నిషేధం విధించింది. ఈ లాభాలకు కంపెనీ రియల్ ఎస్టేట్ విభాగం బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే బాధ్యత వహిస్తుందని ఆర్డర్ పేర్కొంది. స్కేల్‌తో కలిసి బీడీఎంసీఎల్ ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నివేదికల తారుమారు చేసి, లాభాలను చూపించిన మార్కెట్ నిబంధలను ఉల్లఘించడమే కాకుండా షేర్ ధరలపై తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత బారువా ఉత్తర్వులో పేర్కొన్నారు. బాంబే డైయింగ్ కంపెనీ పాలిస్టర్,టెక్స్టైల్స్, రియల్ ఎస్టేట్‌తో పాటు పది రంగాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
సెక్యూరిటీ మార్కెట్లపై రిటైల్ ఇన్వెస్టర్ల ముద్ర
న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం 2020 ఏప్రిల్ నుంచి పెరిగినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఎన్ఐఎస్ఎమ్ రెండో వార్షిక ‘క్యాపిటల్ మార్కెట్స్’ సదస్సులో భాగంగా త్యాగి మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతీ నెలా 24.5 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉండడం, నగదు లభ్యత తగినంత ఉండడం ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. కానీ, అదే సమయంలో ఇన్వెస్టర్లకు ఆయన ఒక హెచ్చరిక చేశారు. వడ్డీ రేట్లు తిరిగి పెరగడం మొదలై, నగదు లభ్యత తగ్గితే అది మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందన్నారు. మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తునే చూస్తుంటాయన్న ఆయన.. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వస్తున్నవిగా పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి 4.1 కోట్లుగా ఉన్న మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య.. ఆర్థిక సంవత్సరం చివరికి 5.5 కోట్లకు పెరగడం గమనార్హం. అంటే 34.7 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. ఈ లెక్కన గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెలా సగటున 12 లక్షల చొప్పున కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20)లో ప్రతీ నెలా సగటున ప్రారంభమైన కొత్త డీమ్యాట్ ఖాతాలు 4.2 లక్షల చొప్పున ఉన్నాయి. మరింత వేగం.. ‘‘ఈ ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరింత వేగాన్ని అందుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతీ నెలా 24.5 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ టర్నోవర్ 2019–20లో రూ.96.6 లక్షల కోట్లుగా ఉంటే.. 2020–21లో రూ.164.4 లక్షల కోట్లకు పెరిగింది. 70.2 శాతం అధికమైంది. ట్రేడ్లలో ఎక్కువ భాగం మొబైల్స్, ఇంటర్నెట్ ఆధారిత వేదికల నుంచే నమోదు కావడం రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరిగినదానికి సంకేతం’’ అని అజయ్ త్యాగి వివరించారు. రీట్, ఇన్విట్, ఈఎస్జీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు త్యాగి చెప్పారు. కరోనా కల్లోలిత సంవత్సరంలోనూ (2020–21) క్యాపిటల్ మార్కెట్ల నుంచి కంపెనీలు రూ.10.12 లక్షల కోట్లను సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ.9.96 లక్షల కోట్ల కంటే స్వల్పంగా పెరిగింది. నూతన దశకం ‘‘బలమైన వృద్ధికితోడు మన మార్కెట్లు కొత్త యుగంలోకి అడుగు పెట్టాయి. పలు నూతన తరం టెక్ కంపెనీలు దేశీయంగా లిస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మరే ఇతర మార్కెట్‌తో చూసినా కానీ మన మార్కెట్లు నిధుల సమీకరణ విషయంలో ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని త్యాగి పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్ల బలోపేతానికి, మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా సెబీ ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. -
పెట్టుబడుల తీరుపై సెబీ సర్వే
ఇన్వెస్టర్ల నుంచి వివరాల సేకరణకు సన్నాహాలు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సర్వే న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుపై సర్వేను నిర్వహించనుంది. తద్వారా దేశీ కుటుంబాల పొదుపు, పెట్టుబడుల ట్రెండ్‌పై అధ్యయనం చేయనుంది. ఈ విషయంలో సెక్యూరిటీల మార్కెట్‌పై పడినప్రభావం, ఏర్పడిన మార్పులు తదితర అంశాలపై వివరాలను సేకరించనుంది. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇన్వెస్టర్ సర్వేను చేపట్టనుంది. దీనిలో భాగంగా 50,000 కుటుంబాలు, 1,000 మంది స్టాక్ ఇన్వెస్టర్ల నుంచి వివరాలను సేకరించనుంది. సెబీ ఇంతక్రితం ఇలాంటి సర్వేను 2008-09లో మాత్రమే చేపట్టింది. రిస్క్ ప్రొఫైల్‌పై అవగాహన పొదుపు, పెట్టుబడులు, సెక్యూరిటీ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలపట్ల ఆసక్తి తదితర అంశాల ఆధారంగా ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యం(ప్రొఫైల్)ను అంచనా వేయనున్నట్లు సెబీ తెలిపింది. దీంతోపాటు ఇన్వెస్టర్ల అవగాహనను పెంచేందుకు చేపడుతున్న విద్యా సంబంధ కార్యక్రమాల ప్రభావాన్ని తెలుసుకోనున్నట్లు వివరించింది. ప్రైవేటు సంస్థల ద్వారా ఈ సర్వే నిర్వహించనుంది. బోనస్ షేర్ల విక్రయానికి ఓకే ప్రైమరీ మార్కెట్లకు జోష్‌నిచ్చే బాటలో బోనస్ షేర్ల విక్రయానికి సంబంధించి సెబీ నిబంధనలను సవరించనుంది. ఏదైనా ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు లేదా ఇతర ఇన్వెస్టర్లు తమకు లభించిన షేర్లను విక్రయించేందుకు వీలు కల్పించనుంది. బోనస్ షేర్ల కేటాయింపు జరిగి ఏడాది పూర్తికానప్పటికీ విక్రయించేందుకు అవకాశాన్ని కల్పించనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడాదిలోపు కేటాయించిన బోనస్ షేర్లను ఐపీవోలో అమ్ముకునేందుకు వీలులేదు