seemandhra new state
-
సీమాంధ్ర అభివృద్ధి అన్ని నగరాల్లో ఉండాలా?
రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో కొత్త రాజధాని కూడా ఏర్పడబోతుంది. ఇందుకోసం అయిదుగురు నిఫుణుల కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించి భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకోవడమే వివేకవంతుల లక్షణం. మరి మన సీమాంధ్ర ప్రాంతాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేయచ్చు. అందుకోసం అన్ని పెట్టుబడులు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, మౌలిక వసతులు ఒకే చోట కేంద్రికృతం కాకుండా చూడాలా? హైదరాబాదు విషయంలో చేసిన పొరపాట్లు మరలా చేయకూడదా? సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదా? అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలా? ప్రత్యేక ప్రతిపత్తి హోదాని పదేళ్ళకు పొడిగించేలా? -
ఉపాధి కల్పనకు కొత్త సీఎం చేయాల్సిన 5 పనులేంటి?
కొత్తగా ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రంలో ఉపాధి కల్పన పెద్ద సమస్య కాబోతోందని అందరూ చెబుతున్నారు. అయితే దీని పరిష్కారానికి ఏం చేస్తారో మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అంతే స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా రావాలి. అయితే, కొత్తగా పదవి చేపట్టే ముఖ్యమంత్రి ఇందుకు సరైన దిశలో కసరత్తు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు కొత్తగా ఉద్యోగావకాశాలు రావాలంటే కొత్త ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? (సీమాంధ్ర కొత్త సీఎం చేయాల్సిన 5 ప్రధాన పనులేంటి?) ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక ఇంజనీరింగ్, వైద్య కళాశాలలున్నాయి. కానీ.. పెట్రో కెమికల్స్, మెరైన్ ఇంజనీరింగ్ లాంటి రంగాల్లో అపార అవకాశాలున్నా, ఆ రంగానికి సంబంధించిన విద్యావకాశాలు మాత్రం పెద్దగా లేవు. అలాగే మైనింగ్‌కు సంబంధించి కూడా మన రాష్ట్రంలో ఎలాంటి విద్యావకాశాలు లేవు. వాటిని మెరుగుపరచడంతో పాటు ఇతర రంగాల్లోనూ ఉపాధికి ఎలాంటి అవకాశాలున్నాయో చూడాలి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున నిర్మాణ రంగ కార్మికులు ఇతర ప్రాంతాలకు ఇన్నాళ్లుగా వలస వెళ్తున్నారు. వారికి కొత్త రాష్ట్రంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలో కూడా కొత్త ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ నేపథ్యంలో, కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి వచ్చే ముఖ్యమంత్రి ఉపాధి అవకాశాల కల్పనకు తీసుకోవాల్సిన ఐదు చర్యలు సూచించండి. మీ సూచనలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. నిర్మాణాత్మకంగా ఇచ్చే సూచనలు కొత్త రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడతాయి. -
సీమాంధ్ర కొత్త సీఎం చేయాల్సిన 5 ప్రధాన పనులేంటి?
అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నాయకులు చాలా హామీలు ఇస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల కాలం కావడంతో అందరి దృష్టీ కొత్తగా ఏర్పడుతున్న సీమాంధ్ర రాష్ట్రం మీదే ఉంది. రాబోయే పదేళ్ల పాటు అక్కడి ఏడు జిల్లాలకు ప్రత్యేక హోదా ఉండటం, టాక్స్ హాలిడేలు తదితర అంశాల నేపథ్యంలో సీమాంధ్రను అభివృద్ధి చేయడానికి కావల్సినంత అవకాశం ఉంది. అనేక రంగాలలో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయచ్చు. వ్యవసాయం వెన్నెముకగా ఉన్న సీమాంధ్ర ప్రాంతాన్ని అసలు వ్యవసాయమే లేని సింగపూర్‌లా తయారుచేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అయితే.. అసలు సీమాంధ్ర ప్రాంతానికి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? వాళ్లు ప్రధానంగా చేయాల్సిన ఐదు పనులు ఏవేంటి? ఏం చేస్తే ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతుంది? పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఓడరేవుల అభివృద్ధి.. ఇలా ఏవైనా కావచ్చు. మీ సూచనలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.