కొత్తగా ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రంలో ఉపాధి కల్పన పెద్ద సమస్య కాబోతోందని అందరూ చెబుతున్నారు. అయితే దీని పరిష్కారానికి ఏం చేస్తారో మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అంతే స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా రావాలి. అయితే, కొత్తగా పదవి చేపట్టే ముఖ్యమంత్రి ఇందుకు సరైన దిశలో కసరత్తు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు కొత్తగా ఉద్యోగావకాశాలు రావాలంటే కొత్త ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? (సీమాంధ్ర కొత్త సీఎం చేయాల్సిన 5 ప్రధాన పనులేంటి?)
ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక ఇంజనీరింగ్, వైద్య కళాశాలలున్నాయి. కానీ.. పెట్రో కెమికల్స్, మెరైన్ ఇంజనీరింగ్ లాంటి రంగాల్లో అపార అవకాశాలున్నా, ఆ రంగానికి సంబంధించిన విద్యావకాశాలు మాత్రం పెద్దగా లేవు. అలాగే మైనింగ్కు సంబంధించి కూడా మన రాష్ట్రంలో ఎలాంటి విద్యావకాశాలు లేవు. వాటిని మెరుగుపరచడంతో పాటు ఇతర రంగాల్లోనూ ఉపాధికి ఎలాంటి అవకాశాలున్నాయో చూడాలి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున నిర్మాణ రంగ కార్మికులు ఇతర ప్రాంతాలకు ఇన్నాళ్లుగా వలస వెళ్తున్నారు. వారికి కొత్త రాష్ట్రంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలో కూడా కొత్త ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ నేపథ్యంలో, కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి వచ్చే ముఖ్యమంత్రి ఉపాధి అవకాశాల కల్పనకు తీసుకోవాల్సిన ఐదు చర్యలు సూచించండి. మీ సూచనలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. నిర్మాణాత్మకంగా ఇచ్చే సూచనలు కొత్త రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడతాయి.
ఉపాధి కల్పనకు కొత్త సీఎం చేయాల్సిన 5 పనులేంటి?
Published Mon, Mar 24 2014 2:19 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement
Advertisement