Selection candidates
-
‘ప్రభుత్వ డిగ్రీ’తో ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ‘ప్లేస్మెంట్ల’లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. డిగ్రీతో పాటు జవహర్ నాలెడ్జ్ సెంటర్లు(జేకేసీ), నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను పొందుతుండటంతో డిగ్రీ చివరి ఏడాదిలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఏకంగా 539 జాబ్ డ్రైవ్‌ల ద్వారా చరిత్రలో తొలిసారిగా 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. గతంలో విద్యార్థులకు తరగతి గది పాఠ్యాంశాలు మాత్రమే అందేవి. బయట ఉద్యోగాలకు వెళితే నైపుణ్యాలు లేవన్న కారణంతో పరిశ్రమలు తిరిస్కరించేవి. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. బీటెక్ వంటి ప్రొఫెషనల్ విద్యలోనే కాకుండా నాన్–ప్రొఫెషనల్ డిగ్రీల్లోనూ 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఫలితంగా డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. మార్కెట్ ఓరియెంటెడ్ నైపుణ్యం దేశంలోనే నాలెడ్జ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రతి విద్యారి్థనిని ‘జాబ్ రెడీనెస్’ ఓరియెంటేషన్తోనే సన్నద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ సెల్ ద్వారా 17 రంగాల్లో నైపుణ్యాలు అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రబ్బర్ అండ్ పెట్రోలియం కెమికల్స్, ఫుడ్ ప్రొసెసింగ్, ఎల్రక్టానిక్స్, టూరిజం–హాస్పిటాలిటీ, క్యాపిటల్ గూడ్స్, మేనేజ్మెంట్ ఎంట్రప్రెన్యూర్íÙప్, గ్రీన్‌జాబ్స్, రిటైల్ సెక్టార్ వంటి రంగాల్లో మార్కెట్ ఓరియెంటెడ్ స్కిల్స్‌ను పెంపొందిస్తూనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సుమారు 500 కంపెనీలను సమన్వయం చేస్తూ ఒకేసారి దాదాపు 30 వేల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కళాశాల విద్యాశాఖ ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను, యాప్‌ను తయారు చేసింది. 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా విభజించి ప్లేస్మెంట్ డ్రైవ్‌లు కొనసాగిస్తోంది. ఎంపిక చేసిన కళాశాలల్లో నోడల్ రిసోర్స్ సెంటర్ల పేరుతో ప్లేస్మెంట్ సెల్‌లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మొదటి రెండేళ్లు విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తోంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘నైపుణ్యాల పెంపు’ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో 2,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను పూర్తి చేశారు. మరో 2,500 మంది అధ్యాపకులు, విద్యార్థులు సిస్కో ఎడ్యూస్కిల్ కోర్సులు, 7,700 మంది ఐఐటీ ముంబయి సహకారంతో స్పోకెన్ ట్యూటోరియల్స్ కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో.. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎక్కడికో వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది కెమికల్ ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో, డెక్కన్గ్రూప్, రిటైల్ విభాగంలో ఫ్లిప్‌కార్ట్, డీమార్ట్, ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్, అమెజాన్, జాయలుక్కాస్, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, స్టార్టెక్ హెల్త్‌తో పాటు ఫార్మాలో అపోలో, మెడ్‌ప్లస్, బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐటీలో ఎఫ్ట్రానిక్స్, టెక్బియం, హెచ్1హెచ్ఆర్తో పాటు ట్రాన్స్‌పోర్టు, మీడియా, ఎడ్యుటెక్, ఫైనాన్స్ రంగాల్లో అనేక కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా హెచ్‌సీఎల్, టీసీఎస్, డెలాయిట్, స్టేట్‌స్ట్రీట్ వంటి సంస్థల్లోనూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యతో పాటే ఉద్యోగం.. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చింది. తరగతి బోధనతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎనలిటికల్ థింకింగ్ పెంపొందించేలా చర్యలు చేపట్టాం. కళాశాలల్లో ప్లేస్మెంట్ సెల్స్ ఏర్పాటు చేసి ఏటా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధిని చూపుతున్నాం. గతేడాది ఆగస్టు వరకు వివిధ ప్రదేశాల్లో ప్లేస్మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాం. సుమారు 18 వేల మందికి పైగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. – పోలా భాస్కర్, కమిషనర్, కళాశాల విద్య -
Andhra Pradesh: జెడ్పీ వైస్ ఛైర్మన్లు వీరే..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైఎస్సార్సీపీనే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తికాగా, వారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారిగా జెడ్పీ వైస్ ఛైర్మన్లుగా ఎంపికైన వారు.... తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి ( విశాఖ), బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత (తూర్పు గోదావరి), పెనుమాల విజయబాబు, శ్రీలేఖ ( పశ్చిమ గోదావరి), గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు (కృష్ణ), బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి( గుంటూరు), యన్నాబత్తిన అరుణ, సుజ్ఞానమ్మ (ప్రకాశం), శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న(నెల్లూరు ), ధనుంజయ్‌రెడ్డి, రమ్య( చిత్తూరు), కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న ( అనంతపురం), దిల్షాద్ నాయక్, కురువ బొజ్జమ్మ ( కర్నూలు), సిరిపురపు జగన్మోహన్రావు, పాలిన శ్రావణి ( శ్రీకాకుళం), జేష్టాది శారద, పిట్టు బాలయ్య (వైఎస్సార్), అంబటి అనిల్‌కుమార్, బాపూజీ నాయుడు(విజయనగరం). చదవండి: AP ZPTC Chairman Election: 13 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లగా ఎంపికైన వారు -
ముఖ్యమంత్రి పీఠం ఎవరిది?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్/సిమ్లా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించినా.. ముఖ్యమంత్రుల ఎంపిక ఆ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. బీజేపీ గెలిస్తే.. గుజరాత్లో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రేమ్ కుమార్ ధూమల్‌లు సీఎంలు అవుతారని ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది. అయితే గుజరాత్లో అత్తెసరు మెజార్టీతో గెలవడం, హిమాచల్‌లో ఏకంగా సీఎం అభ్యర్థే ఓడిపోవడంతో కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం రేసులో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీతో పాటు కేంద్ర సహాయ మంత్రి మన్సుఖ్ లాల్ మాండవీయ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ప్రస్తుత కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్లు వినిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జైరాం ఠాకూర్, అజయ్ జమ్వాల్, కేంద్ర మంత్రి నడ్డాలు రేసులో ఉన్నారు. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ నేతృత్వంలోనే గుజరాత్ ఎన్నికల్లో తలపడుతున్నామని ప్రచారంలో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. అయితే బీజేపీ అనుకున్నన్ని స్థానాలు గెలవకపోవడంతో.. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ నాయకత్వం యోచిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ, పార్టీ పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయమని ఆ వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు రూపానీ స్పందిస్తూ.. ‘ఈ ఎన్నికల్లో నా పేరిట బీజేపీ పోరాడింది. అయితే ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు గాను పటీదార్ వర్గం నుంచి 47 మంది ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికి సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పటేల్ వర్గానికి చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ లాల్ మాండవీయ, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నిర్ణయంతో హార్దిక్ పటేల్‌కు కూడా చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో ఉంది. సీఎం రేసులో పటేల్ వర్గానికి చెందిన సీనియర్ నేత, కర్ణాటక గవర్నర్ వజుభాయ్‌వాలా పేరు కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేరు తెరపైకి వచ్చినా.. పార్టీ వర్గాలు మాత్రం స్పందించలేదు. నేడు గుజరాత్‌కు జైట్లీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని పరిశీలక బృందం నేడు గుజరాత్‌కు వెళ్లనుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చించి ముఖ్యమంత్రి పేరుపై ఏకాభిప్రాయానికి ప్రయత్నించనుంది. అనంతరం ఎమ్మెల్యేల నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు తెలియచేస్తుంది. కాగా గుజరాత్లో డిసెంబర్ 25న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజునే ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నారు. హిమాచల్‌లో జైరామ్ ఠాకూర్ ముందంజ హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్ ఓటమితో సీఎం ఎంపిక పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ధూమల్ ఓటమితో ఆయనకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి. హిమాచల్‌లో 35% ఓటర్లు రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో ఆ వర్గానికే చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జైరామ్ ఠాకూర్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. మరో రాజ్‌పుత్ నేత అజయ్ జమ్వాల్ పేరు కూడా విన్పిస్తోంది. కేంద్ర అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కూడా అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల నుంచే సీఎం అభ్యర్థిని ఎంపిక చేయవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నడ్డా బ్రాహ్మణ వర్గ నేత కావడంతో ఆయనకు అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన మొహిందర్ సింగ్, మరో సీనియర్ నేత రాజీవ్ బిందాల్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సురేశ్ భరద్వాజ్, మరో నేత క్రిష్ణన్ కపూర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌లను పార్టీ పరిశీలకులుగా బీజేపీ ప్రకటించింది. -
సరికొత్తకళ
చెన్నై, సాక్షి ప్రతినిధి: కొత్త ప్రభుత్వానికి కొత్త ముఖాలతో సరికొత్త కళ తేవాలని అన్నాడీఎంకే అభిప్రాయంగా ఉంది. పాత ముఖాలను పార్టీ నుంచి సాగన ంపడం ద్వారా కొత్త ముఖాలకు మార్గం సుగమం చేసుకునే విధానం పార్టీలో కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మే 16వ తేదీన పోలింగ్. అంటే సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. అన్ని పార్టీలతోపాటు అన్నాడీఎంకే సైతం అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. ఈసారి ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అమ్మ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాధికులు, యువకులు, మహిళ లు, పార్టీ పోరాటాల్లో పాల్గొని జైలు కెళ్లినవా రు, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులను గు ర్తించి ఎంపిక చేయనున్నారు. కొత్తవారు అనేక సమస్యల్లో చిక్కుకున్నవారా, పార్టీ అభివృద్ధికి పాటుపడినవారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఆయా అర్హతలతో కూడిన అభ్యర్థుల ఎంపిక జయ పర్యవేక్షణలో సిద్ధంఅవుతోంది. పార్టీలతో బిజీబీజీ: కూటమిపై ప్రాథమిక చర్చల్లో మంత్రుల బృందం బిజీబిజీగా గడుపుతుండగా, వివిధ పార్టీలతో తుదివిడత చర్చలతోపాటు తన పార్టీ ప్రక్షాళన చేయడంలో అమ్మ హడావుడిగా ఉన్నారు. చిన్నపార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలో దిగేందుకు జయలలిత సిద్ధమవుతున్నారు. మొత్తం 234 స్థానాల్లో 200 స్థానాలకు తక్కువ కాకుండా తమ అభ్యర్థులను పోటీపెట్టాలని అమ్మ ఆకాంక్ష. మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించాలని భావిస్తున్నారు. పార్టీ అధినేత్రి జయలలిత మిత్రపక్షంగా ఉండేందుకు ఇష్టపడుతున్న ఏడు పార్టీల నేతలను సోమవారం పిలిచి మాట్లాడారు. ఇండియ కుడియరసు పార్టీ, తమిళగ వాళ్వురిమై పార్టీ, ఇండియ తవ్హిద్ జమాత్, అఖిలభారత ఫార్వర్డ్‌బ్లాక్, తమిళ మానిల ముస్లింలీగ్, కొంగుపేరవై, సమత్తువ మక్కళ్ పార్టీల నేతలు పోయెస్ గార్డెన్లో జయతో చర్చలు జరిపారు. తమిళగ మక్కల్ మన్నేట్ర కళగం అన్నాడీఎంకేకు మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కోసం మరో ఐదు పార్టీలు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళమానిల కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చి, పురట్చి భారతం, ఇండియ ఉళవర్ ఉళైప్పాలర్ కట్చి, మూవేందర్ మున్నేట్ర కళగం పార్టీలు జయలలిత పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఐదు పా ర్టీలతో మంత్రి నత్తం విశ్వనాథం నేతృత్వం లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో పురోగతి చోటుచేసుకున్న పక్షంలో జయలలి త నుంచి పిలుపు వస్తుంది. ఎన్నికల మేని ఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపికపై జయకు సహాయపడేందుకు పార్టీ సీనియర్ నేత బన్రుట్టి రామచంద్రన్ తదితర 14 మందితో కూడిన బృందం పనిచేస్తోంది. మరో మంత్రి అనుచరులకు ఉద్వాసన: అన్నాడీఎంకే ప్రక్షాళన పర్వం, పార్టీ శ్రేణుల్లో ఆందోళన పర్వం కొనసాగుతోంది. మంత్రు ల నుంచి సాధారణ నేత వరకు క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారు. మంత్రు లు, మంత్రుల అనుచరులు పార్టీ నుంచి బ హిష్కృతులవుతున్నారు. మంత్రులు రమణ, టీకేఎమ్ చిన్నస్వామి తమ పదవులను కోల్పోగా, మంత్రులు పన్నీర్‌సెల్వం, విజయభాస్కర్ స్నేహితుడు ఏకంగా అరెస్టయ్యాడు. ఇక తాజాగా మంత్రి నత్తం విశ్వనాథంకు చెం దిన ముగ్గురు అనుచరులపై వేటుపడింది. దిండుగల్లు జిల్లా కార్మిక విభాగం కార్యదర్శి ఎమ్ ధర్మలింగం, శానార్పట్టి యూనియన్ సహాయ కార్యదర్శి సుబ్రమణిలను ఆమె తొలగించారు. అలాగే నత్తం అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎస్ సెల్వరాజ్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. పార్టీ కోశాధికారిగా ఉండిన మంత్రి పన్నీర్‌సెల్వంను ఆ బాధ్యతల నుంచి జయలలిత ఇటీవలే తప్పించారు. కోశాధికారిగా మంత్రి సెల్లూరురాజాను నియమించాలని పార్టీ ఆలోచిస్తోంది. అయితే ‘అమ్మ’బాబాయ్ ఆ పదవి నాకొద్దు అంటూ సెల్లూరురాజా భయపడుతున్నట్లు సమాచారం. కోశాధికారి పదవి అంటే ఆర్థిక లావాదేవీలతో కూడుకున్నదని, ఏమాత్రం తేడా వచ్చిన వేటుఖాయమనే కారణంగా మంత్రి తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం.