సరికొత్తకళ
చెన్నై, సాక్షి ప్రతినిధి: కొత్త ప్రభుత్వానికి కొత్త ముఖాలతో సరికొత్త కళ తేవాలని అన్నాడీఎంకే అభిప్రాయంగా ఉంది. పాత ముఖాలను పార్టీ నుంచి సాగన ంపడం ద్వారా కొత్త ముఖాలకు మార్గం సుగమం చేసుకునే విధానం పార్టీలో కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మే 16వ తేదీన పోలింగ్. అంటే సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. అన్ని పార్టీలతోపాటు అన్నాడీఎంకే సైతం అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. ఈసారి ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అమ్మ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాధికులు, యువకులు, మహిళ లు, పార్టీ పోరాటాల్లో పాల్గొని జైలు కెళ్లినవా రు, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులను గు ర్తించి ఎంపిక చేయనున్నారు. కొత్తవారు అనేక సమస్యల్లో చిక్కుకున్నవారా, పార్టీ అభివృద్ధికి పాటుపడినవారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఆయా అర్హతలతో కూడిన అభ్యర్థుల ఎంపిక జయ పర్యవేక్షణలో సిద్ధంఅవుతోంది.
పార్టీలతో బిజీబీజీ: కూటమిపై ప్రాథమిక చర్చల్లో మంత్రుల బృందం బిజీబిజీగా గడుపుతుండగా, వివిధ పార్టీలతో తుదివిడత చర్చలతోపాటు తన పార్టీ ప్రక్షాళన చేయడంలో అమ్మ హడావుడిగా ఉన్నారు. చిన్నపార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలో దిగేందుకు జయలలిత సిద్ధమవుతున్నారు. మొత్తం 234 స్థానాల్లో 200 స్థానాలకు తక్కువ కాకుండా తమ అభ్యర్థులను పోటీపెట్టాలని అమ్మ ఆకాంక్ష. మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించాలని భావిస్తున్నారు. పార్టీ అధినేత్రి జయలలిత మిత్రపక్షంగా ఉండేందుకు ఇష్టపడుతున్న ఏడు పార్టీల నేతలను సోమవారం పిలిచి మాట్లాడారు. ఇండియ కుడియరసు పార్టీ, తమిళగ వాళ్వురిమై పార్టీ, ఇండియ తవ్‌హిద్ జమాత్, అఖిలభారత ఫార్వర్డ్‌బ్లాక్, తమిళ మానిల ముస్లింలీగ్, కొంగుపేరవై, సమత్తువ మక్కళ్ పార్టీల నేతలు పోయెస్ గార్డెన్‌లో జయతో చర్చలు జరిపారు.
తమిళగ మక్కల్ మన్నేట్ర కళగం అన్నాడీఎంకేకు మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కోసం మరో ఐదు పార్టీలు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళమానిల కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చి, పురట్చి భారతం, ఇండియ ఉళవర్ ఉళైప్పాలర్ కట్చి, మూవేందర్ మున్నేట్ర కళగం పార్టీలు జయలలిత పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఐదు పా ర్టీలతో మంత్రి నత్తం విశ్వనాథం నేతృత్వం లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో పురోగతి చోటుచేసుకున్న పక్షంలో జయలలి త నుంచి పిలుపు వస్తుంది. ఎన్నికల మేని ఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపికపై జయకు సహాయపడేందుకు పార్టీ సీనియర్ నేత బన్రుట్టి రామచంద్రన్ తదితర 14 మందితో కూడిన బృందం పనిచేస్తోంది.
మరో మంత్రి అనుచరులకు ఉద్వాసన:
అన్నాడీఎంకే ప్రక్షాళన పర్వం, పార్టీ శ్రేణుల్లో ఆందోళన పర్వం కొనసాగుతోంది. మంత్రు ల నుంచి సాధారణ నేత వరకు క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారు. మంత్రు లు, మంత్రుల అనుచరులు పార్టీ నుంచి బ హిష్కృతులవుతున్నారు. మంత్రులు రమణ, టీకేఎమ్ చిన్నస్వామి తమ పదవులను కోల్పోగా, మంత్రులు పన్నీర్‌సెల్వం, విజయభాస్కర్ స్నేహితుడు ఏకంగా అరెస్టయ్యాడు. ఇక తాజాగా మంత్రి నత్తం విశ్వనాథంకు చెం దిన ముగ్గురు అనుచరులపై వేటుపడింది.
దిండుగల్లు జిల్లా కార్మిక విభాగం కార్యదర్శి ఎమ్ ధర్మలింగం, శానార్‌పట్టి యూనియన్ సహాయ కార్యదర్శి సుబ్రమణిలను ఆమె తొలగించారు. అలాగే నత్తం అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎస్ సెల్వరాజ్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. పార్టీ కోశాధికారిగా ఉండిన మంత్రి పన్నీర్‌సెల్వంను ఆ బాధ్యతల నుంచి జయలలిత ఇటీవలే తప్పించారు. కోశాధికారిగా మంత్రి సెల్లూరురాజాను నియమించాలని పార్టీ ఆలోచిస్తోంది. అయితే ‘అమ్మ’బాబాయ్ ఆ పదవి నాకొద్దు అంటూ సెల్లూరురాజా భయపడుతున్నట్లు సమాచారం. కోశాధికారి పదవి అంటే ఆర్థిక లావాదేవీలతో కూడుకున్నదని, ఏమాత్రం తేడా వచ్చిన వేటుఖాయమనే కారణంగా మంత్రి తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం.