వైద్యం అందక గర్భిణి మృతి
సీలేరు: సీలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతిచెందింది. కొమ్మలవాడకు చెందిన గిరిజన మహిళ పొయితకు పురిటినొప్పులు రావడంతో శనివారం మధ్యాహ్నం అంబులెన్సులో సీలేరు పీహెచ్సీకి తీసుకువచ్చారు.
అక్కడ వైద్యులు లేకపోవడం, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పొయిత మృతిచెందింది. కడుపులో బిడ్డ కూడా మృతిచెందింది. వైద్యులు లేక సకాలంలో వైద్యం అందనందువల్లే నిండు గర్భిణి మృతిచెందిందని బంధువులు ఆరోపించారు. ఇక్కడ తరుచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, వైద్యులు సరిగా విధులు నిర్వహించడంలేదని స్థానికులు చెబుతున్నారు.