self-driving
-
రయ్..రయ్ లెవల్ 5 కార్లు!
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : నిత్యం రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. మితివీురిన వేగం, నిద్ర మత్తు లాంటి మానవ తప్పిదాలే దీనికి ప్రధాన కారణం. వీటిని దాదాపు సంపూర్ణంగా అరి కట్టడంతోపాటు వాహనం స్టార్ట్ చేసిన దగ్గ ర నుంచి గమ్యస్థానం వరకు ఆటోపైలట్ మోడ్‌లో పనిచేసే పూర్తి అటానమస్ కార్లను రూపొందించే ప్రయత్నాలు ఊపందుకున్నా యి. వీటికి డ్రైవర్ల అవసరం ఉండదు. ఈ ప్రయోగాలకు ఇప్పటి వరకు అమెరికాలోనే 7,500 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా. అక్కడ 30 సంస్థలు ఈ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. మిగతా దేశాల్లోనూ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెవల్–5లో పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అమెరికాలో 26 కంపెనీలు 1,174 అటానమస్ కార్లను ప్రయోగాత్మకంగా 64 లక్షల కిలోమీటర్లు రోడ్ల మీద నడిపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిని పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లతో తయారు చేసినప్పటికీ నాలుగు కంపెనీలు మాత్రమే డ్రైవర్ లేకుండా 16 వాహనాలను దాదాపు 40 వేల కిలో మీటర్లు తిప్పి పరీక్షించాయి. అమెరికా మో టారు వెహికల్ డిపార్ట్మెంట్ రూపొందించిన నిబంధనల ప్రకారం ‘లెవల్ జీరో నుంచి లెవల్ 5’ వరకు మొత్తం ఆరు స్థాయిలు గా ఈ వాహనాలను వర్గీకరించారు. లెవల్ జీరోలో ప్రస్తుత సంప్రదాయ కార్లు ఉండగా లెవల్–5లో పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లుంటాయి. వివిధ కంపెనీల ప్రయోగ ఫలితాలను విశ్లేషిస్తే ప్రస్తుతం లెవల్–3 స్థాయి వరకే చేరుకున్నట్లు వెల్లడవుతోంది. త్వరలో సాకారం.. సైన్స్ ఫిక్షన్‌కే పరిమితమైన సెల్ఫ్ డ్రైవ్ వాహనాలు త్వరలో రోడ్డెక్కుతాయని ‘ది గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ ఇంజనీరింగ్ అసోసియేషన్’(ఎస్‌ఏఈ) ఆశాభావంతో ఉంది. అటానమస్ వాహనాల తయారీ కంపెనీలకు ఈ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది. లెవల్–4 వాహనాలు రోడ్డెక్కిన కొంత కాలం త ర్వాత నిజమైన అటానమస్ వాహనాల (లెవల్ 5) స్వప్నం సాకారమవుతుందని అంచనా వేస్తోంది. ఉపయోగాలెన్నో.. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దూసుకెళ్లే పూర్తి సెల్ఫ్ డ్రైవ్ వాహనాల కల సాకారమైతే రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మానవ తప్పిదాలతో పోలిస్తే సాఫ్ట్వేర్ తప్పిదాల సంఖ్య బహు స్వల్పం. పూర్తిస్థాయి అటానమస్ వాహనాలు రోడ్డెక్కితే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రైవింగ్ ఆటోమేషన్‌లో ‘లెవల్స్’ ఇలా లెవల్ జీరో: వాహనం పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటుంది. అధిక వేగం హెచ్చరికలు, స్థిరత్వం కోల్పోతున్నప్పుడు వచ్చే ‘బీప్’ శబ్దాలకే ఆటోమేషన్ పరిమితం. ప్రస్తుతం రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలు దాదాపు ‘లెవల్ జీరో’లోనే ఉన్నాయి. లెవల్ 1: డ్రైవర్‌కు సహాయకారిగా సపోర్టింగ్ వ్యవస్థ ఉంటుంది. నిర్ధారిత వేగంలో ప్రయాణించేలా క్రూజ్ కంట్రోల్’, లేన్ ఫాలోయింగ్ అసిస్టెన్స్ లాంటివి ఉంటాయి. అవసరమైనప్పుడు తక్షణం స్పందించి వాహనాన్ని నియంత్రించేలా డ్రైవర్ పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అధునాతన కార్లలో ఈ సదుపాయాలున్నాయి. లెవల్ 2: డ్రైవర్ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ.. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం(ఏడీఏఎస్) ద్వారా బ్రేకింగ్, వేగం పెంచడం, స్టీరింగ్ నియంత్రణ తదితర పనులు డ్రైవర్ ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి. ‘టెస్లా ఆటోపైలట్’ ఫీచర్ ఈ స్థాయి కిందకు వస్తుంది. లెవల్ 3: ఈ స్థాయి కార్లకు అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి డ్రైవర్ అవసరమే కానీ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, వ్యవస్థ విఫలమైనప్పుడు డ్రైవర్ అవసరం ఉంటుంది. సాధారణ సందర్భాల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో వాహనమే డ్రైవింగ్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. హోండా ట్రాఫిక్ జామ్ పైలట్, మెర్సిడెస్–బెంజ్ డ్రైవ్ పైలట్ తదితర కార్లు మాత్రమే ఈ స్థాయిలో ఉన్నాయి. లెవల్ 4: స్టీరింగ్, పెడల్స్ లేకుండా నడిచే కారు ఈ స్థాయి కిందకు వస్తుంది. పరిమిత వేగం, నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే ఇది నడుస్తుంది. వ్యవస్థ విఫలమయినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా వాహన వేగం నెమ్మదించి ఆగిపోతుంది. సెల్ఫ్ డ్రైవ్ ట్యాక్సీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని అనుమతుల కోసం కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నా ఇంకా పూర్తిస్థాయి ఆమోదం లభించలేదు. లెవల్ 5: పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవ్ కార్లు ఈ స్థాయిలో ఉంటాయి. గమ్యస్థానాన్ని సెట్ చేసి నింపాదిగా కూర్చోవడమే మనుషుల పని. పేపర్ చదువుకుంటూ, సినిమా చూస్తూ కూర్చుంటే కారు గమ్యస్థానానికి చేరుస్తుంది. మానవ ప్రమేయం అవసరమే ఉండదు. వేగానికి పరిమితులు ఉండవు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సురక్షితంగా ప్రయాణించగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయి వాహనాల సొంతం. ఇవి ఇంకా ప్రయోగాల దశ దాటలేదు. వీటిని అభివృద్ధి చేయడానికి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. -
ఈలాన్‌మస్క్ ఎక్కడ.. చైనా అప్పుడే మొదలెట్టింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిటికలెస్తూ ట్విటర్‌ను క్షణాల్లో కొనేసిన ఈలాన్ మస్క్‌కి ఇప్పటికీ ఓ కోరిక అలాగే ఉండిపోయింది. టెస్లా కార్లలో ఆటోపైలెట్కి అనుమతి సాధించేందుకు ఏళ్ల తరబడి ఈలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశించిన ఫలితం పొందలేదు. మరోవైపు చైనా చాప కింద నీరులా ఈ పని చేసేసింది. చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు ప్రపంచంలో తొలిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో 100 రోబోట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్ దక్కించుకుంది. అలాగే బీజింగ్ నగరంలోనూ సేవలు ఆఫర్ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం బైడూ లైసెన్స్ పొందింది. 2021 నవంబరు.. బీజింగ్‌లో 67 అటానమస్ (డ్రైవర్ రహిత) వెహికిల్స్ పరీక్షల కోసం పోనీ.ఏఐ 2021 నవంబర్‌లో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 7,00,000 ట్రిప్స్ పూర్తి చేసింది. 80 శాతం రైడర్స్ పాత కస్టమర్లేనని కంపెనీ తెలిపింది. క్వాంజో నగరంలోని ఇతర ప్రాంతాలతోపాటు చైనాలో ప్రథమ శ్రేణి నగరాల్లోనూ రోబోట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి మొదలు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ అటానమస్ వాహనంలో డ్రైవర్ కూడా ఉంటారు. ఈ రెండు కంపెనీలూ రానున్న రోజుల్లో డ్రైవర్ లేకుండానే సేవలు అందించనున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన పోనీ.ఏఐ కంపెనీని జేమ్స్ హంగ్, టించెంగ్ లూహ్ 2016లో స్థాపించారు. చదవండి: ‘దిగంతర’ స్పేస్ స్టార్టప్'.. ఇంజనీరింగ్ విద్యార్థుల సక్సెస్ స్టోరీ -
సెల్ఫ్ డ్రైవింగ్ టూ వీలర్లు
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీలో పేరెన్నికగన్న బీఎండబ్లూ కంపెనీ తానంతట తానే నడుపుకుపోయే ద్విచక్ర వాహనాన్ని అంటే, సెల్ఫ్ డ్రైవింగ్ బైక్‌ను తయారు చేసింది. రెండేళ్లపాటు శ్రమించి ‘ఆర్1200 జీఎస్’ పేరిట తయారు చేసిన ప్రోటోటైప్ మోడల్‌కు సంబంధించిన వీడియోను కంపెనీ శనివారం నాడు విడుదల చేసింది. మానవ ప్రయత్నం లేకుండానే ఈ బైక్ తానంతటన తనే స్టార్ట్ అవుతుంది. యాక్సిలేటర్ ద్వారా వేగాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత వేగాన్ని తగ్గించుకొని తానంతట తానే బ్రేక్ వేసుకుంటుంది. స్టాండ్ కూడా వేసుకొని ఆగిపోతుంది. వీడియోలో కంపెనీ సేఫ్టీ ఇంజనీరు స్టీఫన్ హాన్స్ మాట్లాడుతూ మానవులు నడిపే బైకుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన మరిన్ని భద్రతా చర్యల గురించి తెలసుకోవడానికే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోటోటైప్ మోడల్‌ను విడుదల చేశామని చెప్పారు. శాస్త్ర పరిశోధనల కోసం, వాణిజ్య అవసరాల కోసం ఈ బైక్‌ను రూపొందించినప్పటికీ ఇప్పట్లో ఈ బైకులు మార్కెట్లోకి రాకపోవచ్చని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రోటోటైప్ బైక్ ద్వారా బైకులు నడిపేటప్పుడు మానవులు చేసే తప్పిదాలు ఏమిటో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా ఇప్పటికీ ప్రయోగాల దశలోనే ఉన్న విషయం తెల్సిందే. అవి మార్కెట్లోకి విడుదలయ్యాకే అలాంటి టూ వీలర్లు రావచ్చు. -
ఎయిర్ ట్యాక్సీ బస్
ప్రపంచ జనాభాతో పాటు ప్రయాణ, రవాణా వాహనాలూ పెరిగిపోతున్నాయి. ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా, ఎన్ని సొరంగ మార్గాలు తవ్వినా ట్రాఫిక్ తగ్గడం లేదు. ఈ సమస్యకు పరిష్కారమే... భవిష్యత్తులో రాబోతున్న ఎయిర్ ట్యాక్సీలు! ఎయిర్‌బస్ కంపెనీ నుంచి వస్తోన్న ఎయిర్ ట్యాక్సీ ఇది. అయితే పదేళ్లు ఓపిక పట్టాలి! ఆ తరువాత మీకు ట్రాఫిక్ చికాకులు ఉండవు. కాలుష్యం బాధ అసలే ఉండదు. ఆఫీసుకు లేటవుతామేమో అన్న బెంగకూ గుడ్‌బై చెప్పవచ్చు! ఎందుకలా అంటే... పక్కనున్న ఫొటో చూడండి! ఇలాంటి డ్రోన్లు మిమ్మల్ని ఇంటి నుంచి ఆఫీసులో దిగబెడతాయి. పనైపోగానే మళ్లీ ఇళ్లకు చేరుస్తాయి కూడా! అబ్బో... ఇలాంటివి చాలా చూశాం. విన్నాం కూడా. ఇది మాత్రం అందుబాటులోకి వస్తుందన్న గ్యారెంటీ ఏమిటి? ఇదేనా మీ సందేహం. ఓకే.. ఏదో ఊరు పేరు లేని, చిన్నా చితక కంపెనీ తాము ఇలాంటి హైటెక్ డ్రోన్లు తయారు చేస్తున్నామంటే నమ్మలేకపోవచ్చుగానీ... ప్రపంచంలోనే అతికొద్ది విమాన సంస్థల్లో ఒకటైన ఎయిర్‌బస్ (ఫ్రాన్స్) ఈ మాట అంటే దానికి విలువ ఉంటుంది కదా! అవునండీ. 2027 నాటికల్లా తాము పైలట్ అవసరం లేని ఎయిర్ ట్యాక్సీలు సిద్ధం చేస్తామని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగురుతూ కనిపిస్తాయని బల్లగుద్ది మరీ చెబుతోంది. ‘వాహన’ పేరుతో ఎయిర్‌బస్ ఇందుకు శ్రీకారం చుట్టింది కూడా. 2030 నాటికల్లా మహానగరాల్లో జనాభా గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతాయని, అందువల్లనే తాము ట్రాఫిక్ బాదరబందీలేవీ లేకుండా వాయుమార్గ ప్రయాణాన్ని సాకారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అంటోంది. పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీలకు అవసరమైన టెక్నాలజీలు అన్నీ అందుబాటులో ఉన్నా... గాల్లో ప్రమాదాలను గుర్తించి, తగ్గట్టుగా స్పందించే నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ఇంకా అభివృద్ధి కాలేదని ఎయిర్‌బస్ ఉన్నతాధికారి ఒకరు అంటున్నారు. ‘వాహన’ ప్రాజెక్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైందని, వచ్చే ఏడాది చివర్లో ఫ్లైట్ టెస్ట్‌లు మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో పదేళ్లలో ఈ ‘వాహనా’లు అందుబాటులోకి వస్తాయన్నమాట!