మీ రోడ్డు మీద గొయ్యి పడిందా?
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. ద్విచక్ర వాహనాలు గానీ, కార్లు, బస్సులు గానీ వేటిలో వెళ్లినా నడుం పడిపోతోంది. సర్కస్ ఫీట్లు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఎన్నిసార్లు రిపేర్లు చేసినా, ఒక్క వర్షానికే మళ్లీ గజం లోతు గుంతలు పడుతున్నాయి. మీరు ప్రతిరోజూ వెళ్లే రోడ్డులో కూడా ఇలాగే గుంతలు పడ్డాయా? అయితే.. వెంటనే మీ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. దాంతో గుంత దగ్గరే ఓ సెల్ఫీ తీసుకుని 'సాక్షి'కి పంపండి. నాణ్యత బాగున్న ఫొటోలను సాక్షి వెబ్సైట్లో ప్రచురించి, ఆ ప్రాంత సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
పంపాల్సింది ఇలా...
మీ స్మార్ట్ఫోన్లో సాక్షి న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో పైన ఉండే 'సాక్షి' లోగో మీద ట్యాప్ చేస్తే మెనూలో మీకు 'ప్రత్యక్ష సాక్షి' అనే ఐకాన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్లి, అక్కడే ఉన్న కెమెరా సింబల్ నుంచి ఫొటో తీసుకుని, మీ వివరాలతో పంపితే సరిపోతుంది. డిస్క్రిప్షన్లో #selfiewithpothole అని పెట్టడం మర్చిపోకండి.