హారిక సెమీస్ గేమ్ ‘డ్రా’
నేడు టైబ్రేక్
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు చేరేదెవరో మంగళవారం తేలనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత టైబ్రేక్‌కు దారితీసింది. ఆదివారం వీరిద్దరి మధ్య జరిగిన తొలి గేమ్ ‘డ్రా’గా ముగియగా... సోమవారం జరిగిన రెండో గేమ్ కూడా ‘డ్రా’ అయింది. దాంతో ఇద్దరూ 1-1తో సమఉజ్జీగా నిలిచారు.
రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 78 ఎత్తుల తర్వాత ‘డ్రా’కు అంగీకరించింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్), నటాలియా పోగోనినా (రష్యా)ల మధ్య రెండో సెమీఫైనల్లో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1-1తో సమంగా ఉన్నారు. తొలి గేమ్‌లో క్రామ్లింగ్ 79 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్‌లో పోగోనినా 38 ఎత్తుల్లో విజయం సాధించింది. దాంతో రెండు సెమీఫైనల్స్ విజేతలను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు.