విమానాశ్రయం.. అదుర్స్
ఎయిర్పోర్ట్ టెర్మినల్ అదుర్స్ కదూ.. చైనాలోని గువాంగ్‌డాంగ్‌లో ఇటీవల ప్రారంభమైన షెంజెన్బావో అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ ఇది. టేకు చేప ఆకారంలో దీన్ని కట్టారు. టెర్మినల్ పైకప్పు తేనెపట్టు డిజైన్‌ను తలపిస్తుంది. పైన అద్దాలను అమర్చడం వల్ల టెర్మినల్ లోపలి భాగానికి సూర్యకాంతి ధారాళంగా వెళ్తుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అంతేకాదు.. వర్షపు నీటిని నిల్వ చేసి.. దాన్ని రీసైకిల్ చేసి.. బాత్రూంలకు, మొక్కలకు వాడతారు. ఇందులో 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. అంతేనా.. ఇంటీరియర్ డిజైన్‌కు తగ్గట్లు ఏసీలు కూడా తెల్లటి చెట్టు మోడు ఆకారంలో ఉంటాయి. ఇంతకీ దీన్ని కట్టడానికి ఎంత అయిందో తెలుసా? రూ.8,700 కోట్లు.